BigTV English

Prabhas: బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో బాహుబలి తిరిగోస్తున్నాడు…

Prabhas: బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో బాహుబలి తిరిగోస్తున్నాడు…

Prabhas: తెలుగు చిత్రసీమలో రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. 2025లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రీ-రిలీజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రీరిలీజ్ ట్రెండ్ లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ జోష్ నింపారు. ఇప్పుడు 2025 ప్రభాస్ అసలు రీరిలీజ్ రికార్డ్స్ అంటే ఏ రేంజులో ఉంటాయో నేను చూపిస్తా అంటూ బాక్సాఫీస్ వార్ కి రెడీ అయ్యాడు. ఇప్పటికే ‘సలార్’ అడ్వాన్స్‌ బుకింగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి… లేటెస్ట్ గా మహేంద్ర బాహుబలి రంగంలోకి దిగాడు.


ఈ జనరేషన్ ఆడియన్స్ పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన సినిమా బాహుబలి. టాలీవుడ్, శాండల్ వుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్… ఇలా ఒక్కో ఇండస్ట్రీకి ఒక్కో స్టార్ హీరో ఉండొచ్చు కానీ ఇండియా మొత్తానికి ఒకడు స్టార్ హీరో, వాడి పేరు ప్రభాస్ అని తెలిసేలా చేసిన సినిమా “బాహుబలి”. తెలుగు సినిమా ఉన్నంతవరకూ నిలిచిపోయే క్లాసిక్ ని బాహుబలి పార్ట్ 1&2 రూపంలో ఆడియన్స్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు జక్కన్న. రాజమౌళి మాస్టర్ క్లాస్ టేకింగ్, ప్రభాస్ టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్, రానా విలనిజం, హ్యూజ్ సెట్స్, భారి ఫైట్స్, నెవర్ బిఫోర్ విజువల్ ఎఫెక్ట్స్ బాహుబలి సినిమాని చాలా స్పెషల్ గా మార్చాయి. అందుకే ఇన్నేళ్లు అవుతున్నా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బాహుబలి రికార్డ్స్ చెక్కు చెదరకుండా ఉన్నాయి.

ఏ పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతున్నా, ఆ మూవీ బాక్సాఫీస్ టార్గెట్ బాహుబలి అవుతుంది… ఏ  స్టార్ హీరో పాన్ ఇండియా సినిమా చేసిన అతని టార్గెట్ ప్రభాస్ ప్లేస్ కొట్టేయడం అవుతుంది అంటే బాహుబలి ఇంపాక్ట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి స్టాండర్డ్స్ సెట్ చేసిన బాహుబలి మూవీ మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతోంది.


సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా రోజులుగా బాహుబలి రీ-రిలీజ్ గురించి ట్వీట్స్ చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా ఫ్యాన్స్ ప్రిడుసుర్ శోభునే ట్యాగ్ చేసి ట్వీట్స్ వేయడంతో… ప్రొడ్యూసర్ రెస్పాండ్ అయ్యాడు. శోభు యార్లగడ్డ రెస్పాండ్ అవుతూ… ‘బాహుబలి-1’ మరియు ‘బాహుబలి-2’ చిత్రాలను ఈ ఏడాదిలోనే మళ్లీ విడుదల చేయనున్నట్లు తెలిపారు.

జులైలో ‘బాహుబలి-1’ విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, దీనిని గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయాలనే ఆలోచన వచ్చినట్టు సమాచారం. ‘బాహుబలి’ మళ్లీ థియేటర్లలో సందడి చేస్తే, అది కేవలం సినిమా విడుదల కాదు – ఓ భారీ సంబరం! ప్రేక్షకులు తిరిగి ఈ విజువల్ మాజిక్‌ను భారీ తెరపై ఆస్వాదించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఇది ఓ పండుగలా మారనుంది!

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×