BigTV English

Sunita Williams’ Return: సునీతా వెల్‌కమ్ బ్యాక్.. ఇంత ఆలస్యానికి కారణాలేంటి?

Sunita Williams’ Return: సునీతా వెల్‌కమ్ బ్యాక్.. ఇంత ఆలస్యానికి కారణాలేంటి?

Sunita Williams’ Return: సునీతా విలియమ్స్.. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆమె రాక కోసం ఎదురుచూస్తోంది. వారం రోజుల కోసమని అంతరిక్షంలోకి వెళ్లిన ఆమె.. 9 నెలల తర్వాత భూమి మీదకు రానున్నారు. ఐఎస్ఎస్‌తో.. నాసా క్రూ-10 మిషన్ డాకింగ్ ప్రక్రియ కూడా విజయవంతమైంది. దాదాపు 300 రోజుల తర్వాత ఆవిడ తిరిగి రానున్నారు. ఇంత ఆలస్యం కావడానికి కారణాలేంటి? ఈ ల్యాండ్‌పై.. సునీత సేఫ్‌గా ల్యాండ్ అవుతారా?


తిరిగి భువిపై అడుగు పెట్టేందుకు అంతా సిద్ధం

అంతరిక్షంలో ఉద్విగ్న క్షణాలు


సునీత రాక కోసం ఎదురుచూపులు

కౌంట్ డౌన్ మొదలైపోయింది. గతేడాది అంతరిక్షంలోకి వెళ్లిన సునీత విలియమ్స్.. దాదాపు 300 రోజుల తర్వాత దివి నుంచి భువికి తిరిగిరానున్నారు. ఆమె రాక కోసం.. ఈ భూగోళమంతా ఎదురుచూస్తోంది. ఆవిడని తిరిగి రప్పించేందుకు.. నాసా చేపట్టిన క్రూ-10 మిషన్ డాకింగ్ ప్రక్రియ సైతం విజయవంతమైంది. అస్ట్రోనాట్స్.. కొత్త క్రూకు వెల్‌కమ్ చెప్పారు. ప్రస్తుతం ISSలో 11 మంది అస్ట్రోనాట్స్ ఉన్నారు. 2 రోజుల పాటు హ్యాండోవర్ ప్రక్రియ జరగనుంది. ఈ నెల 19న సునీత విలియమ్స్.. భూమి మీదకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. 9 నెలల తర్వాత ఆమె సునీతా విలియమ్స్, విల్మోర్ భూమికి చేరుకోనున్నారు.

అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారత సంతతి మహిళ

సునీత విలియమ్స్.. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారత సంతతి మహిళ. వ్యోమనౌకలో తలెత్తిన లోపాలతో.. ఆమె 9 నెలలుగా పైనే ఉండిపోయారు. గతేడాది జూన్ 5న సునీత అంతరిక్షంలోకి వెళ్లారు. తిరిగి అదే నెలలో భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది. కానీ.. అది జరగలేదు. సునీత స్పేస్‌లోకి వెళ్లి.. 280 రోజులు దాటింది. భూకక్ష్యకు సుమారు 400 కిలోమీటర్ల ఎత్తున ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కి.. సునీతను, ఆమె సహ వ్యోమగామి బుచ్ విల్మోర్‌ని.. బోయింగ్ స్టార్‌లైనర్ విజయవంతంగా తీసుకెళ్లింది.

స్టార్ లైనర్‌కు రిపేర్లు చేసినా ఫలించని ప్రయత్నాలు

వారిని అక్కడ దించేసిన తర్వాత.. అది పనిచేయడం మానేసింది. నాసా టీమ్ భూమి మీద నుంచి స్టార్‌లైనర్‌కు చేసిన రిపేర్లు కూడా పనిచేయలేదు. అలా.. వారం రోజుల కోసం వెళ్లి.. నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీత విలియమ్స్.. తిరిగి ఈ భువిపై అడుగు పెట్టేందుకు అంతా సిద్ధమైంది. ఇందుకోసం.. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ క్రూ-10 వ్యోమ నౌకను స్పేస్‌లోకి పంపారు. మార్చి 19న.. సునీత భూమి మీదకు వచ్చే అవకాశముంది.

స్టార్ లైనర్‌‌ను టెస్ట్ చేసేందుకు వెళ్లిన సునీత, విల్మోర్

సునీత స్పేస్ ఎపిసోడ్‌లో గమ్మత్తైన విషయం ఏమిటంటే.. స్టార్ లైనర్ స్పేస్ షిప్‌ని టెస్ట్ చేసేందుకు వెళ్లిన సునీత, విల్మోర్.. అదే స్టార్ లైనర్ పనిచేయకపోవడంతో.. అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు.. వాళ్లిద్దరూ క్షేమంగా భూమి మీదకు దిగి రావాలని అంతా కోరుకుంటున్నారు. నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోవడం వల్ల.. సునీత ఆరోగ్య కాస్త క్షీణించింది. ఆవిడ బరువు తగ్గిపోయినట్లుగా తెలుస్తోంది. అంతరిక్షంలో పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని.. అందువల్ల బలహీనంగా కనిపిస్తున్నారని చెబుతున్నారు. దీర్ఘకాలంలో అంతరిక్షంలో ఉన్నవారికి.. స్పేస్ ఎనీమియా వస్తుంది. మైక్రో గ్రావిటీకి గురై.. ఎర్ర రక్తకణాల క్షీణత ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే.. ఇప్పటివరకు రిలీజైన ప్రతి ఫోటోలో.. సునీత ఆత్మవిశ్వాసంతో.. చిరునవ్వుతో కనిపించారు.

వ్యోమగాములను రప్పించేందుకు విశ్వప్రయత్నాలు

అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను ఎలాగైనా భూమిపైకి తీసుకురావాలని నాసా విశ్వ ప్రయత్నాలు చేసింది. ప్రతిసారి ఏదో ఒక ఆటంకం ఏర్పడి.. పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పగ్గాలు చేపట్టాక.. సునీతా విలియమ్స్, విల్మోర్‌ని.. భూమిపైకి తీసుకొచ్చే బాధ్యతను.. స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌కు అప్పగించారు. దాంతో.. వారి రాకపై ఓ క్లారిటీ వచ్చింది. మార్చి 19న నాసా క్రూ-10 మిషన్ ద్వారా.. వాళ్లిద్దరూ తిరిగి భూమికి రానున్నారు.

భూమిపై కాలు మోపనున్న సునీత, విల్మోర్

9 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. ఎన్నో అనుమానాలని పటాపంచలు చేస్తూ.. సునీత, విల్మోర్ భూమిపై కాలు మోపనున్నారు. సునీతా విలియమ్స్ భారతీయ మూలాలున్న మహిళ. ఆమె తండ్రి గుజరాతీ. తల్లి ఉర్సులిన్ స్లోవేనియన్ మహిళ. సునీత అంతరిక్షంలోకి వెళ్లడం ఇది మూడోసారి. కానీ.. ఆవిడ గతంలో ఎప్పుడూ ఇన్ని రోజుల పాటు అంతరిక్షంలో ఉండలేదు. ఇప్పుడు ఆవిడ క్షేమంగా భూమిపైకి తిరిగి రావాలని అంతా కోరుకుంటున్నారు.

భారతీయ మూలాల్ని మర్చిపోలేని సునీతా విలియమ్స్

ఎంత ఎత్తుకు ఎదిగినా.. మూలాల్ని మర్చిపోవద్దంటారు. ఈ విషయంలో.. సునీత విలియమ్స్ అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. భారతీయ మూలాలున్న ఆమె.. మన సంస్కృతిని, ఆధ్యాత్మికతను మర్చిపోలేదు. అంతరిక్షంలోకి వెళ్లినా.. భారతీయత గొప్పదనాన్ని చాటారు. ఇండియన్ యూత్‌కు.. స్ఫూర్తిగా నిలిచారు.

తన సాంస్కృతిక వారసత్వాన్ని మర్చిపోని సునీత

అమెరికాలో పుట్టి పెరిగినా.. సునీతా విలియమ్స్ ఎప్పుడూ తన సాంస్కృతిక వారసత్వాన్ని మర్చిపోలేదు. ప్రతి మిషన్‌లో.. ఆమె తన భారతీయతని చాటే ప్రయత్నం చేసింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి భగవద్గీతను తీసుకెళ్లినా.. స్పేస్‌లోనే దీపావళిని జరుపుకున్నా.. ఆమె తన భారతీయ వారసత్వం పట్ల ఉన్న గౌరవాన్ని.. అనేక విధాలు ప్రదర్శించారు. బోయింగ్ స్టార్‌లైనర్‌లో అంతరిక్షంలోకి వెళ్లేటప్పడు.. సమోసాలను తీసుకెళ్లారు.

స్పేస్ స్టేషన్ లోనే దీపావళి జరుపుకున్న సునీత విలియమ్స్

తనకెంతో ఇష్టమైన భారతీయ వంటకాల పట్ల.. ఆమెకున్న ప్రేమను వ్యక్తం చేశారు. అంతరిక్షంలో సునీతకు మరపురాని అనుభవం ఏదైనా ఉందంటే.. స్పేస్ స్టేషన్‌లో దీపావళి జరుపుకోవడమే. భారత్ నుంచి వలసెళ్లిన తన తండ్రిని గుర్తు చేసుకుంటూ.. దీపావళి జరుపుకున్నారు. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో దీపావళిని జరుపుకోవడం వల్ల.. భారతీయ వారసత్వంతో ఆమెకున్న కనెక్షన్‌ ఎంత గొప్పదో అందరికీ అర్థమైంది. సాంస్కృతిక మూలాల్ని.. ఆమె ఎప్పటికీ మర్చిపోదనే విషయం.. అప్పుడే తెలిసింది.

అంతరిక్షంలోకి బలాన్ని, ఓదార్పును అందించిన భగవద్గీత

సునీతా విలియమ్స్.. తన జీవితంలో ముఖ్యమైన మార్గదర్శకాలుగా ఉన్న భగవద్గీతని సైతం అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. అందులోని బోధనలు.. ఆమెకు బలాన్ని, ఓదార్పును అందించాయని తెలిపారు. స్పేస్ స్టేషన్‌లో.. ఈ పవిత్ర గ్రంథాలు ఆమెకు శాంతిని చేకూర్చాయి. విశ్వంలోని సుదూర ప్రాంతాల్లోనూ లోతుగా పాతుకుపోయిన ఆధ్యాత్మికత.. ఎలాంటి మార్గదర్శకత్వాన్ని అందించగలదో సునీత చూపించారు. తన కెరీర్ అంతటా.. సునీత ఎంతోమంది భారతీయ యువతకు స్ఫూర్తిగా నిలిచారు. ఆమె సక్సెస్ స్టోరీ.. చాలా మందికి సైన్స్, టెక్నాలజీ, అంతరిక్ష పరిశోధనల్లో కెరీర్‌ కొనసాగించేందుకు ప్రేరణనిచ్చింది. యువత.. తమని తాము బలంగా నమ్మలని.. అత్యున్నత శిఖరాలు చేరుకోవాలని ప్రోత్సహించారు. సునీత జర్నీ.. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. అంకితభావం, కృషితో.. ఏదైనా సాధ్యమేనని నిరూపిస్తుంది.

తన అంతరిక్ష ప్రయాణంలో గణపతి విగ్రహాన్ని తీసుకెళ్లిన సునీత

సునీత.. తన అంతరిక్ష ప్రయాణంలో.. వినాయకుడి విగ్రహాన్ని కూడా తీసుకెళ్లారు. గణపతి తన జీవితంలో మార్గదర్శిగా ఎలా ఉన్నాడో.. ఆమె వివరించారు. గణేశుడిని అంతరిక్షంలోకి తీసుకెళ్లడం ద్వారా.. సునీతా విలియమ్స్ తన భారతీయ మూలాలతో ఉన్న సంబంధాన్ని.. ఈ ప్రపంచానికి చాటి చెప్పింది. తన సంస్కృతి, ఆధ్యాత్మికతలో కొంత భాగాన్ని.. అంతరిక్షం దాకా మోసుకెళ్లింది. ఆమె ఎంత దూరం ప్రయాణించినా.. సాంస్కృతిక, ఆధ్యాత్మిక గుర్తింపు.. ఆమె ప్రయాణంలో ప్రధాన భాగంగా ఉందని తెలియజేసింది. ఈ చర్యలన్నింటితో.. భారతీయ వారసత్వంతో తనకున్న సంబంధాన్ని.. అంతరిక్షం నుంచి అందరికీ చాటి చెప్పింది సునీతా విలియమ్స్.

సునీత ప్రయాణంలో సాంస్కృతిక ఆధ్యాత్మిక గుర్తింపు

మొత్తానికి.. 9 నెలలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లోనే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ త్వరలోనే భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. వీరి స్థానంలో.. అక్కడ విధులు నిర్వర్తించేందుకు.. నలుగురు వ్యోమగాములతో కూడిన క్రూ డ్రాగన్ స్పేస్ షిప్.. అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి రోదసీలోకి దూసుకెళ్లింది. క్రూ-10 మిషన్‌లో భాగంగా.. స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్.. వీళ్లందరినీ నింగిలోకి మోసుకెళ్లింది.
ఎండ్ విత్ స్పాట్..

Related News

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

Big Stories

×