E-Paper
Advertisement

కొమ్మల్లో సొమ్ము.. లక్కతో లక్.. చెట్లపై పెరిగే ఈ పురుగులతో బోలెడు ఆదాయం!

కొమ్మల్లో సొమ్ము.. లక్కతో లక్.. చెట్లపై పెరిగే ఈ పురుగులతో బోలెడు ఆదాయం!
Advertisement

Lac Resin Business: అడవులు, గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే కొన్ని చెట్లు ప్రజలకు కేవలం నీడను, పండ్లను మాత్రమే ఇవ్వవు. వాటి కొమ్మలపై పెరిగే చిన్న పురుగులు కూడా ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. అలాంటి వాటిలో లక్క పురుగులు ముఖ్యమైనవి. లక్క పురుగుల నుంచి లభించే నేచురల్ రెజిన్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో.. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో లక్క సేకరణ జోరుగా కొనసాగుతోంది. బెంగాల్ నుంచి వచ్చిన కార్మికులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చెట్ల కొమ్మలను పరిశీలిస్తూ లక్కను సేకరిస్తున్నారు. చెట్లపై పేరుకుపోయిన లక్కను జాగ్రత్తగా తొలగించి సేకరించడం ద్వారా వారికి ఉపాధి లభిస్తోంది.

చెట్ల రసంతో లక్క తయారీ!

లక్క అనేది ఒక రకమైన పురుగు చెట్ల కొమ్మలపై నివసించడం వల్ల ఏర్పడే సహజ పదార్థం. ఈ పురుగులు చెట్ల రసాన్ని పీల్చుకుని జీవిస్తాయి. అలా చెట్ల నుంచి తీసుకున్న రసాన్ని ఉపయోగించుకునే క్రమంలో ప్రత్యేకమైన రెజిన్‌ను స్రవిస్తాయి. ఈ రెజిన్‌ కొమ్మలపై పొరలుగా పేరుకుపోతుంది. దానినే లక్కగా సేకరిస్తారు. సేకరించిన లక్కను శుద్ధి చేసి, ప్రాసెసింగ్ చేసిన తర్వాత షెలాక్‌ గా మారుస్తారు. ఈ షెలాక్‌ కు పలు రంగాల్లో వినియోగం ఉండటంతో లక్కకు కూడా మార్కెట్‌లో డిమాండ్ ఉంటుంది.

ఏ చెట్లపై లక్క ఎక్కువగా ఉంటుందంటే?

Advertisement

ప్రతి చెట్టుపైనా లక్క పురుగులు పెరగవు. కొన్ని ప్రత్యేకమైన చెట్లపైనే ఇవి ఎక్కువగా ఉంటాయి. రేగు, మోదుగు, కుసుమ లాంటి చెట్ల కొమ్మలపై లక్క పురుగులు ఎక్కువగా కనిపిస్తాయి. చెట్లకు నష్టం కలగకుండా కొమ్మలపై ఉన్న లక్కను కార్మికులు సేకరిస్తారు. సరైన సమయంలో సేకరించిన లక్కకు మంచి డిమాండ్ ఉంటుంది.

పశ్చిమబెంగాల్ నుంచి వచ్చి సేకరణ!

ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం లక్క సేకరణ పనుల్లో పశ్చిమబెంగాల్ నుంచి వచ్చిన కార్మికులు పాల్గొంటున్నారు. సీజన్‌కు అనుగుణంగా వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ లక్కను సేకరిస్తున్నారు.చెట్ల కొమ్మలపై లక్క ఎక్కడ ఎక్కువగా ఉందో గుర్తించి.. దాన్ని జాగ్రత్తగా తొలగించడం, సేకరించిన పదార్థాన్ని వేరు చేయడం వంటి పనులు చేస్తున్నారు. ఈ విధంగా లక్క సేకరణ స్థానికంగా ఒక ప్రత్యేకమైన ఉపాధి అవకాశంగా కూడా మారుతోంది.

కిలోకు రూ.150 నుంచి రూ.200 వరకు

Advertisement

లక్కకు ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న ధర కిలోకు సుమారు రూ.150 నుంచి రూ.200 వరకు ఉంటుందని కార్మికులు చెబుతున్నారు. నాణ్యత, మార్కెట్ పరిస్థితులు, డిమాండ్ ఆధారంగా ధరల్లో మార్పులు ఉంటాయి. సేకరించిన లక్కను వ్యాపారులు కొనుగోలు చేసి ప్రాసెసింగ్ కోసం పంపిస్తారు. అక్కడ శుద్ధి చేసి షెలాక్‌ను తయారు చేస్తారు.

షెలాక్‌కు ఎన్నో ఉపయోగాలు!

లక్క నుంచి తయారయ్యే షెలాక్‌కు అనేక రంగాల్లో ఉపయోగం ఉంది. ముఖ్యంగా ఫర్నిచర్ పాలిష్, వార్నిష్ వంటి వాటిలో దీనిని ఉపయోగిస్తారు. అంతేకాదు ఆహార, ఔషధ రంగాల్లో కొన్ని ఉత్పత్తులపై కోటింగ్ కోసం కూడా షెలాక్‌ను వినియోగిస్తారు. కాస్మెటిక్స్ రంగంలోనూ దీనికి ఉపయోగం ఉంది. అంటే అడవుల్లో చెట్ల కొమ్మలపై కనిపించే చిన్న పురుగుల వల్ల ఏర్పడే లక్క.. ప్రాసెసింగ్ తర్వాత అనేక ఉత్పత్తుల్లో ఉపయోగపడే విలువైన పదార్థంగా మారుతోంది.

Read Also: మీ ఇంటి పెరట్లో ఈ మొక్కలు ఉన్నాయా? అయితే, పాములు, దోమలతో నో టెన్షన్!

Tags

Related News

భారత్‌లో అత్యంత అందమైన రోడ్లు ఇవే.. ఒక్కసారి జర్నీ చేస్తే మళ్లీ వెళ్లాలనిపిస్తుంది!

వేల అడుగుల లోయలు.. వందల మలుపులు.. ఈ రోడ్లపై డ్రైవింగ్ చాలా డేంజరస్!

నిన్న లీగల్ నోటీసులు.. నేడు భూముల లెక్కలు.. స్వర్ణగిరి ఆలయానికి షాక్ మీద షాక్!

పిడుగు దెబ్బకు ఇండిగో విమానం డ్యామేజ్.. లక్నోలో సేఫ్‌గా ల్యాండింగ్, ఎలా జరిగింది?

ప్రపంచంలోనే బుల్లి నది.. పొడవు కేవలం 20 మీటర్లే.. కనుచూపు మేరలోనే కనుమరుగు!

‘హనుమాన్ అంశ్’ మూవీ ఎఫెక్ట్.. కైంచి ధామ్‌లో ఏకంగా 20 కి.మీ. ట్రాఫిక్ జామ్!

అమ్మబాబోయ్.. ఆర్టీసీ బస్సులో ఇన్ని సౌకర్యాలా? సీటుకో టీవీ, ఎయిర్ హోస్టెస్, నచ్చిన ఆహారం!

Big Stories

Advertisement
×