భవిష్యత్ యుద్ధం కంటికి కనిపించదు. ఆయుధాలు అసలే కనిపించవు. కానీ నష్టం భారీగా ఉంటుంది. ఇప్పుడు లెబనాన్, సిరియాలో పేజర్ బ్లాస్ట్ తో జరిగిందే ఉదాహరణ. ప్రత్యర్థిని టార్గెట్ చేయడం ఈ ఇంటర్నెట్ యుగంలో అన్ని రకాలుగా సులువైపోయింది. కాకపోతే ఇది కాస్త కొత్తదైన దాడి. 2004లో నాటి భారత ఆర్మీ చీఫ్ గా పని చేసిన పద్మనాభన్.. సైనికులు, యుద్ధ ట్యాంకులు కాకుండా అదృశ్య ఆయుధాలతో యుద్ధాలు జరుగుతాయని ఊహించారు. అన్నట్లుగానే ఇప్పుడు చేతిలో ఉన్న పేజర్లు పేలడం చూస్తుంటే అదే నిజమైంది కూడా. ఎదురెదురుగా వచ్చి బాంబులు పేల్చక్కర్లేదు, తుపాకులతో కాల్చనవసరం లేదు. ఏ డివైజ్ నైనా రిమోట్ గా హ్యాక్ చేసి టార్గెట్ ను పేల్చేయవచ్చన్నది నిజమని తేలింది. డిజిటల్ యుగంలో అత్యంత సురక్షితంగా ఉన్నామనుకున్న సంస్థలు కూడా ప్రమాదంలో ఉన్నాయని తాజా ఘటన నిరూపిస్తోంది.
కమ్యూనికేషన్ కోడ్ ను హైజాక్ చేయడం ద్వారా, ఒక ప్రత్యర్థి నెట్‌వర్క్‌లోని చొరబడడం, ప్రతి ఒక్క పేజర్‌ను వన్ టైమ్ లో కంట్రోల్ చేసి పేల్చేశారు. నిజానికి పేజర్‌లు 1940ల్లో డెవలప్ చేశారు. ముఖ్యంగా డాక్టర్లు ఎమర్జెన్సీ సిబ్బంది, మిలటరీలో కమ్యూనికేషన్ కోసం వాడారు. ఇవి అప్పట్లో సేఫ్టీ అండ్ విశ్వసనీయమైనవి. కానీ కాలం చెల్లిన టెక్నాలజీ ఎప్పటికైనా ప్రమాదమే. సైబర్ మానిప్యులేషన్ నుంచి తప్పించుకోలేరన్నది ఇప్పుడు నిజమైంది. తమ కమ్యూనికేషన్, లొకేషన్ ట్రేస్ కావొద్దని హిజ్బుల్లా అనుకుని కాలం చెల్లిన పేజర్ లు వాడితే చివరికి వాటినే పేల్చేశారు. అంటే ఎవరి బాంబును వారే జేబులో పెట్టుకుని తిరిగారు. వాటికే బలయ్యారు.
పేజర్ లో ఈ పార్ట్ లో 10 గ్రాముల దాకా హై ఎక్స్ ప్లోజివ్ మెటీరియల్ పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. మాల్వేర్ ను రిమోట్‌గా ట్రిగ్గర్ చేయడం లేదా.. ముందుగా ప్రోగ్రామ్ చేసిన టైమర్‌లో యాక్టివేట్ చేసి పేల్చేయడం జరిగి ఉంటాయని అనుమానిస్తున్నారు. ఈ పేజర్ లు పేలడానికి కొన్ని క్షణాల ముందు మెసేజ్ లు రిసీవ్ చేసుకున్నాయి. ఆ వెంటనే పేలాయి. నిజానికి మనం వాడే మొబైల్ ఫోన్లు అయినా, ల్యాప్ టాప్ లు అయినా.. ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్ ల మాదిరిగానే, పేజర్‌లలోనూ రీ ఛార్జబుల్ లిథియం అయాన్ బ్యాటరీలే ఉన్నాయి. బ్యాటరీలు పేలినప్పుడు, మంటలు అంటుకున్నప్పుడు 590 డిగ్రీల సెల్సియస్ దాకా వేడిని రిలీజ్ చేస్తుంది. అందులో లిథియం మోతాదును బట్టి మండుతుంది. ఈ దెబ్బకు ఎవరైనా ప్రాణాలతో ఉంటారా? నిజానికి పేజర్ లో ఉండే బ్యాటరీ సైజ్ కొంతే. అదే ఎలక్ట్రిక్ వాహనాల్లో అయితే మరింత పెద్దవిగా ఉంటాయి. ఇవి ఇది వరకు చాలా వరకు మండిపోతూ కనిపించాయి కూడా. ఈవీ బ్యాటరీలు పేలి చాలా మంది చనిపోయారు కూడా. మనం వాడే సెల్ ఫోన్ల పరిస్థితి కూడా అందే. సేఫ్టీ లేని యాప్స్ ఎన్నో ఉంటాయి. హ్యాకింగ్ చేయడం చాలా సులువు కూడా. ఓవర్ హీటింగ్ చేయడం, బ్యాటరీలను మాల్ ఫంక్షనింగ్ కు గురి చేసి పేల్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని సైబర్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.
Also Read: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు
హిజ్బుల్లాకు గతం నుంచి సురక్షిత కమ్యూనికేషన్ వ్యవస్థగా ఉన్న పేజర్.. ఇప్పుడు బలహీనతగా మారింది. అదే ప్రాణాల మీదికి తెచ్చింది. ఇరాన్‌తో బలమైన సంబంధాలున్న షియా మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా. ఇది అడ్వన్స్ డ్ హ్యాకింగ్ టెక్నిక్‌ల నుంచి తమ సమాచారాన్ని కాపాడుకునేందుకు చాలా కాలంగా కాలం చెల్లిన పేజర్ కమ్యూనికేషన్ సిస్టమ్‌పై ఆధారపడింది. ఇందులో వాట్సప్ మాదిరే మెసేజ్ ఎన్ క్రిప్టెడ్ గా ఉంటుంది. అంటే మెసేజ్ పంపించే వారు, రిసీవ్ చేసుకునే వారు మాత్రమే చూడగలుగుతారు. థర్డ్ పార్టీకి ఛాన్స్ ఉందదు. కానీ అవే పేజర్‌లు రిమోట్‌గా హ్యాక్ అయ్యాయి. అలేదంటే వేడెక్కేలా చేసి పేలిపోయేందుకు కారణమయ్యాయి. సైబర్ దాడులు తరచుగా కనిపించవు. కానీ అత్యవసరమైన వ్యవస్థలు-కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, పవర్ గ్రిడ్‌లు, ఆర్థిక సంస్థలను హ్యాక్ చేయడం ద్వారా, కంట్రోల్ లోకి తెచ్చుకుంటారు. సైబర్ టెర్రరిజం మానవాళికి ఫ్యూచర్ థ్రెట్‌గా మారబోతోందని ఇది వరకే ఊహించారు. కానీ ఇలా హార్డ్ వేర్ హ్యాకింగ్ తోనూ ప్రత్యర్థులను చంపవచ్చని ఈ ఘటన రుజువు చేసింది.
సైబర్ టెర్రరిస్టులు తమ టార్గెట్ రీచ్ అయ్యేందుకు ఇంటర్నెట్‌ను వాడుకుని వర్చువల్‌గా వర్క్ చేస్తారు. సైబర్ దాడులతో ప్రభుత్వ, ప్రైవేట్ వ్యవస్థలను హ్యాక్ చేయడం, కీలకమైన మౌలిక సదుపాయాలకు తీవ్ర అంతరాయాన్ని కలిగించడం, సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేయడం, ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం ఇవే టార్గెట్స్. కానీ దేశాల మధ్య యుద్ధాల్లోనూ వీటిని వాడుతుండడమే సమస్యలను పెంచుతోంది. నిజానికి చాలా మంది గుండె సంబంధ జబ్బులు ఉన్న వారు గుండె లోపల పేస్ మేకర్లను అమర్చుకుంటారు. అవి బయటి నుంచి ఇచ్చే సిగ్నల్స్ ఆధారంగా గుండె పని చేసేందుకు కారణమవుతుంటాయి. అవి ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవుతాయి. డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది ఎక్కడి నుంచైనా వాడడానికి వీలు ఉంటుంది. అయితే వాటిని హ్యాక్ చేసి గుండె మరింత వేగంగా కొట్టుకోవడానికి కారణమై ప్రత్యర్థులను చంపిన ఘటనలూ ఉన్నాయి. ఈ పేస్ మేకర్ లు హ్యాక్ కు గురవుతున్నాయని గతంలో అమెరికాలో 5 లక్షల పేస్ మేకర్లను రీకాల్ చేశారు. సో ఇంటర్నెట్ ద్వారా పని చేసేది ఏదీ సేఫ్ కాదు అన్నది ఇప్పటికే తేలిపోయిన విషయం.
తాజా పేజర్ బ్లాస్ట్.. సప్లై చైన్ అటాక్స్ లోని లోపాల కారణంగా జరిగిందా అన్నది ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కస్టమర్‌లు లేదా క్లయింట్‌ల నెట్‌వర్క్‌లలోకి చొరబడేందుకు థర్డ్ పార్టీ ఏదైనా ఆపరేట్ చేసిందా అన్నది కీలకంగా మారింది. సో ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే సైబర్ టెర్రరిస్ట్‌ల నుంచి డిజిటల్ ఎక్విప్ మెంట్స్ ను కాపాడుకోవాలంటే సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీని మరింతగా వాడుకోవాలి. బలమైన ఫైర్‌వాల్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి. చొరబాట్లను గుర్తించే వ్యవస్థలు, ఎన్‌క్రిప్షన్ మెకానిజమ్స్ మరింత టైట్ చేసుకోవాలి. వీటి కోసం ప్రభుత్వం రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ పై పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. లెబనాన్, సిరియాలో పేలిన పేజర్ల ఘటన మిలటరీ వ్యవస్థలకు ఓ పాఠంగా మారింది. ఫోన్లు పట్టుకుని తిరుగుతున్న ప్రతి ఒక్కరినీ ఈ ఘటన డిఫెన్స్ లో పడేసింది. సో భవిష్యత్ లో జరిగే యుద్ధంలో శత్రువు ఎక్కడైనా ఉండొచ్చు. వెపన్స్ కనిపించవు, కానీ నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదే నిజం.