E-Paper
Advertisement

కేటీఆర్ ఆస్తుల చిట్టాలో రేవంత్ హిట్టు .. కేసీఆర్ అక్రమాస్తుల అంశంలో దొరకని పట్టు!

కేటీఆర్ ఆస్తుల చిట్టాలో రేవంత్ హిట్టు .. కేసీఆర్ అక్రమాస్తుల అంశంలో దొరకని పట్టు!
Advertisement

బీఆరెస్‌ అక్రమాస్తుల అంశాన్ని లేటుగానైనా తెరపైకి తెచ్చినా సర్కార్‌ సక్సెసయ్యింది. దీనిపై డిస్కషన్ నడుస్తున్నది. మూడేండ్ల తరువాత కూడా ఇంకా కేసీఆర్‌, కేటీఆర్‌ ఆస్తుల గురించిన చర్చను ప్రజల్లో లైవ్‌లో ఉంచగలిగలిగారంటే ఈ వ్యూహంలో రేవంత్‌ విజయం సాధించినట్టేనంటున్నారు.

కానీ కేటీఆర్‌ను ఇరికించినంతగా .. కేసీఆర్ పై పట్టు దొరకలేదు రేవంత్‌కు. బహుశా కేసీఆర్‌ మౌనంగా ఉండటం, ఫామ్‌హౌజ్‌కే పరిమితం కావడం.. తెలంగాణ తెచ్చిన ఉద్యమ దళపతిగా, పదేండ్లు తెలంగాణను పాలించిన సీఎంగా జనంలో ఆయనకింక స్పేస్‌ ఉండటం కారణాలు కావొచ్చు. దీనికి తోడు.. రేవంత్‌ చేసిన ఫామ్‌హౌజ్‌ భూముల కబ్జాలపై విచారణలో కొండను తవ్వి ఎలుకను పట్టారా? అన్నట్టుగానే సాగింది.

Advertisement

వందల ఎకరాలు ఎటు పోయాయి..? అని రేవంత్‌ అసెంబ్లీ సాక్షిగా .. కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌ కోసమే వీటిని కబ్జా చేశారనే విధంగా అర్థం వచ్చేలా ఆరోపణ చేసి జనాలను కూడా కన్ఫ్యూజ్‌ చేయగలిగారు. కానీ నెల గడువులోగా సర్వే చేసి నిగ్గు తేల్చాలని అధికారులకు డెడ్‌లైన్‌ విధించడంతో ఈ అనుమానాలకు కూడా తొందరలోనే నివృత్తి దొరికినట్టయ్యింది.

అయితే రేవంత్‌ ఆరోపించినట్టుగా.. వందల ఎకరాలేమీ లెక్కతేలకుండా పోలేదు. ఓ 45 ఎకరాలు మిస్ అయ్యాయని అధికారులు నిగ్గు తేల్చారు. వాస్తవానికి అధికారుల నుంచి ఈ సమాధానం  రావడం ఆశ్చర్యాన్నే కలిగించింది.  స్వయంగా సీఎం.. విచారణ చేసి భూముల లెక్కలు తేల్చాలని చెబితే.. అందులో ఈ 45 ఎకరాల భూముల గాయబ్‌పై అధికారుల క్వశ్చన్‌ మార్కు ముఖాలు ఎందుకు వేసుకున్నారో అర్థం కాలేదు.

Advertisement

ఇవి కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌లో కలిసిపోయాయని నేరుగా చెప్పేయవచ్చు. కానీ చెప్పలేదు. ఎందుకు..? వాటిపై వీరికే క్లారిటీ లేదా? నమస్తే తెలంగాణలో రాసినట్టుగా.. అవి రోడ్లకు, కొండలను చదును చేసే క్రమంలో తగ్గిన ఇష్యూలో భూముల లెక్క తగ్గిందనే కోణం నిజమేనా? మళ్లీ దీన్ని కూడా నాన్చుడుగానే ఉంచేస్తారా? లేదా ఇంతకు మించి తెగేదాకా లాగితే తమకే నష్టమని సర్కార్‌ భావిస్తోందా? వీటికి ప్రస్తుతానికైతే సమాధానాల్లేవు.

‘అందుకే ఇలా ఆ భూములు గాయబ్‌..!’ అవి ఫామ్‌హౌజ్‌ భూముల్లోని కలిసిపోయాయని అనధికార ప్రకటనగానే ఉంచేసి.. జనాల్లో చర్చను లైవ్‌గా ఉంచే వ్యూహామా? తెలియదు. కానీ ఇదే అంశంలో కేటీఆర్‌ను తన వ్యూహంలో ఇరికించే ప్రయత్నంలో రేవంత్‌ సక్సెసయ్యారు. కలుగులోని ఎలుకను బయటకు లాగినట్టే చేశారు హోటళ్ల విషయంలో.

‘కావాలంటే నా పేరు మార్చుకుంటా..’నని సిరిసిల్లా గడ్డ మీద నుంచి రేవంత్‌ చేసిన శపథం.. నిజంగా కేటీఆర్‌కు పొగబెట్టింది. నిజాలు చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో  ‘ఒకటిని మూడు చేశాను.. మరో పది చేసేవాడిని. బిజినెస్ చేశాను. భార్యాపిల్లలకు బువ్వ పెట్టొద్దా..?’ అనే పొంతనలేని, బేల సమాధానాలు, వివరణలు మరింత పట్టించాయి కేటీఆర్‌ను.

బీఆర్ఎస్‌కు కేసీయారే ఇప్పటికీ ప్రాణం. ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఆశ సజీవంగా ఉందంటే అది కేవలం కేసీఆర్‌ వల్లే. అలాంటి కేసీఆర్‌ను అక్రమాస్తుల  అంశంలో పూర్తిగా బయటకు లాగలేకపోయారు రేవంత్‌. కేటీఆర్‌ను ఎంత డ్యామేజీ చేసినా.. అది పార్టీకి పెద్ద నష్టం కాదనే అనుకోవాలి.. ఎందుకంటే పార్టీ నేతలు, కార్యకర్తలు ‘కేటీఆర్ వల్లే పార్టీకి భవిష్యత్తు…’ అని ఇంకా నమ్మడం లేదు.  కేటీఆర్‌ను వ్యక్తిగతంగా దెబ్బతీయడంలో మాత్రం ఇది కాంగ్రెస్‌కు పనికి వచ్చింది.

Tags

Related News

సీఈసీ వైఖరిపై దుమారం..! సర్‌ విధానంతో కేంద్రం బద్నాం..! ఓ వైపు ఢిల్లీ దద్దరిల్లుతుంటే కీర్తిబావుటాలేలా..?

గులాబీ ముల్లు.. కొణతం దిలీప్‌..! ఆయన చేతిలో బడానేత కీలుబొమ్మ.. దుందుడుకు మనస్తత్వానికి, పక్కదారి పట్టించే సలహాలు..!

యువనేత మరో కోణం.. నకిలీ బతుకుల ఫేక్ అకౌంట్లకు కేరాఫ్ అడ్రస్.. సోషల్ మీడియా చీకటి రాజ్యానికి తనో రారాజు…!

2022 ఆగస్టులో కొత్త పింఛన్లు పెంచిన కేసీఆర్.. సుధీర్ఘ కాలం తరువాత ఈ దసరాకు రేవంత్‌ సర్కార్‌..! 2.50లక్షల కొత్త ఫించన్లు..

తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల రచ్చ.. 15 నుండి 18 మందికి మళ్లీ ఛాన్స్?

వికారాబాద్ జిల్లాలో గుప్తనిధుల వేట.. మట్టి తవ్వుతుండగా ఊహించని ట్విస్ట్!

తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్.. నవంబర్ నుంచి పెరగనున్న కరెంట్ బిల్లులు!

Big Stories

Advertisement
×