హరీశ్‌రావు క్షుద్ర పూజలు చేపించాడనే బలమైన నమ్మకాన్ని జనాల్లో తీసుకెళ్లే క్రమంలో కాంగ్రెస్ కొంత సక్సెసయ్యిందనే చెప్పాలి. దీన్ని వదిలేలా లేదు ఇప్పుడప్పుడే కాంగ్రెస్. అందుకే దీనికి విరుగుడుగా మేం పూజలు చేపిస్తామని కూడా బయలు దేరుతున్నారు కాంగ్రెస్ నాయకులు. అంతలా దీన్ని వాడుకుందామని డిసైడ్ అయ్యారు.
అయితే దీనిపై లీగల్ నోటీసులు ఇప్పటికే ఇచ్చిన హరీశ్… ఇక దీనిపై ఎక్కువ మాట్లాడొద్దని అనుకున్నాడు. దీన్ని పూర్తిగా అవాయిడ్ చేస్తూ వస్తున్నాడు. కానీ కాంగ్రెస్ చేసే యాగీ చూసి భరించలేక మళ్లీ ఇవాళ దీనిపై ఘాటుగానే స్పందించాడు హరీశ్. ఎవరినీ వదలేదు లేదు. క్రిమినల్ సూట్ వేస్తా.. పరువు నష్టం దావా వేస్తానని.. మాస్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఇది మళ్లీ రచ్చ రాజకీయానికి ఆజ్యం పోసినట్టయ్యింది.
ఓ వైపు గోదావరి నీటి వాటాలపై, ప్రాజెక్టులపై, నీటి కేటాయింపులపై సీరియస్‌గా చర్చ చద్దామని బీఆరెస్ భావించినా.. దీన్ని సైడ్ ట్రాక్ పట్టించేందుకు ఈ క్షుద్ర పూజల అంశం బాగా దొరికింది కాంగ్రెస్ నాయకులకు. పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తడం వల్ల హరీశ్ ఎంత ఓపికగా ఉందామన్నా చికాకు పడుతున్నాడు. అందుకే ఇలా ఘాటుగానే స్పందించాల్సి వచ్చింది.
కానీ ఇంత జరుగుతున్నా ఈ విషయంలో కేటీఆర్ మాత్రం కుక్కిన పేనులాగే ఉన్నాడు. మౌనం పాటిస్తున్నాడు. అసలు ఆ విషయం తనకేం తెలియదు.. అన్నట్టుగానే ఉండిపోతున్నాడు. అన్ని రాజకీయ అంశాలు మాట్లాడుతున్నాడు కానీ, దీని గురించి మాట్లాడటం లేదు. కేటీఆర్ మౌనం అంగీకారం కిందకు కూడా తీసుకునే అవకాశం ఉంది ప్రత్యర్థులు.
హరీశ్‌రావు మీద ఏ చిన్న ఈగ వాలినా.. ముందుండి అర్సుకునే కేటీఆర్.. ఇంతలా మరి అతని మీద ఆరోపణలు, అభాండాలు వేస్తుంటే ఎందుకు కనీసం స్పందించడం లేదనేదే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలో చర్చ. రాజకీయాలను పక్కదారి పట్టించేదుకు ఈ తతంగమంతా అని కూడా ఓ మాట అనలేకపోతున్నాడు కేటీఆర్. ఒకవేళ స్పందిస్తే దీన్ని మరింతగా పెంచినట్టువుతుందనే వ్యూహమా..? అని కూడా అనుకుంటున్నారు.
కానీ ఈ తరహా వ్యూహం వల్ల బీఆరెస్ మీద దాడి మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు. మరి.. కాంగ్రెస్‌నేతలు చెబుతున్నట్టు.. మా దగ్గర ఆధారాలున్నాయి. హరీశ్ ఎక్కడెక్కడ తిరిగాడు.. ఏయే గుళ్లకు పోయాడో అన్నీ చెబుతాం.. అని అంటున్నారు కాబట్టి.. దీనిపై తాను స్పందిస్తే ఆ ఆధారాలన్నీ బయటకు తీసి.. ఇదిగో చూడండని మరింత రచ్చ చేస్తారా? అనే అనుమానాలు కేటీఆర్‌లో ఉన్నట్టున్నాయి. అందుకే మధ్యే మార్గంగా ఆయన మౌనాన్నే ఆశ్రయిస్తున్నాడని కూడా అంటున్నారు.
కానీ హరీశ్‌రావు ఒక్కడే ఇలా కాంగ్రెస్‌తో ఈ విషయంలో పోరాడుతుంటే.. రామన్న పల్లెత్తు మాట కూడా అనకుండా తన రాజకీయం తను చేసుకుంటూ పోతా ఉంటే.. ఆ పార్టీలోనే ఇద్దరికీ సయోధ్యలేదనే అంశం మళ్లీ తెరమీదకు తెస్తున్నట్టైంది. ప్రత్యర్తుల వాదనకు మరింత బలాన్ని చేకూర్చినట్టవుతుందనే భావన కూడా వస్తోంది. పరువు నష్టం దావా వేస్తానని వార్నింగ్ ఇచ్చిన హరీశ్ రావు.. తాను స్కాములపై మాట్లాడినందుకు, ప్రభుత్వాన్ని మనసును పట్టనీయకుండా విమర్శలు, ఆరోపణలు దాడులు చేస్తున్నానని టార్గెట్ చేశారని చెబుతూ వస్తున్నాడు.
కానీ ఈ విధంగా హరీశ్ రావు క్యారెక్టర్ అసాసినేషన్‌కు కాంగ్రెస్ పాల్పడుతున్నా.. రామన్న మౌనంగా ఉండటం మాత్రం చర్చకు తావిస్తోంది. కాంగ్రెస్‌కు మరింతగా ఈ అంశం కలిసి వస్తోంది.