BigTV English

Tahawwur Rana: ఆర్మీ కెప్టెన్ టూ.. మోస్ట్ డేంజర్ టెర్రరిస్ట్.. తహవుర్ రాణాకు ఉరిశిక్షేనా?

Tahawwur Rana: ఆర్మీ కెప్టెన్ టూ.. మోస్ట్ డేంజర్ టెర్రరిస్ట్.. తహవుర్ రాణాకు ఉరిశిక్షేనా?

Tahawwur Rana: తహవుర్ రాణా.. మొదట్లో మిలటరీ డాక్టర్. పాకిస్తాన్ లో ఆర్మీ కెప్టెన్. 1997లో కెనడా వెళ్లాడు. 2001లో కెనడా పౌరసత్వం సంపాదించుకున్నాడు. లైఫ్ అలా కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది. కానీ మైండ్ అంతా టెర్రరిస్ట్ ఆలోచనలే. భారత్‌లు అస్థిరపరచాలన్న కుట్రలే. మోస్ట్ డేంజరస్ పర్సన్. లేకపోతే ముంబైపై యుద్ధం ప్రకటించేంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అమెరికాలో సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత రాణాను భారత్ షిఫ్ట్ చేశారు. ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడులకు కుట్ర చేశాడు. భారత్ చేసే విచారణలో అసలు మ్యాటర్ ఏంటో బయటకు రాబోతోంది.


పుట్టింది పాక్‌లో, పని చేసింది ఆర్మీలో..

ఇదే ఆలోచనలు.. అందుకే తహవుర్ రాణా మోస్ట్ డేంజరస్ అనేది. ఇతడు పుట్టింది పాకిస్తాన్‌లో. పని చేసింది పాక్ ఆర్మీలో. మిలటరీ డాక్టర్.. మంచి జీవితం.. మంచి జీతం. కానీ మైండ్ నిండా కుట్రపూరిత ఆలోచనలే. పాక్ ఆర్మీకి గుడ్ బై చెప్పి అమెరికా, కెనడాలో వ్యాపారాలంటూ బయల్దేరాడు. మాంసం బిజినెస్, ట్రాన్స్ పోర్ట్ వ్యాపారం చేశాడు. చంపడం ఈజీ.. ప్రాణం పోయడమే కష్టం.


మైండ్ నిండా భరత వ్యతిరేక ఆలోచనలే

ఇది మిలటరీ డాక్టర్‌గా తహవుర్ రాణాకు తెలుసు. అయినా సరే.. రూట్ మార్చేశాడు. 1997లో భార్యతో సహా కెనడాకు షిఫ్ట్ అయ్యాడు. 2001లో కెనడా సిటిజన్ షిప్ సంపాదించుకున్నాడు. అలాగైనా పద్ధతిగా ఉంటే బాగుండేది. కానీ మనసు నిండా భారత వ్యతిరేక ఆలోచనలు పెంచుకున్నాడు. ముంబై దాడులకు కుట్రలు పన్నాడు. ఎంతలా అంటే.. ఒక యుద్ధం చేసేంతలా.

తనను భారత్ అప్పగించొద్దని వాదనలు

తహవుర్ రాణా గురించి ఇప్పుడు ఇంత సీన్ క్రియేట్ ఎందుకంటే.. నరరూప రాక్షసున్ని భారత్‌కు అప్పగించింది అమెరికా. ఇండియా వెళ్లకుండా క్యాన్సర్ అని, అక్కడ చంపేస్తారని ఇలా ఏవేవో చెప్పుకొచ్చినా అమెరికా సుప్రీం కోర్టు అవన్నీ కొట్టేసింది. ఇక ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక.. ఒక్క సెకన్ కూడా లేట్ చేయకుండా భారత్‌కు అప్పగించే ఫైల్ పై సంతకం పెట్టేశారు. అంతే కాదు మోడీ వైట్ హౌజ్ వెళ్లినప్పుడు ట్రంప్ ఓ మాటన్నాడు.

తహవుర్ రాణా ప్రమాదకరమైన వ్యక్తి ట్రంప్

ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై ఉగ్రదాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్‌ కు అప్పగిస్తున్నాం. అలాగే త్వరలో మరింతమంది క్రిమినల్స్ విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇది ముంబై దాడుల దర్యాప్తు విషయంలో భారత్ కు బిగ్ బూస్టప్ ఇచ్చినట్లయింది. అన్న మాట ప్రకారమే తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించారు. సో ముంబై ఉగ్రదాడుల్లో ఓ విదేశీయున్ని భారత్‌కు విచారణ కోసం అప్పగించడం ఇదే తొలిసారి.

అజ్మల్ కసబ్‌ను ఉరి తీసిన భారత్

నిజానికి ఏ దేశం కూడా అంత ఈజీగా తమ దేశస్తులను, పౌరసత్వం ఉన్నవారిని, ఆశ్రయం పొందిన వారిని ఇతర దేశాలకు విచారణల కోసం అంత ఈజీగా అప్పగించవు. ఒప్పుకోవు. కానీ రాణా విషయంలో అమెరికా, అందులోనూ ట్రంప్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. సో ముంబై దాడుల్లో పాత్రధారులంతా అంటే గన్స్ పట్టుకుని వచ్చిన వారంతా చనిపోయారు. ప్రాణాలతో దొరికిన ఒకే ఒక్కడు అమీర్ అజ్మల్ కసబ్ పాకిస్తాన్ జాతీయున్ని భారత్ ఉరి తీసేసింది.

ముంబై దాడుల వెనుక పాక్‌లో ఎవరి హస్తం ఉంది?

అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇలా దాడులు చేయాలని ఎవరు పురిగొల్పారు. రెక్కీలు ఎవరు చేశారు. ఎవరు చేయించారు? భారత్ ను ఎందుకు టార్గెట్ చేశారు? దీని వెనక లక్ష్యం ఏంటి? ఇవన్నీ ఇప్పుడు బయటకు రావాల్సిన నిజాలు. అందుకే తహవుర్ రాణా విచారణ చాలా కీలకంగా మారబోతోంది.

Also Read: ట్రంప్ ప్లాన్‌తో తికమక.. టారీఫ్‌లపై బిగ్ ట్విస్ట్..! చైనాకు నో కంప్రామైజ్

డేవిడ్ హెడ్లీ అలియాస్ దావుద్ గిలానీ కీ రోల్

రాణాకు డేవిడ్ కోల్మన్ హెడ్లీ అనే ఫ్రెండ్ ఉన్నాడు. అలియాస్ దావూద్ గిలానీ. ఇతడు పాకిస్తాన్ అమెరికన్. ఇద్దరూ పాకిస్తానీలే. ఇద్దరూ లష్కరే తొయిబా తొత్తులే. 15 ఏళ్ల క్రితం ట్రావెల్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో తహవుర్ రాణాకు హెడ్లీ పరిచయమయ్యాడు. ముంబయిలో ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూప్రింట్‌ తయారీలో రాణా హస్తం ఉంది. 2008 నవంబర్ 11 నుంచి 21 మధ్యలో స్వయంగా తహవుర్ రాణా ముంబైకి వెళ్లాడు. ఎలా ప్లాన్ చేయాలి.. ఎక్కడెక్కడ తిరగాలి అన్నవి క్లియర్ చేసి వచ్చాడు.

నవంబర్ 26, 2008న ముంబైపై టెర్రర్ ఎటాక్

అంతే అతడు వెళ్లిన 5 రోజుల్లోనే అంటే నవంబర్ 26, 2008న ముంబైపై దాడి జరిగింది. 10 మంది పాకిస్తానీ టెర్రరిస్టులు అరేబియా సముద్ర మార్గం ద్వారా చిన్న బోట్ లో ముంబైలో చొరబడ్డారు. ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్, తాజ్ మహల్, ఒబరాయ్ హోటళ్లు, సహా ఇతర రద్దీ ప్రాంతాలను టార్గెట్ చేసి దాడి చేశారు. ఈ మారణహోమంలో మొత్తం 166 మంది చనిపోయారు. ఇందులో అమెరికా, బ్రిటిష్, ఇజ్రాయెల్ జాతీయులూ ఉన్నారు. దాదాపు 60 గంటల పాటు జరిగిన ఈ టెర్రర్ ఎటాక్ యావత్ దేశాన్ని అలర్ట్ చేసింది. దేశంలో అలజడి సృష్టించింది. అంతే కాదు.. భారత్ పాక్ యుద్ధం అంచుదాకా తీసుకొచ్చింది.

2020లో కోవిడ్ కారణంగా జైలు నుంచి రిలీజ్

2013లో తహవుర్ రాణాకు 14 ఏళ్ల జైలుశిక్ష పడింది. డెన్మార్క్ లో ఉగ్ర కుట్రలు, 2005 నుంచి 2009 వరకు లష్కరే తొయిబాకు సహాయ సహకారాలు అందించారన్న అభియోగాలపై ఈ శిక్ష పడింది. అయితే ముంబై దాడులకు ఈయనే సూత్రధారి అన్న వాదనను కోర్టులు అంగీకరించలేదు. 2020లో కోవిడ్ కారణంగా జైలు నుంచి రిలీజ్ చేశారు. 2020 జూన్‌లో అతన్ని అరెస్ట్ చేయాలని భారత్ అమెరికాను కోరింది. అంతేకాదు.. రాణాను తమకు అప్పగించాలని, అప్పగింత కోసం న్యాయప్రక్రియ మొదలు పెట్టాలన్నది. దాంతో అప్పటి నుంచి మొదలు పెట్టి.. కోర్టులు కేసులు, తహవుర్ రాణా పిటిషన్లు అన్నీ ముగిసి.. తాజాగా ఇప్పుడు యూఎస్ సుప్రీం కోర్టు అప్పగింతకు ఓకే చెప్పడం.. ట్రంప్ సంతకం చేయడం, భారత్ తీసుకురావడంతో ఈ కుట్రల్లో అసలు భాగస్వాములెవరో తేలబోతోంది.

 

 

 

Related News

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

Big Stories

×