E-Paper
Advertisement

Sai Krishna: హ్యూమన్ రైట్స్ కమిషన్‌కు జగన్ టీమ్ సంచలన ఫిర్యాదు..!

Sai Krishna: హ్యూమన్ రైట్స్ కమిషన్‌కు జగన్ టీమ్ సంచలన ఫిర్యాదు..!
Advertisement

Sai Krishna: ఏపీలో ఇప్పుడు సాయికృష్ణ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రచ్చకు కారణమైంది. ఒకవైపు ఇది పక్కా లాకప్ డెత్… ఖాకీల అండతో జరిగిన ఘోర హత్య అంటూ ప్రతిపక్షం ఆరోపిస్తోంది. మరోవైపు తప్పు చేసిన వాడు ఎంతటివాడైనా వదిలేదే లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ అధికార పక్షం కౌంటర్లు ఇస్తోంది.

మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు..

ఎప్పుడైతే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారో అప్పటి నుంచి సీన్ మారిపోయింది. మరోవైపు వైసీపీ నేతలు ఈ వ్యవహారంపై ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. పోలీసుల అధికార దుర్వినియోగం, మానవ హక్కుల ఉల్లంఘనపై స్వతంత్ర విచారణ జరిపించాలని కోరారు. రాష్ట్రంలో పరిస్థితులు అదుపు తప్పాయని పోలీసుల అరాచకాలు పెరిగిపోతున్నాయని చెప్పడానికి ఈ ఘటనే ఎగ్జాంపుల్ అంటున్నారు వైసీపీ నేతలు.

Advertisement

Also read; ఉత్కంఠగా మారిన వైద్య విధాన పరిషత్ కొత్త బాస్ ఎంపిక.. రేసులో 10 మంది సీనియర్లు!

సీఐ నాగరాజును సస్పెండ్..

ఈ అంశం ఎప్పుడైతే పొలిటికల్ టర్న్ తీసుకుందో అప్పుడే అధికారపక్షం ఎదురుదాడి ప్రారంభించింది. సాయికృష్ణ కుటుంబ సభ్యులను ఏపీ సీఎం చంద్రబాబు కలిశారు. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ నాగరాజును సస్పెండ్ చేశారు. సాయికృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. నేరస్థులకు కులం, మతం ఉండదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్టేట్‌మెంట్ ఇచ్చారు.

కులం పేరుతో రాజకీయాలు..

Advertisement

వైసీపీ నేతలు నీచాతినీచంగా రాజకీయాలు చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగినా.. జగన్ వారిని పరామర్శించారా అని ప్రశ్నించారు. కులం పేరుతో రాజకీయాలు చేయడం బాధాకరమన్నారు కొల్లు రవీంద్ర. సాయికృష్ణ మిస్సింగ్‌పై వైసీపీ కాపు నేతలు వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందని ఎమ్మెల్యే బొలిశెట్టి అన్నారు. జనసేనపై కాపు ముద్ర వేసి కూటమి‌ నుంచి విడదీయటానికి వైసీపీ రకరకాల ప్రయత్నాలు చేస్తుందని ఫైరయ్యారు. ఏదేమైనా ఈ కేసును ప్రభుత్వంపై రాజకీయ అస్త్రంగా మలచుకోవడానికి వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. అదే సమయంలో అధికార పక్షం డ్యామేజ్‌ కంట్రోల్ చేస్తూనే ఎదురుదాడి చేస్తున్నట్టు కనిపిస్తోంది.

Also read; తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. రానున్న 2 గంటల్లో ఈ జిల్లాలో భారీ వర్షాలు!

Related News

DSC ఉద్యోగాల అమ్మకాలపై వైసీపీ సంచలన ఆధారాలు.. షాక్‌లో కూటమి సర్కార్!

పసికందుల విక్రయ దందా పై హైకోర్టు ఫైర్.. ఆ శాఖకు నోటీసులు జారీ?

దేశ రాజధానిలో ఘోరాతి ఘోరం.. 6 ఏళ్ల చిన్నారిని కూడా వదలని కిరాతకులు?

తెల్గు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఫామ్‌హౌజ్‌…! ఆ పదం రాసినందుకు ఇలేకరికి ఇచ్చిపడేసిన పెద్దసారు..!

క్రికెట్ చరిత్రలోనే హెచ్‌సీఏ చెత్త రికార్డు.. సోషల్ మీడియాలో పిచ్చ ట్రోల్స్!

పవర్‌ స్టేషన్స్‌ పరిశీలనకు 6 బృందాలు! థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో ఏం జరుగుతోంది..? పరిశీలనకు రేపు ఆరు చోట్ల పర్యటనలు…

తెలంగాణలో మేఘాలయ మోడల్ వ్యవసాయ విధానం.. మోదట వేసే పంట ఇదే?

ఆస్తులు పెంచుకోలే.. ప్రజల మనసుల్లో అంతస్తులు కట్టుకున్నారు! ఆ ముగ్గురి కామ్రేడ్‌ల నిస్వార్థ ప్రజాసేవ ప్రస్థానం..!

Big Stories

Advertisement
×