Pushpa 2 First Song Releasing on May 1st Week: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప2’ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. యావత్ ప్రపంచ సినీ ప్రియులు సైతం ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ వరల్డ్ వైడ్‌గా మంచి రెస్పాన్స్ అందుకుంది. అందువల్లనే సెకండ్ పార్ట్‌పై మేకర్స్ ఫుల్ ఫోకస్ పెట్టారు.
ఇందులో భాగంగానే దర్శకుడు సుకుమార్ ఈ మూవీని అత్యంత గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు. ఏ విషయంలోనూ తగ్గేదే లే అన్నట్లుగా ముందుకు దూసుకుపోతున్నాడు. అయితే ఇటీవలే అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసి మేకర్స్ ఫుల్ ట్రీట్ ఇచ్చారు.
కేవలం జాతర క్యాస్ట్యూమ్, జాతర యాక్షన్‌తో సినీ ప్రియులకు ఎనర్జీని అందించారు. అందులో బన్నీ జాతర లుక్ చూసి అంతా అవక్కాయ్యారు. ఇలాంటి లుక్‌లో బన్నీ అన్నను ఎప్పుడూ చూడలేదంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపించారు. ఈ టీజర్‌తో సినిమాపై మరింత హైప్ పెంచేశారు మేకర్స్. అయితే ఇప్పుడు మరొక అప్డేట్ కోసం సినీ ప్రియులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అలాంటి వారికోసం తాజాగా ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ అప్డేట్ తాజాగా బయటకొచ్చింది. ‘పుష్ప2’ మూవీలోని ఓ మాస్ సాంగ్‌ను మే మొదటి వారంలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు కానీ.. ఈ గాసిప్‌తో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: ‘పుష్ప2’లో అల్లు అర్జున్‌ని చంపేది ఎవరో తెలిసిపోయింది..!!
ఫస్ట్ సాంగ్ ఎలా ఉండబోతుందా?.. అంటూ చర్చించుకుంటున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఇందులో ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగపతి బాబుతో సహా మరికొంత మంది నటీ నటులు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఈ మూవీని ఫ్రాంచైజీగా చేయాలనే ఆలోచన మేకర్స్‌లో ఉందని.. పుష్ప 3 కూడా రాబోతుందని గతంలో జరిగిన బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్‌లో నటుడు బన్నీ తెలిపిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. కాగా పుష్ప 2 మూవీ అన్ని పనులు పూర్తి చేసుకుని ఆగస్టు 15న గ్రాండ్‌గా విడుదల కానుంది.