US : పెళ్లి అంటే మనకో పండగ. ఎంగేజ్‌మెంట్ నుంచి రిసెప్షన్ వరకు.. ఇండియన్ మ్యారేజెస్ అన్నీ ధూంధాంగా జరుగుతుంటాయి. ఎన్ని డబ్బులుంటే అంత గ్రాండ్‌గా. విందు, వినోదాలకు లెక్కే ఉండదు. పెళ్లికొడుకు, పెళ్లికూతుర్ని చేయడం, పసుపు కొట్టడం లాంటివి కూడా పెద్ద ఈవెంట్‌గా చేస్తాం. అన్నిట్లోకి ‘సంగీత్’, ‘బరాత్’ ఈ రెండూ మరీ హైలైట్. సంగీత్ పేరుతో పెళ్లి వారంతా ఒకచోట చేరి డ్యాన్సులు, పాటలతో తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక పెళ్లి ఊరేగింపు ( బరాత్ ) గురించి అయితే చెప్పే పనే లేదు. డీజే పెట్టి.. ధూంధాంగా ఇచ్చిపడేయడమే. ఆ పాట ఈ పాట అనే తేడా లేదు.. అన్నిటినీ రీమిక్స్ చేసేసి.. డీజే సౌండ్స్‌తో చిందులేయడమే. రోడ్డుపై పెళ్లి ఊరేగింపు వెళ్తోందంటే.. గంటల తరబడి ఆ రూటంతా జామ్. ఇండియన్ వెడ్డింగ్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే. అదే.. అమెరికాలో భారతీయుల పెళ్లి జరిగితే ఏం చేస్తారు? పెళ్లి ఊరేగింపు చేస్తారా? చేస్తే ఎలా ఉంటుంది? ఇక్కడిలానే అక్కడ కూడా జంక్షన్ జామ్ అవుతుందా?
న్యూయార్క్‌లో ఇండియన్ బరాత్
అవును, అలానే జరిగింది. ఏకంగా న్యూయార్క్ సిటీలోని వాల్ స్ట్రీట్‌లో జంక్షన్ జామ్ అయింది. మన డీజే సౌండ్‌తో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. ఓ పెళ్లి బరాత్‌లో ఏకంగా 400 మంది పార్టిసిపేట్ చేశారు. అంతా సంప్రదాయ భారతీయ వస్త్రాలే వేసుకున్నారు. మగవారు కుర్తా, పైజామా.. మహిళలు చీర, లెహంగాతో అమెరికాలో ఇండియన్ స్టైల్ సెలబ్రేషన్స్ చేశారు. బాలీవుడ్ పాటలకు డీజే సౌండ్‌తో దుమ్మురేపారు. మనోళ్లు డ్యాన్స్ చేస్తుంటే.. న్యూయార్క్ వాల్ స్ట్రీట్ రోడ్లన్నీ క్లోజ్.
400 మందితో పెళ్లి ఊరేగింపు..
అట్లుంటది మనవాళ్లతోని. అది ఇండియా అయినా.. అమెరికానైనా. పెళ్లి ఊరేగింపులో తగ్గేదేలే అన్నట్టు సాగింది ఆ బరాత్. మన డీజేకు న్యూయార్క్ సిటీకి మైండ్ బ్లాక్ అయింది. 400 మంది కలిసి ఒకేచోట.. నడిరోడ్డుపై డ్యాన్స్ చేయడం అక్కడి వారికి కొత్తగా, వింతగా అనిపించింది. “A once-in-a-lifetime kind of magic” అంటూ ఆ బరాత్‌లో పెర్‌ఫామ్ చేసిన DJ AJ అన్నారు. ఆ పెళ్లి ఊరేగింపు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మనోళ్లు కేక.. కాక..
వాల్ స్ట్రీట్‌ను డ్యాన్స్ ఫ్లోర్‌గా మార్చేశారంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మనోళ్లు ఎక్కడున్నా కేకే అంటూ ఇంకొకరు ప్రశంసించారు. వాల్ స్ట్రీట్ ను షట్ డౌన్ చేశారంటూ.. వాటీజ్ దిస్ నాన్‌సెన్స్ అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా.. అమెరికాలోనూ మనోళ్లు తగ్గేదేలే.
?utm_source=ig_embed