BigTV English

Bayya Sunny Yadav -NIA : బయ్యా సన్నీయాదవ్ అరెస్టు వెనుక అసలు నిజాలు..

Bayya Sunny Yadav -NIA : బయ్యా సన్నీయాదవ్ అరెస్టు వెనుక అసలు నిజాలు..

Bayya Sunny Yadav -NIA : సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లను పాకిస్తాన్ అస్త్రంగా వాడుకుందా? ఇన్ఫర్మేషన్ సంపాదించేందుకు చాలా ప్రయత్నాలు జరిగినా.. సోషల్ ఇన్ ఫ్లూయెన్సర్లకు పాకిస్తాన్ లో రాచమర్యాదలు చేయించడం ద్వారా వారిని ఆకట్టుకుని ISI కూపీ లాగిందన్న వాదనలు బలపడుతున్నాయి. ఇప్పటికే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయింది. ఇప్పుడు బయ్యా సన్నీయాదవ్ వంతు వచ్చిందంతే. వీళ్లు బార్డర్ దాటి అందించిన సమాచారమేంటి? దర్యాప్తు సంస్థల విచారణలో ఏం తేలుతోంది?


పాక్‌కు నాలుగుసార్లు టూర్

పాకిస్తాన్ అన్ని రకాల కంటెంట్ బ్యాన్.. పాక్ వీడియోలు పోస్ట్ చేయొద్దు.. భారత ఆర్మీ వివరాలు చెప్పొద్దు.. మన సైన్యం కదలికలు చూపొద్దు.. ఇదీ భారత్ పాక్ ఉద్రిక్తతల సమయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అడ్వైజరీ. కానీ కొందరు అదే పనిగా.. ఈ అడ్వైజరీకి వ్యతిరేకంగా పని చేశారు. మొన్న జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయితే.. ఇప్పుడు బయ్యా సన్నీయాదవ్ వంతు వచ్చింది. ఆయన్న NIA అదుపులోకి తీసుకుంది. పాకిస్తాన్ కు నాలుగుసార్లు వెళ్లిన సన్నీ అక్కడ ఏం చేశాడు.. ఎక్కడెక్కడ తిరిగాడు.. ఎవరితో మాట్లాడాడు.. ఇవన్నీ వివరాలు రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు.


తీగ లాగితే డొంక కదలింది..

నిజానికి చట్టబద్దంగా పాకిస్తాన్ వీసా తీసుకుని అక్కడికి వెళ్లడం.. ఎక్స్ ప్లోర్ చేయడం తప్పు కానే కాదు. కానీ అదే పనిగా పాకిస్తాన్ కు వెళ్లడం అంటే కథ మరోలా ఉందని అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ గురించి ఆహా ఓహో అని చెప్పడం, వారిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించి మన దేశపు వివరాలు పంచుకోవడం తప్పు. జ్యోతి మల్హోత్రా విషయాన్నే తీసుకోండి. పైకి చూస్తే ఆమె ట్రావెల్ వ్లాగర్. కానీ ఆమె వెనుక AK 47లతో పాకిస్తానీ గన్ మెన్ లు ఉండడం పెద్ద డౌట్లు క్రియేట్ చేసింది. తీగ లాగితే డొంక కదలింది. బండారం బయటపడింది.

సన్నీ చేసిన ఆ పని వల్లే..

మే 8న భారత సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పాకిస్తాన్‌లో ప్రొడ్యూస్ అయిన, పాక్ కు చెందిన అన్ని రకాల డిజిటల్ కంటెంట్‌ను భారత్ లో బ్యాన్ చేసింది. ఇందులో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు, ఇతర మీడియా కంటెంట్ ఉన్నాయి. ఇండియాలోని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, స్ట్రీమింగ్ సర్వీసెస్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ కంటెంట్‌ను తొలగించాలని ఆదేశించారు. ఎవరూ అప్ లోడ్ చేయొద్దన్నారు. చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. కానీ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ లేటెస్ట్ అప్లోడ్స్ అన్నీ పాకిస్తాన్ టూర్ కు సంబంధించినవే ఉన్నాయి. అందుకే NIA చేతిలో బుక్ అయ్యాడు. నిజంగానే గూఢచర్యం చేశాడా… చేయలేదా.. కేవలం బైక్ రైడ్ తో ఎక్స్ ప్లోర్ మాత్రమే చేశాడా.. అసలేం జరిగిందన్నది NIA విచారణలో తేలుతుంది. అది నెక్ట్స్ మ్యాటర్. కానీ పాకిస్తాన్ లో తీసిన వీడియోస్ అప్లోడ్ చేయొద్దు అని ఒకవైపు కేంద్రం సీరియస్ గా ఆదేశాలు ఇచ్చినా సన్నీ మాత్రం అవేవీ పట్టనట్లు అప్ లోడ్ చేయడమే ఇప్పుడు కీలకంగా మారింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు ఉన్న టైంలో ఎందుకు ఇలా అప్ లోడ్ చేశాడన్నది NIA తేల్చబోతోంది.

Also Read : న్యూయార్క్‌లో 400 మందితో ఇండియన్ పెళ్లి ఊరేగింపు.. రోడ్లన్నీ బ్లాక్

అందుకే అరెస్ట్..

భారత్ పాక్ ఉద్రిక్తతల టైంలో ఈ వీడియోలు పోస్ట్ చేస్తే వైరల్ అవుతాయని సన్నీ అనుకున్నాడా… యూట్యూబ్ అల్గారిథమ్ పుష్ చేస్తుందనుకున్నాడో ఏమోగానీ పాకిస్తాన్ టూర్ వీడియోలు వరుసగా అప్ లోడ్ చేస్తున్నాడు. అదే సమయంలో NIA రాడార్ కు చిక్కాడు. కేంద్ర ప్రభుత్వం వద్దన్న పని చేయడంతో ఇప్పుడు ఇరుక్కున్నాడంటున్నారు. భయ్యా సన్నీయాదవ్ ఇటీవలే పాకిస్తాన్ లో బైక్ రైడ్ పూర్తి చేశాడు. అక్కడే 2 నెలల దాకా ఉన్న సన్నీ యాదవ్ టూర్ వీడియోలను యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఇటీవలే పాకిస్తాన్‌లో బైక్ రైడ్ వీడియోలను అప్‌‌‌లోడ్ చేయడంతో పెద్ద రిస్క్ చేశాడు. టూర్ ముగించుకుని భారత్ వచ్చిన భయ్యా సన్నీ యాదవ్‌ను చెన్నై ఎయిర్‌పోర్టులో NIA అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read : పనిమనిషితో ఆ ఫ్యామిలీ మొత్తం.. వీడియో వైరల్

పాక్‌లో 2 నెలలు ఏం చేశాడు?

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌కు స్పైగా వ్యవహరించిందనే డౌట్ తో ఆమెను ఇప్పటికే అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్ఐఏ అధికారుల దృష్టి భయ్యా సన్నీ యాదవ్ పై పడిందంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఎన్ఐఏ అధికారుల సమాచారంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సన్నీ స్వగ్రామం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి వెళ్లి ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించినట్టు కూడా ప్రచారం జరిగింది. భయ్యా సన్నీయాదవ్ రెండు నెలలు పాకిస్థాన్‌లో ఏం చేశాడు? అక్కడ ఆయనకు షల్టర్ ఇచ్చింది ఎవరు? పాకిస్థాన్‌లో ఎవరెవరిని కలిశాడు? అసలు అన్ని రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఆపరేషన్ సిందూర్ జరుతుగుతున్న టైంలో అక్కడి వీడియోలను ఎందుకు అప్ లోడ్ చేశాడు? ఇలాంటి విషయాలపై ఎన్ఐఏ నజర్ పెట్టింది. బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ కు మొత్తం నాలుగుసార్లు వెళ్లాడని గుర్తించారు. ఇన్నిసార్లు ఎందుకు వెళ్లొచ్చాడన్నదే కీలకంగా మారింది.

Also Read : పాక్ సైన్యం ప్రార్థనలు చేసే లోపే.. భారత్ ఎలా అటాక్ చేసిందో చెప్పిన ప్రధాని

ఇటు బెట్టింగ్.. అటు పాకిస్తాన్..

పాకిస్థాన్ టూర్‌పై విమర్శలు రావడంతో భయ్యా సన్నీయాదవ్ ఇటీవలనే ఓ వీడియో రిలీజ్ చేశాడు. తనపై కొంతమంది తప్పుడు వీడియోలు పెడుతున్నారని, ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేయొద్దన్నాడు. సో అసలు మ్యాటర్ ఏంటో మొత్తం త్వరలోనే బయటకు రాబోతోందంటున్నాయి NIA వర్గాలు. ఇప్పటికే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన విషయంలో మార్చి 22న బయ్యా సన్నీయాదవ్‌పై సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి సన్నీ పోలీసులకు దొరకడం లేదు. విదేశాల్లో ఉన్నాడని తేలడంతో లుక్ఔట్ సర్క్యూలర్ జారీ చేశారు. ఆ కేసులో తనను అరెస్ట్ చేయొద్దంటూ ఇప్పటికే సన్నీయాదవ్ కోర్టును ఆశ్రయించాడు. సో ఒక సమస్య ఉండగానే.. పాకిస్తాన్ టూర్.. అక్కడి వీడియోలు అప్ లోడ్ చేయడం ద్వారా మరో సమస్యలు ఇరుక్కున్నాడు బయ్యా సన్నీ యాదవ్. మరి పాక్ రైడ్ వెనుక అసలు మ్యాటర్ ఏంటో తేల్చే టైం వచ్చింది.

Story By : Vidhya Sagar Reddy, BIG TV

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×