E-Paper
Advertisement

రెండు రాష్ట్రాలు సై.. కేంద్రం మాత్రం నై.. తుమ్మిడిహెట్టి బ్యారేజీ పై కేంద్రం మతలబేంటో!

రెండు రాష్ట్రాలు సై.. కేంద్రం మాత్రం నై.. తుమ్మిడిహెట్టి బ్యారేజీ పై కేంద్రం మతలబేంటో!
Advertisement

Tummidihetti Barrage: ఇన్నాళ్లూ గొడవపడ్డ వాళ్లే సంధికొచ్చారు పగలు, ప్రతీకారాలు పక్కనపెట్టి కూర్చొని మాట్లాడుకుందామని దారికొచ్చారు. కానీ పంచాయితీ చేసే పెద్దమనిషికి మాత్రం మూడ్‌ లేదట. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా తుమ్మిడిహెట్టి బ్యారేజీ విషయంలో జరుగుతున్న పచ్చి నిజం. తెలంగాణ, మహారాష్ట్రల మధ్య ఏళ్లకు ఏళ్లుగా నలుగుతున్న జల వివాదాన్ని సామరస్యంగా తేల్చుకుంటామని రెండు రాష్ట్రాలు సిద్ధపడినా ఢిల్లీలోని కేంద్ర పెద్దలు మాత్రం మౌనమే సమాధానమంటున్నారు.

తుమ్మిడిహెట్టి బ్యారేజీ..

ఉత్తర తెలంగాణ దాహార్తిని తీర్చే తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపు మా ప్రాంతానికి ప్రాణవాయువు అని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీ పీఠం మెట్లు ఎక్కుతున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ముందర చేతులు జోడించి విన్నవిస్తున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ సీఎంలతో ఒకే ఒక్క సమావేశం పెట్టించండి సమస్యను సామరస్యంగా పరిష్కరించి అనుమతులు ఇప్పించండని కాళ్లరిగేలా తిరుగుతున్నారు.

Advertisement

Also Read: ఏపీ ప్రజల పదేళ్ల కన్నీళ్లకు ముగింపు లభిస్తుందా.. అగ్రిగోల్డ్ వేలం ప్రక్రియపై అసలు నిజాలివే!

రైతుల కళ్లల్లో ఆశలు..

వినతిపత్రాలు ఇవ్వడానికి వెళ్తే ఫోటోలకు ఫోజులివ్వడం, చిరునవ్వులు చిందించడం తప్ప ఆ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకేయడం లేదు కేంద్రమంత్రులు! పంచాయితీ తెంచాల్సిన పెద్దమనుషులే ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తూ రెండు రాష్ట్రాల మధ్య సమావేశం పెట్టడానికి ముఖం చాటేస్తున్నారు. రైతుల కళ్లల్లో ఆశలు నింపే ప్రాజెక్టుపై రాజకీయం చేయడం తగునా? వినతిపత్రాలు అందుకోవడానికి ఉన్న ఆసక్తి. రెండు రాష్ట్రాల మధ్య సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించడానికి ఎందుకు రావడం లేదు.

Advertisement

Also Read: తెలంగాణ బీజేపీలో బండి వర్సెస్ ఈటల.. నకిలీ నవ్వులేనా.. లోపల పాత పగలున్నాయా..!

Tags

Related News

కేసీఆర్‌ను కామెడీ పీస్‌ను చేసిండ్రు కదరా!? చావు నోట్లో తలపెట్టి.. డైలాగెందుకు వాడినట్టో…!? ఉద్యమాన్ని అవమానించడం కాదా?

DSC ఉద్యోగాల అమ్మకాలపై వైసీపీ సంచలన ఆధారాలు.. షాక్‌లో కూటమి సర్కార్!

పసికందుల విక్రయ దందా పై హైకోర్టు ఫైర్.. ఆ శాఖకు నోటీసులు జారీ?

దేశ రాజధానిలో ఘోరాతి ఘోరం.. 6 ఏళ్ల చిన్నారిని కూడా వదలని కిరాతకులు?

తెల్గు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఫామ్‌హౌజ్‌…! ఆ పదం రాసినందుకు ఇలేకరికి ఇచ్చిపడేసిన పెద్దసారు..!

క్రికెట్ చరిత్రలోనే హెచ్‌సీఏ చెత్త రికార్డు.. సోషల్ మీడియాలో పిచ్చ ట్రోల్స్!

పవర్‌ స్టేషన్స్‌ పరిశీలనకు 6 బృందాలు! థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో ఏం జరుగుతోంది..? పరిశీలనకు రేపు ఆరు చోట్ల పర్యటనలు…

తెలంగాణలో మేఘాలయ మోడల్ వ్యవసాయ విధానం.. మోదట వేసే పంట ఇదే?

Big Stories

Advertisement
×