Big Stories

Lok Sabha Election 2024: టార్గెట్ 330.. కాంగ్రెస్ సంచలన నిర్ణయం ?

Target 330- Sensational Decision Of Congress: కాంగ్రెస్.. గ్రాండ్ ఓల్డ్ పార్టీ.. దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన పార్టీ.. దేశాన్ని ఏళ్ల పాటు పాలించిన పార్టీ. అలాంటి పార్టీ.. ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా జస్ట్ 330 సీట్లలో మాత్రమే పోటీ చేయాలని డిసైడ్ అయ్యింది. మరి కాంగ్రెస్‌ ఈ డెసిషన్‌ తీసుకోవడం వెనక రీజనేంటి? ఎవరి కోసం ఈ త్యాగం చేస్తుంది? దేశంలో మొత్తం లోక్‌సభ స్థానాల సంఖ్య 543. ఇప్పటి వరకు కాంగ్రెస్‌ అత్యధికంగా పోటీ చేసిన స్థానాలు. 529.. అది కూడా 1996లో.. అత్యల్పంగా 2004లో 417 సీట్లలో పోటీ చేసింది. కానీ 2024 వచ్చేసరికి ఆ నెంబర్ 330కు పడిపోయింది. అంటే కాంగ్రెస్‌ హిస్టరీలోనే 400 కంటే తక్కువ సీట్లలో పోటీ చేయడం ఇదే తొలిసారి.

- Advertisement -

మరి ఎందుకు? దీనికి రీజన్సేంటి? దీనికి సింపుల్ ఆన్సర్. ఇండియా కూటమి. కూటమి కోసం కాంగ్రెస్‌ సీట్లను త్యాగం చేసింది. గతంలో అంటే 2004లో కూడా ఇలాంటి సీనే కనిపించింది. అప్పటి యూపీఏ కూటమి కోసం సీట్లను త్యాగం చేసి 417 సీట్లలో బరిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో 145 స్థానాల్లో గెలుపొందింది.. అధికారంలోకి వచ్చింది. అప్పుడు వాజ్‌పేయి హయాంలోని NDA సర్కార్‌ను కుర్చీ దింపేందుకు ఇతర పార్టీలతో జట్టు కట్టింది. విజయం సాధించింది. సేమ్ ఇప్పుడు కూడా ఇండియా కూటమి పేరుతో ఇతర పార్టీలతో జత కట్టి.. బరిలోకి దిగనుంది.అయితే 330 నంబర్ పక్కానా? అంటే ఇది పెరిగే చాన్స్‌ ఉంది కానీ.. 400 దాటే అవకాశమైతే లేదు.

- Advertisement -

Also Read: కేసీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు

అయితే పోటీ చేసే స్థానాలు తగ్గినా పర్లేదు కానీ.. ఖచ్చితంగా గెలిచే స్థానాల్లోనే పోటీ చేయాలన్నది కాంగ్రెస్ ప్లాన్‌లా కనిపిస్తోంది.. అయితే బిహార్, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, బెంగాల్‌లో మెజారిటీ సీట్లలో కాంగ్రెస్ పోటీ చేయడం లేదు. ఓవరాల్‌గా చూస్తుంటే 249 ఎంపీ సీట్లు ఉన్న ఐదు మెజారిటీ సీట్లలో కేవలం 65 సీట్లలో మాత్రమే కాంగ్రెస్ పోటీ చేస్తుంది.. మిగతా సీట్లన్నింటిని మిత్ర పక్షాలకే వదిలేసింది.
ఇప్పటి వరకు కాంగ్రెస్‌ 278 మంది అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను పరిశీలిస్తోంది. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో 28 స్థానాలు.

గుజరాత్‌లో 24, రాజస్థాన్‌లో 22, ఒడిషాలో 17, కేరళలో 16, యూపీ, మహారాష్ట్రలో 15 స్థానాలు, తెలంగాణలో 14, బెంగాల్, అస్సాంలో 13, ఏపీ, చత్తీస్‌గఢ్‌లో 11, తమిళనాడులో 9, బిహార్, పంజాబ్‌లో 6, ఉత్తరాఖండ్‌లో ఐదు, ఢిల్లీ, జార్జండ్‌లో 3 మూడు స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. అయితే కాంగ్రెస్‌ నేతలు మాత్రం తాము ఫుల్ క్లారిటీతో ఉన్నామని చెబుతున్నారు. 2004లో ఏ పరిస్థితులైతే ఉన్నాయో.. ఇప్పుడు కూడా అవే పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పుడు తమ లక్ష్యం అధికారం కాదని.. బీజేపీని గద్దె దించడమంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. 2019 ఎన్నికల్లో 421 సీట్లలో పోటీ చేసింది కాంగ్రెస్.. కానీ 52 సీట్లలో మాత్రమే గెలిచింది. అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండదని చెబుతున్నారు. తమిళనాడు, కేరళలో ఇండియా కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందన్న ధీమాలో ఉన్నారు.

Also Read: తెలంగాణలో మరో సమరం, బరిలో ముగ్గురు మొనగాళ్లు

2019 ఎన్నికల్లో కీలక రాష్ట్రాలైన గుజరాత్, మహారాష్ట్ర, బిహార్, మధ్యప్రదేశ్.. కర్ణాటక, రాజస్తాన్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, హర్యాణా, ఢిల్లీలాంటి కీలక రాష్ట్రాల్లో.. బీజేపీ, దాని మిత్రపక్షాల హవా కొనసాగింది. గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, హర్యాణా, హిమాచల్. ఉత్తరాఖండ్‌లలో బీజేపీ ఒంటరిగానే క్లీన్ స్వీప్‌ చేసింది. మొత్తంగా ఈ 12 రాష్ట్రాల పరిధిలో 247 లోక్‌సభ స్థానాలుంటే.. బీజేపీ, దాని మిత్రపక్షాలు 232 చోట్ల గెలిచాయి. అదే టైమ్‌లో కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు అంతా కలిసి కేవలం 15 చోట్ల గెలిచాయి. అయితే ఈసారి ఈ సీన్‌ రీపిట్ కావొద్దని చూస్తోంది. బలంలేని చోట పోటీ చేయడం కంటే.. ఆ స్థానాన్ని గెలిచే సత్తా ఉన్న పార్టీకి ఇచ్చి.. మద్ధతివ్వడం బెటరన్న ఆలోచనలో ఉంది.

ఇటీవలే ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. అందుకే కూటమిలో ఉన్న పార్టీలకు సీట్లు ఇచ్చేందుకు వెనకాడటం లేదు. మహారాష్ట్రలో కూడా శరద్ పవార్, ఉద్ధవ్‌ ఠాక్రే పార్టీలకు మెజార్టీ సీట్లను కట్టపెట్టింది. యూపీలో గత ఎన్నికల్లో 67 స్థానాల్లో పోటీ చేస్తే.. ఈసారి కేవలం 17 స్థానాల్లో మాత్రమే బరిలోకి దిగుతుంది. అంటే లాస్ట్ ఎలక్షన్స్‌ కంటే 50 తక్కువ. బెంగాల్, ఢిల్లీ, గుజరాత్‌, రాజస్థాన్‌లో కూడా తక్కువ సీట్లలో పోటీ చేస్తుంది. నిజానికి ఇలా తక్కువ సీట్లలో పోటీ చేయడం అనేది పెద్ద రిస్క్.. సీట్ల సంఖ్య, ఓట్ల శాతం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఆ సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు కాంగ్రెస్‌ నేతలు.. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర, న్యాయ్‌ యాత్ర, కాంగ్రెస్‌ మేనిఫెస్టో తమను గెలిపిస్తాయన్న ధీమాలో ఉన్నారు కాంగ్రెస్ నేతలు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News