Brahmamudi serial today Episode: యామినితో బయటకు వెళ్లిన రాజ్‌ను కావ్య చూస్తుంది. వెంటనే కారు దిగి రాజ్ కారు వెనకాల ఏవండి అంటూ పరుగెడుతుంది. ఎంత దూరం పరిగెత్తినా కారు దొరకదు. కావ్య అలిసిపోయి ఒక దగ్గర నిలబడగానే.. కారు కూడా సడెన్‌గా ఆగుతుంది. అందులోంచి రాజ్ దిగుతాడు. కావ్య చూసి షాకింగ్‌గా పరుగెత్తలేక మెల్లగా నడుస్తూ రాజ్ వైపు వెళ్తుంది. దగ్గరకు వెళ్లి ఏవండి అంటూ పిలుస్తూనే.. కళ్లు తిరిగి కింద పడిపోతుంది. రాజ్ చూసి ఎవరో తెలియనట్టు ఏవండి ఏమైందండి అని పిలుస్తుంటాడు. ఇంతలో కొంత మంది జనం వచ్చి సన్‌స్ర్టోక్ తగిలినట్టు ఉంది. వెంటనే మీ కారులో హాస్పిటల్‌కు తీసుకెళ్లండి అని చెప్తారు. సరే నా కారులో తీసుకెళ్తాను. కొంచెం సాయం చేయండి అని రాజ్, కావ్యను తీసుకుని హాస్పిటల్‌కు వెళ్తాడు.
హాస్పిటల్‌లో డాక్టర్ ఎదురు రాగానే రాజ్.. డాక్టర్ ఏమైందో తెలియదు.. రోడ్డు మీద ఈవిడ ఉన్నట్టుంది కింద పడిపోయారు. కళ్లు తిరిగాయి అనుకుంట.. అని చెప్పగానే డాక్టర్ పల్స్ బాగా లో అయిపోయింది ఐసీయూకి తీసుకెళ్లండి త్వరగా ఫాస్ట్.. అని చెప్పగానే కావ్యను ఐసీయూకి తీసుకెళ్తారు. ఇంతలో యామిని రాజ్ కు ఫోన్ చేస్తుంది. ఏంటి బావ నా మీద ఏమైనా కోపం వచ్చిందా..? వదిలేసి వెళ్లిపోయావేంటి..? అని అడగ్గానే.. అదేంటి యామిని అలా అంటావు. నీ మీద నాకు కోపం ఎందుకు వస్తుంది. అంటాడు రాజ్. మరి ఎక్కడికి వెళ్లిపోయావు బావ అని యామిని అడగ్గానే.. రాజ్ ఇందాక రోడ్డు మీద ఒక అమ్మాయి కళ్లు తిరిగి పడిపోయింది. అందుకే హాస్పిటల్‌కు తీసుకొచ్చాను అని చెప్పగానే.. యామిని అందుకని నన్ను రోడ్డు మీద నిలబెడతావా..? అని అడుగుతుంది. దీంతో రాజ్ అదేంటి అలా మాట్లాడతావు ఒక మనిషి ప్రాణం కన్నా ఏదీ ఎక్కువ కాదు కదా..? అనగానే..
వీడు గతం మర్చిపోయినా.. మానవత్వం మాత్రం మర్చిపోలేదు అని మనసులో అనకుంటూ.. సరే బావ నువ్వు వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేస్తుంటాను త్వరగా వచ్చేయ్ అంటుంది. దీంతో రాజ్ ఎందుకు నువ్వు అక్కడ వెయిట్ చేయడం.. క్యాబ్‌లో వెళ్లిపోవచ్చు కదా అని చెప్పగానే.. లేదు నువ్వు వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేస్తా అంటుంది యామిని. ఇంతలో డాక్టర్ లోపల నుంచి వస్తుంది. ఆ అమ్మాయికి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతాడు రాజ్. పెద్దగా సీరియస్ ఏం కాదు.. కళ్లు తిరిగి పడిపోయినట్టు ఉంది. సెలైన్ ఎక్కిస్తున్నాము ఒక అరగంటలో తీసుకెళ్లొచ్చు అని డాక్టర్ చెప్తుంది. ఓకే డాక్టర్ తను ఎవరో తెలియదు.. ప్రాబ్లమ్ ఏమీ లేదన్నారు కాబట్టి నేను వెళ్లిపోతాను. మా వాళ్లు ఎదురుచూస్తుంటారు. నేను బిల్లు కట్టేసి వెళ్లిపోతాను అని రాజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాను.
అని రాజ్ వెళ్లి బిల్లు కడుతుంటే కావ్య కళ్లు తెరుస్తుంది. రాజ్ కోసం సెలైన్ బాటిల్ విదిలించుకుని బయటకు పరుగెత్తుకొస్తుంది. ఇంతలో రాజ్ బిల్లు కట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కావ్య పరుగెత్తుకొచ్చే సరికి రాజ్ బయటకు వెళ్లిపోతాడు. కావ్య బయటకు వచ్చేసరికి రాజ్ కారులో వెళ్లిపోతాడు. కానీ కావ్య హ్యాపీగా ఫీలవుతుంది. ఆయనకు ఏం కాలేదు. ఆయన ప్రాణాలతోనే ఉన్నారు అని సంతోషపడుతుంది.
దుగ్గిరాల ఇంట్లో రుద్రాణి అందరినీ కన్పీన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. అమ్మా కావ్య మాటలు పట్టుకుని మీరంతా మౌనంగా ఉంటే ఎలా ఇప్పటికైన నమ్మండి.. రాజ్ లేడు.. రాడు.. చనిపోయాడు అని చెప్పగానే.. కావ్య వచ్చి గట్టిగా బతికే ఉన్నాడు అని అరుస్తుంది. దీంతో అందరూ షాక్ కూడిన ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. అవును నా భర్త బతికే ఉన్నాడు. నా నమ్మకం బతికించింది. నా సంకల్పం గెలిపించింది. ఆయన ప్రాణాలతోనే ఉన్నారు. అత్తయ్యా మీకింకా కడుపుకోత లేదు. ఒక్క కన్నీటి చుక్క కూడా రావాల్సిన అవసరం లేదు నేను నా కళ్లారా చూశాను అని చెప్తుంది. దీంతో ఇందిరాదేవి.. అనుమానంగా కావ్య ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అడుగుతుంది.
అయ్యో అమ్మమ్మ నేను చెప్తూనే ఉన్నానా..? ముందు నుంచి ఆయనకు ఏమీ కాదని నేను అంటూనే ఉన్నాను కదా..? ఆయనకు ఏమీ కాలేదు ఎప్పటిలాగే ఉన్నారు. అని చెప్పగానే.. రుద్రాణి అయిపోయింది. ఇప్పటి వరకు నాకు కాస్త అనుమానంగా ఉండేది. ఇప్పుడు పూర్తిగా కన్ఫం అయిపోయింది. కావ్యకు మతి భ్రమించింది. మతిస్థిమితం తప్పింది. అనగానే కావ్య కోపంగా రుద్రాణిని తిడుతుంది. అడ్డొచ్చిన అప్పును తిడుతుంది. సరిగ్గా ఎంక్వైరీ చేయలేదని నిందిస్తుంది. కావ్య నవ్వుతూ హ్యాపీగా ఫీలవుతుంటే.. అందరూ నిజంగానే కావ్యకు పిచ్చి పట్టిందని అనుకుంటారు. ఇంతలో కళ్యాణ్ కూల్‌గా వదిన ఏమైంది అని అడగ్గానే.. తనకు రోడ్డు మీద జరిగిన సంఘటన కావ్య చెప్తుంది. దీంతో రుద్రాణి వెటకారంగా రాజ్ కావ్యను ఎత్తుకున్నాడట.. హాస్పిటల్‌లో అడ్మిట్ చేశాడంట.. కానీ గుర్తు పట్టకుండా వెళ్లిపోయాడట అంటూ తిడుతుంది.
మిగతా అందరూ మౌనంగా ఉంటారు. నిజంగా రాజ్ బతికే ఉంటే ఇంటికి ఎందుకు రాలేదు. ఎవరి కారులోనో ఎందుకు వెళ్లాడు. నిన్ను చూసిన వాడు వదిలేసి ఎందుకు వెళ్తాడు. మానసికంగా నువ్వు ఎంత డిస్టర్బ్ అయ్యావో అర్తం అవుతుంది. నీకు ట్రీట్‌మెంట్ అవసరం అని తెలిసిపోతుంది అని చెప్పగానే.. కావ్య కోపంగా తిట్టగానే రుద్రాణి ఈ కావ్యను ఇలాగే వదిలేస్తే పిచ్చి ముదిరిపోయేలా ఉందని వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ ఇప్పించండి అని చెప్తుంది. దీంతో కావ్య ఇప్పుడు నేను ఎంత చెప్పినా మీరు నమ్మరు కానీ నా భర్తను తీసుకొచ్చి మీ అందరి ముందు నిలబెట్టకపోతే నా పేరు కావ్వే కాదు గుర్తు పెట్టుకోండి అంటూ చెప్పి వెళ్లిపోతుంది కావ్య. మరోవైపు రాజ్ ఐడెంటిటీని మార్చేస్తుంది యామిని. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?