Woman Cop Kidnap| భారతదేశంలో క్రైమ్ రేటు ఎక్కువగా ఉత్తర్ ప్రదేశ్, బిహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉంటోందని గత కొన్ని సంవత్సరాల డేటా చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అయితే దేశంలోనే అత్యధిక క్రైమ్ రేటు ఉంది. నేరస్తులు ఆ రాష్ట్రంలో పోలీసులకు ఏ మాత్రం భయపడడం లేదు. ఇందుకు ఉదాహరణగా.. ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లఖ్‌నవు నగరంలో తాజాగా ఒక మహిళా పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ను కిడ్నాప్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. లఖ్‌నవు నగరంలోని బాబు బనారసి దాస్ పోలీస్ స్టేషన్ లో పనిచేసే రాగిణి(29, పేరు మార్చబడినది) అనే సబ్ ఇన్‌స్పెక్టర్ గత కొన్ని నెలలుగా ఇద్దరు యువకులు వేధిస్తున్నారు. ఆమె వారికి ఇవ్వాల్సిన అప్పును వెంటనే చెల్లించాలని వారిద్దరు డిమాండ్ చేసేవారు. రాగిణి ఆ అప్పు చెల్లించకపోయే సరికి వారిద్దరూ ఆమె ఫొటోలు తమ వద్ద ఉన్నాయని.. ఆ ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీలంగా మార్చి సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్ మెయిల్ చేసేవారు.
ఆ ఇద్దరు యువకులు వేధింపులు తట్టుకోలేక రాగిణ వారి ఫోన్ నెంబర్లను బ్లాక్ చేసింది. ఆ తరువాత ఆమె మహిళా పోలీస్ స్టేషన్ లో ఆ ఇద్దరు యువకులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది. దీంతో ఆ ఇద్దరు యువకులు ఆమె ఇంటికి వచ్చి ఫిర్యాదు వెనక్కు తీసుకోవాలని ఒత్తిడి చేశారు. లేకపోతే ఆమెపై దాడి చేస్తామని, ప్రాణాలు తీస్తామని బెదిరించారు. కానీ రాగిణి వారి బెదిరింపులకు లొంగలేదు.
Also Read: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..
దీంతో సెప్టెంబర్ 11, 2024 రాత్రి రాగిణి తన ఇంట్లో ఉన్నప్పుడు.. ఆ ఇద్దరు యువకులు ఒక్కసారిగా ఆమె ఇంటి ఎదురుగా కారు తీసుకొని వచ్చారు. ఆ తరువాత బలవంతంగా రాగిణి ఇంట్లో చొరబడి ఆమెను ఈడ్చుకుంటూ కారులోకి తీసుకెళ్లారు. ఆమెను కొట్టి ఆ తరువాత ఫిర్యాదు వెనక్కు తీసుకునే విధంగా ఒక ఖాళీ కాగితంపై సంతకం తీసుకున్నారు. ఇక ఆమెను, ఆమె కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు. కానీ రాగిణి జేబులో చిన్న మొబైల్ ఫోన్ ఉన్నట్లు వారు గమనించలేదు.
దీంతో అదును చూసి రాగిణి 112 పోలీస్ హెల్ప్ లైన్ కు కాల్ చేసి తనను కిడ్నాప్ చేశారని చెప్పేసింది. ఇది వెనుక నుంచి వారిద్దరిలో ఒకరు విన్నాడు. దీంతో అక్కడికి పోలీసులు చేరుకుంటారని భయపడి అక్కడి నుంచి పారిపోయారు.
రాగిణి తనకు జరిగినదంతా వివరిస్తూ.. తాను పనిచేసే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు నమోదు చేసుకొని స్టేషన్ ఇంచార్జ్ అజయ్ నారాయణ్ విచారణ చేపట్టారు. అయితే ఆ ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం.