E-Paper
Advertisement

యోగా డే.. బాబును కుర్రాడ్ని చేసిందిగా! సునాయ‌సంగా ఆస‌నాలేసి.. ఆశ్చ‌ర్య‌ప‌రిచి…!

యోగా డే.. బాబును కుర్రాడ్ని చేసిందిగా! సునాయ‌సంగా ఆస‌నాలేసి.. ఆశ్చ‌ర్య‌ప‌రిచి…!
Advertisement

అడ్మినిస్ట్రేష‌న్ అంటేనే చంద్ర‌బాబు. ఇందులో ఆయ‌నకు మించిన ఘ‌నులు లేరు. ఆయ‌న‌ను క‌నీసం ట‌చ్ చేసే నేత‌లు కూడా లేర‌నే చెప్పాలి. ఆయ‌న మంచి వ‌క్త కాక‌పోవ‌చ్చు. అనర్గ‌ళంగా ఇంగ్లీషు మాట్లాడ‌లేక‌పోవ‌చ్చు. ధారాళంగా ప్రాస‌లు కూడా ప‌ల‌క‌క‌పోవ‌చ్చు. కానీ త‌న అపార రాజ‌కీయ అనుభ‌వంలో ఆయ‌న మొద‌టి నుంచి స‌క్సెస్‌గా అమ‌లు చేస్తూ వ‌స్తున్న‌ది అడ్మినిస్ట్రేష‌న్‌నే.

ఈ విష‌యం పార్టీల‌క‌తీతంగా అంతా ఒప్పుకుంటారు. చంద్ర‌బాబు అంటే ప‌డ‌ని వాళ్లు కూడా ఈ విష‌యంలో మాత్రం త‌ల ఊపుతారు. బ‌ల‌వంతంగానైనా. ఇప్పుడాయ‌న‌కు 76 ఏళ్లు. నిన్న జ‌రిగిన యోగా డే.. మ‌రోసారి చంద్ర‌బాబు ఆరోగ్యాన్ని, అత‌ని క‌మిట్‌మెంట్‌ను చూపెట్టింది. కుర్రాడ్ని చేసింది. కొడుకు లోకేష్ కూడా తండ్రిని ఫాలో కాలేక‌పోయాడు. బాబా రాందేవ్‌తో స‌రి స‌మానంగా, దాదాపు అన్ని ఆస‌నాల‌ను సునాయ‌సంగా చేస్తూ అందులో లీన‌మైపోయాడు.

Advertisement

ఆ వీడియోలు చూసిన ఎవ‌రికైనా అర్థ‌మైపోతుంది.. ఆయ‌న‌కు ఈ ఆస‌నాలు కొత్త కాద‌ని, ఆరోగ్యం కాపాడుకోవడం నిత్య‌కృత్య‌మ‌ని. వ‌య‌స్సు మీద ప‌డుతున్నా.. య‌వ్వ‌నంగా ఆయ‌న ఎందుకు క‌నిపిస్తున్నాడోనని. సోష‌ల్ మీడియాలో బాబుగారి యోగాస‌నాలు చూసిన ప్ర‌తి ఒక్క‌రూ.. అరే.. ఎంత చ‌క్కగా చేస్తున్నారా? ఈయ‌న వ‌య‌సెంత ఇప్పుడు..? అని స‌ర్చింగ్ చేసి మ‌రీ తెలుసుకుని, త‌మ వ‌య‌స్సుతో బేరీజు వేసుకుని, త‌మ‌ను ఆయ‌న‌తో పోల్చి చూసుకుని.. అచ్చెరువొంది, హ్యాట్సాఫ్ అని కితాబిచ్చారంతా.

కొన్ని కొన్ని అలా క‌లిసొస్తాయి. కొంద‌రికి కొన్ని ప్ర‌త్యేక‌త‌లు అలా అంద‌రికీ భిన్నంగా నిలుపుతాయి. అంద‌రిలో త‌మకంటూ ఓ స్పెషాలిటీని ఆపాదిస్తాయి. అలాంటి ప్ల‌స్ పాయింట్స్‌ల‌లో బాబు త‌న ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం. నిత్య య‌వ్వ‌నంగా ఉండేందుకు క‌ఠిన ఆరోగ్య నియ‌మాలు పాటించ‌డం… దీనికి తోడు పాల‌న‌లో త‌న‌దైన అడ్మినిస్ట్రేష‌న్ మార్కును కాపాడుకోవడం..!

Advertisement

ఇప్ప‌టికీ చెప్పుకుంటారు.. బాబు గురించి.. చాలా మారాడు… అని! అంటే ఎంత అనుభ‌వం ఉన్నా.. ప‌రిపాల‌న‌లో సినియారిటీ ఉన్నా..త‌మ‌లోని లోపాల‌ను కూడా తెలుసుకుని ముందుకు సాగ‌డ‌మే రాజ‌కీయ నాయ‌కుడి ల‌క్ష‌ణ‌మ‌ని ఆయ‌న జీవితాన్ని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. చిన్న వారికి కూడా మ‌ర్యాదివ్వ‌డం.. కొత్త వారి నుంచి నేర్చుకోవ‌డానికి సంకోచించ‌క‌పోవ‌డం, త‌మ‌కు అది ఉప‌యోగ‌ప‌డుతుందంటే.. వాటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం.. బాబుకున్న ప్ర‌త్యేక ల‌క్ష‌ణం.

ఇది కూడా ఆయ‌న్ను రాజ‌కీయ పోటీ వాతావ‌ర‌ణాన్ని త‌గ్గ‌ట్టుగా ఇంకా నిల‌క‌డ‌గా నిల‌బెడుతుంద‌న‌డంలో సందేహం లేదు. మొత్తానికి యోగా డే .. చంద్ర‌బాబును ఆరోగ్య ప‌రంగా ఎలా ఉన్నాడో ప్ర‌పంచానికి చూప‌డ‌మే కాదు.. ప్ర‌శంస‌లూ పొందేలా చేసింద‌ని చెప్పాలి.

Related News

తెల్గు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఫామ్‌హౌజ్‌…! ఆ పదం రాసినందుకు ఇలేకరికి ఇచ్చిపడేసిన పెద్దసారు..!

పవర్‌ స్టేషన్స్‌ పరిశీలనకు 6 బృందాలు! థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో ఏం జరుగుతోంది..? పరిశీలనకు రేపు ఆరు చోట్ల పర్యటనలు…

ఆస్తులు పెంచుకోలే.. ప్రజల మనసుల్లో అంతస్తులు కట్టుకున్నారు! ఆ ముగ్గురి కామ్రేడ్‌ల నిస్వార్థ ప్రజాసేవ ప్రస్థానం..!

నమ్మి గెలిపిస్తే.. ముఖం చాటేశాడు! సిరిసిల్లలో ఇప్పటి వరకు 15 సార్లు మాత్రమే పర్యటించిన కేటీఆర్‌..!

వరి వద్దు.. ఈ సర్కార్‌ నోటి వెంటా ఇప్పుడిక అదే మాట..! కరువు ప్రభావం.. సాగునీటికి కటకట..!

సీఎం కోట ముందు కవిత ఛాలెంజ్‌….నేను బహుజన బాణాన్ని.. ఏ పార్టీకి తొత్తును కాదు..!

కానరాని వైష్ణవిలెందరో..!? ప్రతీకార హత్యలకు కారకులెవరు? వెన్నుతట్టి ప్రోత్సహించిన నెటిజన్లది! రెచ్చగొట్టిన జనానిది..!

ఆ ఎమ్మెల్యేది క్రెడిట్‌ చోరీ కాదు.. జనం దిల్‌ చోరీ..! మన తెలుగు నేతల లెక్క క్రెడిట్‌ కోసం కొట్టుకోలేదు.. ప్రతిపక్షానికే క్రెడిట్‌ ఇచ్చిన వైనం..!

Big Stories

Advertisement
×