BigTV English

Red Teams: పాక్, చైనాను చావు దెబ్బ కొట్టిన రెడ్ టీం.. ఎలా పనిచేస్తుందంటే

Red Teams: పాక్, చైనాను చావు దెబ్బ కొట్టిన రెడ్ టీం.. ఎలా పనిచేస్తుందంటే

వార్ ఈజ్ ఏ మైండ్ గేమ్

వార్ అంటే కేవలం బ్యాటల్ గ్రౌండ్ ‌లో మాత్రమే జరిగేది కాదు. ఇదొక మైండ్ గేమ్. మరీ ముఖ్యంగా శతృవు.. సామాజిక- రాజకీయ- ఆర్ధికాంశాలను ఎనలైజ్ చేయడంతో పాటు వీటి ఆధారంగా.. వారి మానసిక స్థితి ఎలాగుంటుందని అంచనా వేసి.. చావు దెబ్బ తీయడం. దీన్నే రెడ్ టీమింగ్ అంటారు.


సింగిల్ సిపాయితో రాజుకు చెక్

ఒక రకంగా చెబితే ఇదో చదరంగం అన్నమాట. ఒక్కోసారి పాకిస్థాన్ దగ్గర చైనా, యూఎస్ వంటి పెద్ద పెద్ద దేశాల నుంచి భారీ అధునాతన ఆయుధాల సత్తా ఉండొచ్చుగాక. మన దగ్గర ఉన్న ఆయుధాలతో పోలిస్తే ఒక్కోసారి అవే ఎక్కువ అయి ఉండొచ్చు కూడా. కానీ చేతిలో సింగిల్ సిపాయి ఉన్నా కూడా.. దాంతోనే అటు వైపు రాజుకు చెక్ పెట్టేలాంటి ఎత్తుగడ వేయడం.

PL- 15తో పాటు శాటిలైట్ సపోర్ట్ చేసిన చైనా

కొన్ని ఇంటర్నేషనల్ రిపోర్టుల ప్రకారం గత ఆపరేషన్ సిందూర్లో .. పాకిస్థాన్ కి చైనా పెద్ద ఎత్తున సాయం చేసింది. తన దగ్గరున్న అధునాతన PL- 15 మిస్సైళ్లు ఇవ్వడంతో పాటు వాటిని శాటిలైట్ ద్వారా ఆపరేట్ చేసినట్టుగా చెబుతారు. మన వార్ థింక్ ట్యాంక్ చెప్పడాన్ని బట్టీ చూస్తే చైనా దగ్గర ఏముందో అది దాదాపు పాకిస్థాన్ దగ్గర ఉన్నట్టే లెక్క. ఈ లెక్కన పాకిస్థానే ఎక్కువ పటుత్వం గలిగిన దేశంగా భావించాల్సి ఉంటుంది. టర్కీ డ్రోన్ల సహాయం ఇందుకు అదనం. ఒక పక్క యూఎస్ F 16లు, మరో పక్క చైనా మిస్సైళ్లు, వీటికి టర్కీ డ్రోన్లు కూడా తోడు కావడంతో.. పాకిస్థాన్ అత్యంత పటిష్టంగానే కనిపించింది. కానీ మన వాళ్లు రెడ్ టీమింగ్ వాడి కొట్టిన దెబ్బకు ఇటు పాక్, అటు యూఎస్ తో పాటు.. చైనాకు కూడా దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది.

పాక్ ని ఎక్కడ కొడితే దారికొస్తుందో..

మనం ఒక పక్క ఎస్- ఫోర్ హండ్రెడ్లను సరిహద్దుల్లో మొహరించి.. ఇటు టర్కిష్ డ్రోన్లు, అటు చైనీస్ మిస్సైళ్లను వీటి ద్వారా తిప్పి కొడుతూనే.. పాక్ ని ఎక్కడ దెబ్బ కొడితే అది దారికొస్తుందో డీకోడ్ చేసింది ఈ రెడ్ టీమింగే. అదెలాగో చూస్తే.. ఒక పక్క పాక్ అటాకింగ్ ని డిఫెన్స్ ఆడుతూనే , మరో పక్క మనదైన అటాకింగ్ ని ఈ రెడ్ టీమింగ్ ద్వారానే చేయగలిగాం.

నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కీలకం

ఎనిమీ మైండ్ సెట్ ఏంటి? దాన్నెలా మ్యాపింగ్ చేయగలమో అని రెడ్ టీమింగ్ పాయింటాఫ్ లో ఎనలైజ్ చూసింది ఇండియన్ ఆర్మీ. అదెలాగో చూస్తే.. ఉదాహరణకు పాకిస్థాన్‌కి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అత్యంత కీలకం. ఈ ఎయిర్ బేస్ మీద దెబ్బ కొడితే.. దాదాపు పాకిస్థాన్ ఎయిర్ అటాకింగ్ డైనమిక్స్ మొత్తం మారిపోతాయి. కారణం.. ఇక్కడకి దగ్గర్లో రెండు ప్రధాన కార్యాలయాలుంటాయి. అవి, ఆర్మీ చీఫ్ హెడ్ ఆఫీస్, దీంతో పాటు అణు నిర్వహణ చేసే నేషనల్ కమాండ్ ఆఫీస్ సైతం ఈ పరిసరాల్లోనే ఉంటుంది.

ఆన్ ఎయిర్ ఫ్యూయల్ ఫంక్షనింగ్ కి ఫుల్ స్టాప్

నూర్ ఖాన్ బేస్ పై ఒక్కసారి దెబ్బ కొడితే.. పాకిస్థాన్ ఆన్ ఎయిర్ ఉన్న ఫ్లైట్స్ కి ఫ్యూయల్ ఫంక్షనింగ్ నిలిచిపోతుంది. ఇక్కడి నుంచే పాక్ గాల్లో ఉన్న విమానాలకు ఇంథనం నింపే సామర్ధ్యం ఈ బేస్ లోనే ఉంది. దీంతో ఎక్కువ సేపు పాక్ విమానాలు గాల్లో నిలిచి ఉండలేవు. దీంతో పాటు.. పక్కనే ఉన్న ఆర్మీ చీఫ్.. యుద్ధ వ్యూహాలన్నిటినీ పక్కన పెట్టి తన రక్షణ తాను చూసుకోవడంలో పడిపోతాడు. బంకర్లో దాక్కుని బతుకుజీవుడా! అంటాడు. దీంతో కమాండ్ కంట్రోల్ ఆగిపోతుంది.

మొన్న జరిగిందిదే.. 

కట్ చేస్తే, మూడోది నేషనల్ కమాండ్ ద్వారా న్యూక్లియర్ వెపన్స్ వాటి నిర్వహణ వంటి వ్యవహారాలు కూడా స్తంభించిపోతాయి. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడికి దగ్గర్లోని కిరానా కొండల కింద పాక్ అణు నిల్వలు ఉన్నట్టు చెబుతారు. ఒక వేళ పాక్ గానీ మనపైకి న్యూక్లియర్ వెపన్స్ గురి పెట్టాలన్నా కష్టమవుతుంది. దీనికి తోడు వారి అణు నిల్వలపై దాడి చేస్తామన్నచిన్నబెదిరింపుకే.. పాక్ షాకై పోతుంది. మొన్న జరిగింది ఇదేనంటారు మనయుద్ధరంగ నిపుణులు.

సింగిల్ షాట్- మెనీ బర్డ్స్

అంటే సింగిల్ షాట్- మెనీ బర్డ్స్ అన్నమాట. దీన్నంతటినీ రెడ్ టీమింగ్ ద్వారా ఎసెస్ చేస్తారు. దీంతో ఒక్క చోట సింపుల్‌గా కొడితే.. మొత్తం వార్ ఫీల్డ్ డైనమిక్సే ఛేంజ్ అయిపోతాయన్నమాట. మొన్న మన వాళ్లు సేమ్ టు సేమ్, డిట్టో ఇలాగే చేశారు. ఈ ఒక్క దెబ్బకు మొత్తం వార్ పై మనకు కమాండింగ్ వచ్చేసింది. పాక్ నుంచి అమెరికా కి కాల్, అక్కడి నుంచి భారత్ కి మరో రిక్వెస్టింగ్ కాల్. తర్వాత ఇరు దేశాల DGMOలు మాట్లాడుకోవడం. దీంతో యుద్దం మొత్తం ఆగిపోవడం. చకచకా జరిగిపోయాయి.

పాక్- చైనా- యూఎస్ కి మైండ్ బ్లాక్

అప్పటి వరకూ అంతర్జాతీయ పత్రికలు చైనాని ఆకాశానికి ఎత్తేస్తూ ఆహా ఓహో అంటూ కథనాలను వండి వార్చుతున్నాయి.. మనం ఫ్రాన్స్ నుంచి 60 వేల కోట్లు వెచ్చించి.. రాఫెల్ యుద్ధ విమానాలు కొన్నాం. అవి ఎందుకు పనికిరావన్న దుష్ప్రచారం చేస్తూ వచ్చిన విధానికి ఒక్కసారిగా చెక్ పడిపోయింది. దీంతో పాక్- చైనా- యూఎస్‌కి మైండ్ బ్లాక్ అయ్యింది. డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేయాలో అర్ధంకాని గజిబిజి గందరగోళం తలెత్తింది.

భారతీయులతో యుద్ధమంటే మాటలా ఏంటి?

మరి భారతీయ చదరంగం మహత్యమా మజాకా! యుద్ధరంగంలో శతృవు కదలికలు ఎలా ఉంటాయో మొదట ఊహించిందే మనం. చెస్ అనే ఈ టేబుల్ వార్ గేమ్ కనిపెట్టిందే మనం. అలాంటి భారతీయులతో యుద్ధమంటే మాటలా ఏంటి? జస్ట్ వ్యూహంతో పడగొట్టగల సమయ స్ఫూర్తి, యుద్ధ చతురత మన సొంతం. అదే రెడ్ టీమింగ్.

రెడ్ టీమింగ్ పూర్తి అర్ధమేంటి? దీని పని తీరు ఎలా ఉంటుంది?

రెడ్ టీమింగ్ పూర్తి అర్ధమేంటి? దీని పని తీరు ఎలా ఉంటుంది? మన మిలిటరీలోకి ఎప్పుడొచ్చింది? వివిధ కార్పొరేట్ సంస్థల్లో ఈ బృందాలను ఎలా వినియోగిస్తారు? వాటి ద్వారా ఆ సంస్థకు వచ్చే లాభాలేంటి? ఆ ఫుల్ డీటైల్స్ ఏంటి? ఇప్పుడు చూద్దాం..

ప్రత్యర్ధి మనస్తత్వం, వ్యూహాలు, రియాక్షన్

రెడ్ టీమింగ్ అంటే ప్రత్యర్ధి మనస్తత్వం, వ్యూహాలు, వారి రియాక్షన్స్.. ఎలా ఉంటాయో సెకన్ టూ సెకన్ వాచ్ చేసే ఒకానొక అబ్జర్వేషన్. కొందరు అదే పనిగా.. ఈ అంశాలపై తమ నిఘా పెట్టి ఉంటారు. ఇలాంటి వారి సాయంతో.. ప్రత్యర్ధికి చెక్ పెట్టడమే రెడ్ టీమింగ్ లో క్రియాశీలకం.

అటాకింగ్ మోడ్ ని ఎలా దెబ్బ తీస్తే.. సిట్యువేషన్ కంట్రోల్లోకి వస్తుందో

ప్రత్యర్ధి దగ్గరున్న వనరులు ఇవీ.. వీటి ద్వారా, వారు ఎలాంటి అటాకింగ్ చేస్తారు? అందుకు మన దగ్గరున్న కౌంటర్స్ ఏవీ ఎలాంటివన్న అంశాలన్నీ.. వీరి పరిశీలనలో ఉంటాయి. ఆపోనెంట్స్.. అటాకింగ్ మోడ్ ని ఎలా దెబ్బ తీస్తే.. సిట్యువేషన్ కంట్రోల్లోకి వస్తుందో ఈ రెడ్ టీమింగ్ ఎప్పటికప్పుడు తన అంచనాలను అందిస్తుంది. దీంతో వ్యూహాన్ని సిద్ధం చేస్తుంది సైన్యం.

భారత్ ఈ విధానం వాడటం ఇదే తొలిసారి

ఒక రకంగా చెబితే ఈ యుద్ధంలో మన వాళ్లు కనుగొన్న కొత్త టెక్నాలజీ ఇది. ఈ విధానం వాడ్డం ఇదే తొలిసారి. ఇది భారత దేశం యుద్ధ వ్యూహాల్లో ఎంతగా రాటు తేలిందో తెలియ చేస్తుంది. సినీ పరిభాషలో చెబితే.. స్క్రీన్ ప్లే లాంటిదనమాట.

సోవియెట్ వ్యూహాలను పసిగట్టేందుకు యూఎస్ వినియోగం

ఈ రెడ్ టీమ్‌లో దేశ వ్యాప్తంగా వివిధ కమాండ్‌లు, రకరకాల పోస్టింగుల నుంచి తీసుకున్న ఐదుగురు అధికారులున్నట్టు తెలుస్తోంది. కొన్ని దేశాల్లోని సైనిక కార్యకలాపాల్లో రెడ్ టీమింగ్ ఎప్పటి నుంచో ఒక భాగం. మరీ ముఖ్యంగా కోల్డ్ వార్ టైంలో సోవియట్ వ్యూహాలను అంచనా వేయడంలో యూఎస్ కి ఇది ఎంతో సహాయ పడింది. ఇటీవలే భారత్ ఈ విధానం అడాప్ట్ చేసుకుంది.

వీటిలో రెండు రకాలు.. రెడ్, బ్లూ టీమ్స్

రెడ్ టీమ్ అనే పదం వార్ గేమ్ ఎక్సర్ సైజుల నుంచి పుట్టుకొచ్చింది. వీటిలో మళ్లీ రెండు రకాలుంటాయి. ఒకటి రెడ్ టీమ్, మరొకటి బ్లూ టీమ్. రెడ్ టీమ్ శతృ వ్యూహాలను ఫాలో అయ్యి.. వారి సీక్రెట్లను పసిగట్టడం. ఇక బ్లూటీమ్.. ప్రత్యర్ధుల రక్షణ దళాలను ఊహించని విధంగా దెబ్బ తీస్తూ వెళ్తుంది.

బ్లూ టీమ్ ప్రత్యర్ధులపై దాడులు

మహాభారతం పరిభాషలో చెబితే.. పాండవుల సలహాదారు విదురుడి పేరు పెట్టారు. వివిధ ఆర్మీ కమాండ్‌లు, వివిధ యుద్ధ దృశ్యాలను పర్యవేక్షించి.. తద్వారా తమ దాడిని మరింత మెరుగు పరుచుకోవడం వంటి అనే రకరకాల విధానాలు ఇందులో పొందు పరిచారు.

2024 అక్టోబర్ లోనే అమల్లోకి

ఇండియన్ ఆర్మీ రెడ్ టీమ్ విధానం- 2024 అక్టోబర్ లోనే అమల్లోకి తెచ్చారు. ఆ తర్వాత 15 మంది అధికారుల బృందం రెడ్ టీమింగ్ లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు. రాబోయే రెండేళ్లలో ఈ విధుర కార్యక్రమాన్ని మరింతగా విస్తరించడానికి, ఆధునీకరించడానికి.. ఒక రోడ్ మ్యాప్ రూపొందించారు. అంతర్గత నైపుణ్యం పెంచడం, విదేశీయుల పాత్ర తగ్గించడమే దీని మెయిన్ టార్గెట్.

మనలోనే కొందరు ప్రత్యర్ధుల్లా మారి అటాక్

గతేడాది మేలో.. యుద్ధ రంగంలో మన సైనికుల పోరాట ప్రతిభ మరింత పెంచడానికి ప్రత్యర్ధి దళం- వ్యతిరేక దళంగా పని చేయడానికి ఒక స్పెషల్ యూనిట్‌ని ప్రారంభించాలనుకున్నారు. దీన్నే OPFOR గా పిలుస్తారు. ట్రైనింగ్‌లో ప్రత్యర్ధుల పని పట్టడం ఎలా? అన్నది మనలోనే కొందరు ప్రత్యర్ధులుగా మారి.. వీరిపై అటాక్ చేస్తారు. ఈ ప్రాక్టీస్ ద్వారా కొన్ని కొన్ని ఊహాజనితమైన అంశాలను వాస్తవంగా తెలుసుకోవచ్చు. ఈ తరహా విధానం.. కొన్ని దేశాలకు సంబంధించిన సైన్యాలు ఆల్రెడీ అనుసరిస్తూనే ఉన్నాయి.

సిమ్లా కమాండ్‌లో రెడ్ ఫోర్స్ యూనిట్

భారత సైన్యం ఇప్పటికే సిమ్లా మెయిన్ ఆఫీస్ ట్రైనింగ్ కమాండ్ లో.. రెడ్ ఫోర్సెస్ యూనిట్ కలిగి ఉంది. ఇది యుద్ధ వ్యూహాలను పరిశీలించే బాధ్యత వహిస్తుంది. సాధారణంగా ఒక పేపర్ మీద, ఇసుక నమూనాలను ఉపయోగిస్తారు. వ్యూహాలను ప్లాన్ చేసి అమలు చేయాల్సిన పరిమితులేంటి? ఆ నిబంధనలు ఎలాంటివన్న విషయాలను ఇది క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. రెడ్ ఫోర్స్ లేదా రెడ్ టీమ్ గా పిలిచే ఈ బృందం.. కేవలం ట్రైనింగ్‌లో మాత్రమే వాడేది అయినా.. దీని సొంత ప్లానింగ్ తో ప్రత్యర్ధలను ప్రతిక్షణం ఒక అంచనా వేసి.. పర్యవేక్షిస్తుందని చెబుతున్నారు అధికారులు.

వివిధ కార్పొరేట్ కంపెనీల్లోనూ రెడ్ టీమింగ్

అలాగని ఇది కేవలం మిలిటరీకి మాత్రమే సంబంధించిన విషయం కాదు. రెడ్ టీమింగ్ టీమ్స్ వివిధ కార్పొరేట్ సంస్థల్లోనూ ఉంటాయి. వీరిలో ఎథికల్ హ్యాకర్లు కూడా ఉంటారు. సంస్థ భద్రతా లోపాలను గుర్తించడానికి వీరు రివర్స్ అటాక్స్ చేస్తారు. రెడ్ టీమ్ అనేది మన సంస్థలో ఉండి.. ప్రత్యర్ధుల పాత్ర పోషించే ఒక టీమ్. ఇక బ్లూటీం చేసే పనేంటంటే.. ఇది కంపెనీ తరఫున ఈ దాడులను ఫేస్ చేసే మరో టీం. వీరు రెడ్ టీమ్ దాడిని తిప్పి కొడతారు.

భవిష్యత్తు ప్రమాదాలు పసిగట్టడంలోనూ కీ రోల్

రెడ్ టీమింగ్ మెయిన్ బిజినెస్ భద్రతా లోపాలను గుర్తించడం. ఇది సంస్థ బలహీనతలను పసిగట్టి.. ప్రత్యర్ధులు ఈ పాయింట్‌లో మనల్ని దెబ్బ తీసే ఛాన్సుందని అంచనా వేయడం. ఈ వీక్ పాయింట్‌పై దాడిజరిగితే ఎలా హ్యాండిల్ చేయాలో ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఈ టీమ్ యూజ్ అవుతుంది. సింపుల్‌గా చెబితే రెడ్ టీమింగ్ సంస్థ భద్రతా లోపాలు గుర్తించి, రూపుదిద్దుకోవల్సిన విధి విధానాలు తెలియ చేస్తుంది. ఆపై మన ప్రతిదాడులను మెరుగు చేసుకోడానికి సహాయ పడుతుంది. భవిష్యత్తులో రాబోయే, ప్రమాదాలను పసిగట్టడంలోనూ దీనిది కీలక పాత్రే. ఒక సంస్థ తన లోపాలను సరిదిద్దుకోడానికి రెడ్ టీమ్ ఇచ్చే రిపోర్ట్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

— Story By Adinarayana, Bigtv Live

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×