OTT Movie : హాలీవుడ్ సినిమాలకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీటిలో కామెడీ జానర్లో వచ్చే సినిమాలు బాగా ఎంటర్టైన్ చేస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా నలుగురు బ్యాచిలర్స్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఇందులో బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ కూడా అతిథి పాత్రలో నటించాడు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే
స్టోరీలోకి వెళితే
డగ్ బిల్లింగ్స్ కు మరి కొద్ది గంటల్లో పెళ్లి ఉంటుంది. అతను తన పెళ్లికి ముందు తన స్నేహితులతో కలిసి, లాస్ వెగాస్‌లో బ్యాచిలర్ పార్టీ జరుపుకోవడానికి వెళ్తాడు. అతని స్నేహితులు ఫిల్ వెన్నెక్ ఒక స్కూల్ టీచర్ గా. స్టూ ప్రైస్ ఒక డెంటిస్ట్ గా, అలాన్ గార్నర్ ఒక విచిత్రమైన వ్యక్తి గా ఉంటారు. వీళ్ళంతా లాస్ వెగాస్‌లో పార్టీ చేసుకుంటూ ఒక రాత్రి గడిపిన తర్వాత, ఉదయం మేల్కొన్నప్పుడు వారికి ఏమీ గుర్తు ఉండదు. ఆ హోటల్ సూట్‌లో కొన్ని విచిత్రమైన వస్తువులు మాత్రమే ఉంటాయి. కానీ ఎంత వెతికినా డగ్ మాత్రం కనిపించడు. వాళ్ళ జ్ఞాపకశక్తి పోయినప్పటికీ, డగ్‌ను కనిపెటాడానికి ఆ రాత్రి జరిగిన సంఘటనలను ఒక్కొక్కటిగా కనుక్కోవడం ప్రారంభిస్తారు.
ఈ క్రమంలో వీళ్ళు విచిత్రమైన మనుషులను కలుస్తారు. వీళ్ళల్లో ఒక గ్యాంగ్‌స్టర్ మైక్ టైసన్ కూడా ఉంటాడు. ఇక ఆ రోజు రాత్రి వీళ్ళు చేసిన ఘనకార్యాలను గుర్తుకు చేసుకుంటారు. ఒక పోలీస్ కారును దొంగలించి, అనుకోకుండా డ్రగ్స్ కూడా తీసుకుంటారు. మరొవైపు డగ్ పెళ్లి దగ్గర పడుతూ ఉంటుంది. అతన్ని ఎలాగైనా ఆ సమయానికి కనిపెట్టాలని అనుకుంటారు ఈ మహానుభావులు. చివరికి వీళ్ళు డగ్ ఎక్కడ ఉన్నాడో కనిపెడతారా ? అతనికి పెళ్లి జరుగుతుందా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ అమెరికన్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : పేరెంట్స్ లేని లోటు అమ్మాయి తీరిస్తుందా ? మైండ్ బ్లోయింగ్ స్టోరీతో ఓటీటీలోకి వచ్చిన కన్నడ సినిమా
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ అమెరికన్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘ది హ్యాంగోవర్’ (The Hangover). 2009 లో విడుదలైన ఈ మూవీకి టాడ్ ఫిలిప్స్ దర్శకత్వం వహించారు. ఇందులో బ్రాడ్లీ కూపర్, ఎడ్ హెల్మ్స్, జాక్ గలిఫియానాకిస్, హీథర్ గ్రాహం, జస్టిన్ బార్తా, జెఫ్రీ టాంబోర్ నటించారు. ఈ స్టోరీ ఒక బ్యాచిలర్ పార్టీ చుట్టూ జరిగే హాస్యాస్పదమైన, అనూహ్యమైన సంఘటనల గురించి తెలియజేస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.