E-Paper
Advertisement

ఏపీ ప్రజల పదేళ్ల కన్నీళ్లకు ముగింపు లభిస్తుందా.. అగ్రిగోల్డ్ వేలం ప్రక్రియపై అసలు నిజాలివే!

ఏపీ ప్రజల పదేళ్ల కన్నీళ్లకు ముగింపు లభిస్తుందా.. అగ్రిగోల్డ్ వేలం ప్రక్రియపై అసలు నిజాలివే!
Advertisement

AgriGold Depositors: అగ్రిగోల్డ్.. ఇది కేవలం ఒక సంస్థ పేరు కాదు. 19లక్షల కుటుంబాల ఆవేదన ఉంది. కొడుకును పెద్ద చదువులు చదివించాలనో, ముసలితనంలో ఎవరికీ భారం కాకూడదనో రెక్కల కష్టాన్ని నమ్ముకున్న సామాన్యులు దాచుకున్న గుప్పెడు ఆశలవి. కానీ, పదేళ్ల క్రితం ఆ నిరుపేదల కలల సామ్రాజ్యం కుప్పకూలింది. నమ్మిన సంస్థ నట్టేట ముంచేసింది.

23వేల 599 ఎకరాలు..

పదేళ్లుగా బాధితులు న్యాయం కోసం తిరగని ఆఫీసు లేదు. ఎక్కని మెట్లు లేవు. చెయ్యని పోరాటం లేదు. ఏ దేవుడు కరుణించాడో గానీ వీరి బాధలను తీర్చేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. అగ్రిగోల్డ్ ఇష్యూను డీల్ చేసేందుకు ప్రభుత్వం సబ్‌ కమిటీ కూడా వేసింది. అగ్రిగోల్డ్ సంస్థ తరఫున సుమారు 5 లక్షల మంది ఏజెంట్లు పనిచేసి, 6వేల కోట్ల డిపాజిట్లు సేకరించారు. ఇందులో 3వేల కోట్లు ఒక్క ఏపీ నుంచే ఉన్నాయి. అగ్రిగోల్డ్‌కు 23వేల 599 ఎకరాల భూములు ఉన్నాయి. అవి సామాన్యుల రక్తాన్ని పీల్చి కొన్న ఆస్తులు. అందులో 6వేల 3వందల 30 ఎకరాల భూములకు వేలం వేసి. వచ్చిన డబ్బులను బాధితుల చేతిలో పెట్టాలని చూస్తోంది ప్రభుత్వం.

Advertisement

Also read: 100 సార్లు అరెస్ట్ చేసినా తగ్గేదేలే.. ప్రజలే బుద్ధి చెప్తారు.. ఏపీ సర్కార్‌పై అంబటి ఫైర్!

సీఐడీ ద్వారా..

సెప్టెంబర్ 15లోపు వేలం ప్రక్రియ పూర్తిచేస్తామని మంత్రి నాదేండ్ల భాస్కర్ చెబుతున్నారు. ఏజెంట్ల దగ్గర మూలనపడి ఉన్న బాండ్లను సీఐడీ ద్వారా సేకరిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌తో 11న మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై ఆస్తుల వేలానికి విధివిధానాలు ఖరారు చేయనున్నారు. ఇది కేవలం ఆస్తుల వేలం కాదు. మానవత్వాన్ని గెలిపించే ఒక యజ్ఞం.

Advertisement

Also Read: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. ఏపీ ప్రభుత్వంపై సంచలన ఫిర్యాదులు!

Tags

Related News

కేసీఆర్‌ను కామెడీ పీస్‌ను చేసిండ్రు కదరా!? చావు నోట్లో తలపెట్టి.. డైలాగెందుకు వాడినట్టో…!? ఉద్యమాన్ని అవమానించడం కాదా?

DSC ఉద్యోగాల అమ్మకాలపై వైసీపీ సంచలన ఆధారాలు.. షాక్‌లో కూటమి సర్కార్!

పసికందుల విక్రయ దందా పై హైకోర్టు ఫైర్.. ఆ శాఖకు నోటీసులు జారీ?

దేశ రాజధానిలో ఘోరాతి ఘోరం.. 6 ఏళ్ల చిన్నారిని కూడా వదలని కిరాతకులు?

తెల్గు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఫామ్‌హౌజ్‌…! ఆ పదం రాసినందుకు ఇలేకరికి ఇచ్చిపడేసిన పెద్దసారు..!

క్రికెట్ చరిత్రలోనే హెచ్‌సీఏ చెత్త రికార్డు.. సోషల్ మీడియాలో పిచ్చ ట్రోల్స్!

పవర్‌ స్టేషన్స్‌ పరిశీలనకు 6 బృందాలు! థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో ఏం జరుగుతోంది..? పరిశీలనకు రేపు ఆరు చోట్ల పర్యటనలు…

తెలంగాణలో మేఘాలయ మోడల్ వ్యవసాయ విధానం.. మోదట వేసే పంట ఇదే?

Big Stories

Advertisement
×