BigTV English

Tahawwur Rana David headley: తహవుర్ రాణాను భారత్‌కు తీసుకొచ్చారు.. మరి డేవిడ్ హెడ్లీ ఎక్కడ?

Tahawwur Rana David headley: తహవుర్ రాణాను భారత్‌కు తీసుకొచ్చారు.. మరి డేవిడ్ హెడ్లీ ఎక్కడ?

Tahawwru Rana David headley| 2008 ముంబై ఉగ్రవాద దాడులలో కీలక కుట్రదారుడు తహవ్వుర్ రాణాను అమెరికా ప్రభుత్వం భారతదేశానికి అప్పగించిన నేపథ్యంలో.. మరొక ప్రధాన కుట్రదారుడు డేవిడ్ హెడ్లీని ఎప్పుడు తీసుకువస్తారనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతోంది. అయితే అతడిని భారతదేశానికి తీసుకురావడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.


ముంబై దాడులకు ముందు.. ఆ కుట్రలో కీలక పాత్ర పోషించిన డేవిడ్ కోల్మన్ హెడ్లీ ముంబైలో రిక్కీ నిర్వహించాడు. అతడికి అన్ని విధాలా రాణా సహాయం చేశాడు. ఇప్పుడు రాణాను అమెరికా ప్రభుత్వం భారతదేశానికి అప్పగించేంది. కానీ హెడ్లీని అప్పగించడానికి అమెరికా సిద్ధంగా లేదని తెలుస్తోంది. దీనికి చట్టపరమైన, దౌత్య, వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని గూఢచారి వర్గాలు వెల్లడించాయి. 2010లోనే హెడ్లీ తనను భారత్, పాకిస్తాన్, డెన్మార్క్ దేశాలకు అప్పగించకూడదని అమెరికా అధికారులతో ఒప్పందం చేసుకున్నట్లు తెలియజేశారు. ఇది చట్టబద్ధమైన ఒప్పందమని.. రాణా వంటి కుట్రదారులకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చినందుకు బదులుగా అతనికి మరణశిక్ష నుంచి తప్పించుకున్నాడని ఆ వర్గాలు వివరించాయి. ముంబై దాడులలో తన పాత్ర, లష్కర్-ఎ-తోయిబా, పాకిస్తాన్ ISIతో సంబంధాల గురించి అతను అంగీకరించిన నేపథ్యంలో.. అమెరికా గూఢచారి సంస్థలకు అతను కీలకంగా మారాడు.

ఎఫ్‌బిఐ కోసం గతంలో పనిచేసిన హెడ్లీ
హెడ్లీని భారతదేశానికి అప్పగించడం వల్ల తమ దేశ గూఢచార కార్యకలాపాలు, ప్రస్తుత విచారణలకు అడ్డంకులు ఏర్పడతాయని అమెరికా భావిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎఫ్‌బిఐ వంటి అమెరికన్ గూఢచారి సంస్థలతో అతనికి సంబంధాలు ఉన్నాయి. అతను గతంలో వాటికి రహస్య సమాచారం చేరవేస్తూ సీక్రెట్ ఇన్‌ఫార్మర్ గా పనిచేశాడని ఆ వర్గాలు వెల్లడించాయి. అలాగే ముంబై దాడి సమాచారం ముందుగానే అమెరికా గూఢచారి సంస్థల దృష్టికి వచ్చిందని, కానీ దానిని నివారించడానికి అమెరికా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోలేదని కొన్ని లీక్ అయిన డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హెడ్లీని అప్పగించడం వల్ల అమెరికా సమాచార సేకరణ పద్ధతులు, ఉగ్రవాది-ఇన్‌ఫార్మర్‌గా హెడ్లీ వ్యవహారం బహిర్గతం కావచ్చని పేర్కొన్నారు. ముందస్తు ఒప్పందం ప్రకారం అతనికి మరణశిక్ష విధించకూడదు. కానీ అజ్మల్ కసబ్ వంటి ఉగ్రవాదుల విషయంలో కఠిన వైఖరి అనుసరించిన భారత్ ఈ షరతును అంగీకరించలేదని గూఢచారి వర్గాలు తెలిపాయి. ఇవన్నీ హెడ్లీ అప్పగింతకు అడ్డంకులుగా మారాయి.


Also Read: రేప్ కేసులో యువతిదే తప్పు.. హై కోర్టు సంచలన తీర్పు

భారత దేశంలో ఉగ్రదాడులకు రెక్కీ చేసిన హెడ్లీ
రాణా ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్న సమయంలో అతనికి హెడ్లీ పరిచయమయ్యాడు. ముంబై ఉగ్రదాడికి (Mumbai Terror Attack) ముందు పాకిస్తానీ-అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీతో (David Headley) రాణా సంబంధం కలిగి ఉండేవాడని భారత విచారణ ఏజెన్సీ అయిన ఎన్ఐఏ తెలిపింది. 26/11 దాడికి ముందు 8 సార్లు హెడ్లీ భారతదేశానికి వచ్చాడని.. ఆ సమయంలో 231 సార్లు రాణాతో సంప్రదింపులు జరిపాడని తెలిపింది. దాడులకు ముందు 2006, సెప్టెంబర్ 14న హెడ్లీ మొదటిసారి భారతదేశానికి వచ్చి రిక్కీ నిర్వహించాడని.. అప్పుడు 32 సార్లు రాణాతో మాట్లాడినట్లు పేర్కొంది. హెడ్లీ భారతదేశానికి వచ్చినప్పుడల్లా.. ఒకసారి 23 సార్లు, మరోసారి 40 సార్లు, మరొకసారి 66 సార్లు.. ఇలా అనేకసార్లు మాట్లాడినట్లు తెలిపింది. దాడులకు సంబంధించిన ప్రాంతాల ఎంపికలో హెడ్లీకి రాణా ఎలా సహాయం చేశాడో ఎన్ఐఏ డాక్యుమెంట్లు స్పష్టంగా వివరించాయి.

ఉగ్రవాదికి జైలులో బిర్యానీలు పెట్టి పోషించకూడదు.. డిమాండ్ చేస్తున్న నెటిజన్లు

26/11 ముంబై దాడుల ప్రధాన కుట్రదారుడు తహవుర్ రాణాను () భారత జైలులో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తూ.. బిర్యానీలు పెట్టి పోషించకూడదని, అతడిని ఉరితీయాలని దేశ ప్రజలు సోషల్ మీడియా వేదికల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

తహవ్వుర్ రాణాను ఉరితీయాలి
వారిలో 2008లో ముంబై ఉగ్రవాద దాడుల నుండి అనేక మంది ప్రాణాలను కాపాడిన స్థానిక టీ విక్రేత ‘చోటు చాయ్ వాలా’ అలియాస్ మహ్మద్ తౌఫిక్ కూడా ఉన్నారు. ఉగ్రవాదులను అంతం చేయాలంటే దేశంలో కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అజ్మల్ కసబ్‌కు ఇచ్చినట్లుగా తహవ్వుర్ రాణాకు ప్రత్యేక సెల్ లేదా, బిర్యానీ, ఇతర సౌకర్యాలు అందించాల్సిన అవసరం లేదన్నారు.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×