Big Stories

Paritala Sunitha Vs Thopudurthi Prakash Reddy: పరిటాల దెబ్బకు.. స్వామిజే దిక్కు..!

Paritala Sunitha Vs Thopudurthi Prakash Reddy – AP Election 2024: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆ సెగ్మెంట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్రంలోని హాట్ హాట్ నియోజకవర్గాల్లో అది ముందు వరుసలో నిలుస్తుంది. టీడీపీకి పెట్టని కోట లాంటి ఆ స్థానాన్ని గత ఎన్నికల్లో వైసీపీ కైవశం చేసుకుంది. అలాంటి సెగ్మెంట్లో సదరు ఎమ్మెల్యే ఈ సారి దేవుడిపైనే భారం వేసినట్లు కనిపిస్తున్నారు. ప్రజలకన్నా ఎక్కువగా పూజలు, స్వామీజీలకే ప్రాధాన్యమిస్తున్నారు. ఇంతకీ ఆ సెగ్మెంట్ ఏది? ఎవరా ఎమ్మెల్యే అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరీ.

- Advertisement -

ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటుంది. దశాబ్దన్నర కాలంగా ఈ ప్రాంతంలో పరిటాల కుటుంబం తోపుదుర్తి ఫ్యామిలీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ప్రస్తుత ఎన్నికల సీజన్లో నియోజకవర్గంలో రాజకీయ వేడి మరింత పెరిగిపోతుంది. రాప్తాడులో వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన మాజీమంత్రి పరిటాల ఫ్యామిలీకి గత ఎన్నికల్లో చేదు అనుభవం మిగిలింది. 2019లో పరిటాల శ్రీరామ్ పోటీలో నిలిస్తే సునీత ప్రచారానికి పరిమితమయ్యారు. చిరకాల రాజకీయ ప్రత్యర్ధి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి వారిపై విజయం సాధించారు.

- Advertisement -

అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య విమర్శల కంటే సవాళ్లు, ప్రతి సవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి. ఇప్పుడు నామినేషన్ల సమయం కూడ వచ్చేసింది. రాప్తాడులో ఇరు ప్రధాన పార్టీల నేతలు ఓక సెట్ నామినేషన్లు కూడా దాఖలు చేశారు. కానీ వైసీపీ నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు అభ్యర్ధి అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే మాత్రం హాజరుకాలేదు. అంత కీలక సమయంలో ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళారా అని ఆరా తీస్తే స్వామీజీల దగ్గరకు వెళ్ళారని బయటపడింది. ఇంత కీలక సమయంలో స్వామీజీ దగ్గరికి వెళ్లడమేంటని నియోజకవర్గంలో చర్చ మొదలైంది.

Also Read: సొంత ఎమ్మెల్యే సెగ..నాకు వద్దు బాబోయి!

హిందూపురం లోక్‌సభ స్థానం పరిధిలోకి వచ్చే రాప్తాడు నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, టీడీపీ నుంచి పరిటాల సునీత మరో సారి పోటీ పడుతున్నారు. ఇద్దరూ ప్రచారంలో తలమునకలై ఉన్నారు. రాప్తాడులో ఈసారి టఫ్ ఫైట్ ఉందని వివిధ సర్వేలు, గ్రౌండ్ రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. ఎవరు గెలిచినా గొప్పగా చెప్పుకునే మెజార్టీ దక్కదంటున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన సానుభూతి, అధికార పార్టీపై వ్యతిరేకత , రాప్తాడులో అభివృద్ది కార్యక్రమాలు జరగకపోవడం వంటివి సునీతకు సానుకూలాంశాలుగా కనిపిస్తున్నాయి.

ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరులు, అనుచరుల అక్రమాలను పరిటాల సునీత ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. అలాగే నియోజకవర్గంలో వైసీపీ కీలక నేతలను టీడీపీలో చేర్చుకుంటున్నారు. ఇక జనసేనతో పొత్తు కూడా తమకు ప్లస్ అవుతుందని టీడీపీ శ్రేణులు ధీమాతో ఉన్నాయి. మరోవైపు రాప్తాడులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడంలేదని స్వయంగా ప్రకాష్ రెడ్డే ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఓ ప్రెస్‌మీట్ లో ప్రకాష్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను సునీత బాగా వైరల్ చేస్తున్నారు.

గత డిసెంబరులో ప్రకాష్‌రెడ్డి మీడియా ముందుకొచ్చి మాట్లాడుతూ నియోజకవర్గానికి తాను ఎంతో చేయాలనుకున్నానని ఏమీ చేయలేకపోయానని వ్యాఖ్యానించారు. అందుకు తన మీద తనకే చాలా అసంతృప్తిగా ఉందన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అప్పుల కారణంగా వైసీపీ ప్రభుత్వానికి నిధుల సమస్య వస్తోందన్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా రాప్తాడు నియోజకవర్గంలో 100 రోజుల్లో రోడ్ల నిర్మాణం పూర్తిచేస్తామని రోడ్లు పూర్తి చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని స్టేట్‌మెంట్ ఇచ్చారు.

అయితే రోడ్ల పనులు కాకుండానే ఆయన తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని టీడీపీ విమర్శలు గుప్పిస్తుంది. తమ సొంత గ్రామానికి 5 ఏళ్లు రోడ్డు వేయలేక ఎన్నికలకు రెండు నెలల ముందు తూతూ మంత్రంగా రోడ్డు వేశారని పరిటాల సునీత ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. రాప్తాడులో తోపుదుర్తిపై రెండు సార్లు గెలిచినప్పటికీ సునీత మెజార్టీ 8 వేలు దాటలేదు. గత ఎన్నికల్లో మాత్రం ప్రశాష్‌రెడ్డి 25 వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. అయితే ఈ సారి గత ఎన్నికల మాదిరి పూర్తి వన్ సైడ్ ఉండదని.. గట్టి పోటీ తప్పదంటున్నారు.

Also Read: ‘మా అన్నయ్య అజాత శత్రువు.. ఆయన జోలికొస్తే సహించేది లేదు’.. సజ్జలకు పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్

ఎన్నికల వేడి రాజుకున్న సమయంలో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి దాదాపు ఒక వారం రోజులు పాటు ప్రచారానికి దూరంగా హైదరాబాద్, విజయవాడ వెళ్లి వచ్చారు. ఎందుకా అని ఆరా తీస్తే ఓ స్వామీజీని కలవడానికని తెలిసింది. ఆ స్వామీజీ అంటే ప్రకాష్‌రెడ్డికి సెంటిమెంట్ అంట. అందుకే హైదరాబాద్ వెళ్లి స్వామీజీ ఆశీర్వాదం తీసుకొని వచ్చారని తెలిసింది. గత ఎన్నికల్లో ఆ స్వామీజీ ఆశీర్వాదం వల్లనే గెలిచానని ఆయనే స్వయంగా చెప్పుకుంటారు.

ఈసారి కూడా గెలవాలని హైదరాబాద్‌లో ఆ స్వామీజీ ఆశీర్వాదం తీసుకొని  తర్వాత విజయవాడ కు వచ్చి తమ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లి ఆయన ఆశీస్సులు కూడా తీసుకుని తిరిగి వచ్చారంట. ఎమ్మెల్యే స్వామీజీ టూరులో ఉన్నప్పుడు ఆయన కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారంలో తిరగాల్సి వచ్చింది. ఓటమి భయంతోనే ప్రకాష్‌రెడ్డి స్వామీజీ మఠాల చుట్టూ తిరుగుతున్నారని పరిటాల వర్గం విమర్శలు గుప్పిస్తుంది. మరి చూడాలి ఈ సాని తోపుదుర్తికి స్వామీజీ సెంటిమెంట్ ఎంత వరకు కలిసి వస్తుందో..

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News