E-Paper
Advertisement

ఊర్లో లేరా? ఫామ్ ఇవ్వలేదా? అయితే వెంటనే ఈ పని చేయండి.. లేదంటే ఓటు గల్లంతే!

ఊర్లో లేరా? ఫామ్ ఇవ్వలేదా? అయితే వెంటనే ఈ పని చేయండి.. లేదంటే ఓటు గల్లంతే!
Advertisement

SIR Voter Verification: ప్రజాస్వామ్యంలో మనకున్న ఒకే ఒక్క ఆయుధం ఓటు. ఆ ఆయుధం ఇప్పుడు చేయిజారిపోనుందా? ఫామ్‌లు నింపని లక్షలాది మంది ఓటర్లను ఇదే గుబులు వెంటాడుతుంది. తమ ఓటు సేఫేనా? లేక హుష్‌కాకి ఐపోతుందా. అసలు ఈ ఓట్ల సవరణ వెనుక ఉన్న వ్యూహమేంటి? ఫామ్‌లు ఇవ్వని వారి పరిస్థితి ఏంటి? రాబోయే స్థానిక సంస్థల, గ్రేటర్ ఎన్నికల ముఖచిత్రాన్ని SIR ప్రక్రియ ఎలా డిసైడ్ చేయబోతున్నాయి.

ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందా?

Advertisement

చిన్నపిల్లల దగ్గర చాక్లెటో, ఆట బొమ్మనో లాగేసుకొని కాకి ఎత్తుకెళ్లిందని చెబుతుంటాం. ఇప్పుడు SIR ప్రక్రియ చూస్తే అదే గుర్తుకు వస్తుంది. అధికారులు ఇళ్లకు వచ్చినప్పుడు ఊర్లో లేనివారు, పనుల్లో పడి ఫామ్‌లు నింపని సామాన్యులు టెన్షన్ పడుతున్నారు. నేను ఫామ్ ఇవ్వలేదు. నా ఓటు పోయినట్లేనా? అని సగటు మనిషి భయపడిపోతున్నాడు. ఏపీలో సర్‌ ప్రక్రియ ముగిసింది. ఇప్పటి వరకు 40 లక్షల ఓటర్ల వివరాలు సరిగ్గా అందలేదని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అంటే.. అంతమంది ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందా? ఈ లక్షలాది ఓట్ల సవరణ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపోటములను తారుమారు చేయబోతున్నాయా? పల్లెటూళ్లలో గెలుపోటములు కేవలం పది, ఇరవై ఓట్ల తేడాతోనే మారిపోతాయి. అలాంటి చోట్ల, ఒక వార్డులో వంద ఓట్లు గల్లంతైతే ఆ ఊరి భవిష్యత్తును నిర్ణయించేది ఎవరు?.

Also Read: క్యాబ్ డ్రైవర్ టు నరరూప రాక్షసుడు.. తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన షాబాద్ హంతకుడి ఆత్మకథ!

Advertisement

ఓటు రాత్రికి రాత్రే గల్లంతు అవ్వడం ఏంటి..?

ఫామ్ సబ్మిట్ చేయనంత మాత్రాన ఓటు రాత్రికి రాత్రే గల్లంతు అవ్వడం ఏంటి? ఎవరైతే ఫామ్‌లు ఇవ్వలేదో, ఎవరి వివరాలైతే అధికారుల పరిశీలనలో సరిపోలలేదో… వారి పేర్లు ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉండవు. మరి లిస్ట్‌లో పేరులేని వాళ్లు ఏం చేయాలి. ఎవరిని కాలవాలనే ప్రశ్నలు సామాన్య ప్రజల్లో రేజ్ అవుతున్నాయి.

33 లక్షల ఓట్లు పోయ ఛాన్స్..?

ఇక తెలంగాణ వైపు చూస్తే గుండె గుభేల్మనే నిజాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రమంతా కలిపి 88 లక్షల ఓట్లు, ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే 33 లక్షల ఓట్లు పోయే ఛాన్స్ ఉందంటున్నారు. 33 లక్షల ఓట్లు అంటే.. అది కేవలం నంబర్ కాదు. 33 లక్షల మంది పౌరుల గొంతులు. హైదరాబాద్‌కి పొట్ట చేతపట్టుకుని వచ్చి, ఇళ్లను అద్దెకు మార్చుకుంటూ బతికే వలస జీవుల ఓట్లే ఇందులో ఎక్కువ. నువ్వు ఇల్లు మారావు.. నీకు ఇక్కడ ఓటు లేదు అని వాళ్ల ఓట్లు తీసేస్తే, ఆ పేదవాడు తన బాధను ఎవరికి చెప్పుకోవాలి? ఈ ఓట్ల తొలగింపు భవిష్యత్‌లో జరిగే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేయొచ్చు. కానీ, అర్హుడైన ఒక్క పేదవాడు ఓటు కోల్పోయినా అది ప్రజాస్వామ్యానికే పెద్ద అవమానం.

Also Read: రెవెన్యూ బాధితులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు స్పెషల్ డ్రైవ్.. రంగంలోకి మంత్రి నారాయణ!

Related News

లక్నో మర్డర్ మిస్టరీ.. మోడల్ శ్రద్ధా దూబే హత్య కేసులో పూర్తి వివరాలివే?

ఓట్ల చోరీకి మోదీ సూత్రధారి.. అమిత్ షా పాత్రధారి: విపక్ష కూటమి నేతలు ఫైర్!

తెలంగాణ ఉన్నత విద్యకు మరణశాసనంగా మారిన జీవో.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో సంచలనం?

విశాఖ మేయర్ రేసులో ఉన్న మొత్తం లీడర్స్ వీళ్లే.. ఇదిగో ఫుల్ లిస్ట్?

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

Big Stories

Advertisement
×