Betting Apps Promotion : బెట్టింగ్ యాప్స్ కేసు (Betting Apps Case)లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పలువురు సెలబ్రిటీలు ఈ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల నుంచి మొదలు పెడితే రానా దగ్గుబాటి (Rana Daggubati), విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) లాంటి స్టార్స్ పేర్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండడం తీవ్ర దుమారం రేపింది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలపై ఈ కేసులో విచారణ జరుగుతుండగా, పోలీసులు ఈ బెట్టింగ్ యాప్ కేసులో ఓ మాస్టర్ ప్లాన్ వేశారనే సమాచారం బయటకు వచ్చింది. బెట్టింగ్ యాప్స్ ఓనర్స్ పై కేసు నమోదు చేసి, ఇప్పటిదాకా ఈ యాప్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీ లను విట్నెస్ లుగా మార్చే యోచనలో పోలీసులు ఉన్నట్టు సమాచారం.
ఇక ఇప్పటికే 25 మంది సెలబ్రిటీ లపై కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు, 19 మంది బెట్టింగ్ యాప్స్ ఓనర్స్ పై కేసు ఫైల్ చేసినట్టు సమాచారం. బెట్టింగ్ యాప్స్ యజమానులనే ఈ కేసులో కీలక నిందితులుగా చేర్చబోతున్నారు పోలీసులు. ఈ కేసులో సెలబ్రిటీలను సాక్షులుగా మార్చి, యువతగా ప్రాణాలను పణంగా పెట్టి బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్న యజమానులకు కఠిన శిక్ష పడేలా ప్లాన్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పోలీసులు తీసుకున్న ఈ కీలక నిర్ణయం సెలబ్రిటీలకు ఊరటనిచ్చే అవకాశం ఉంది.
ఈ సెలబ్రిటీలపైనే బెట్టింగ్ యాప్ కేసు
విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మీ, ప్రణీత, నిధి అగర్వాల్, వర్షిని సౌందరరాజన్, శ్రీముఖి, అనన్య నాగళ్ళ, వాసంతి కృష్ణన్, సిరి హనుమంతు, శోభా శెట్టి, అమృత చౌదరి, నేహా పఠాన్, నయని పావని, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, విష్ణు ప్రియ, హర్ష సాయి, శ్యామల, టేస్టీ తేజ, భయ్యా సన్నీ యాదవ్, రీతు చౌదరి బండారు సుప్రీతలపై బెట్టింగ్ యాప్ కేసు నమోదయ్యింది.
విచాణకు హాజరైంది ముగ్గురే
ఇదిలా కేసులు నమోదు అంటూ వస్తున్న వార్తలపై పలువురు సెలబ్రిటీలు స్పందించారు. ప్రముఖ సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తనకు పోలీస్ శాఖ నుంచి దీనికి సంబంధించి ఎలాంటి నోటీసు రాలేదని స్పష్టం చేశారు. అలాగే 2016లో ఇలాంటి ప్రమోషన్ ఒకటి చేశానని, కానీ అది తప్పని తెలిసిన కొన్ని నెలల్లోనే రద్దు చేసుకున్నానని క్లారిటీ ఇచ్చారు.
అలాగే విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన వీడియోలు వైరల్ అవుతుండగా, వాళ్ళు కేవలం స్కిల్ బెస్ట్ గేమ్స్ కు మాత్రమే ప్రచారం చేశారని ఈ హీరోల పీఆర్ఓ టీమ్స్ ప్రకటించాయి. మరోవైపు యాంకర్లు విష్ణు ప్రియ, రీతూ చౌదరిలపై విచారణ మొదలైంది. ఇప్పటికే వీరిద్దరూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఇప్పటి వరకు కేసులు నమోదైన సెలబ్రిటీలలో విష్ణు ప్రియా, రీతు చౌదరి, టేస్టీ తేజ మాత్రమే విచారణకు హాజరవ్వడం గమనార్హం.
బెట్టింగ్ యాప్స్ కేసులో బిగ్ ట్విస్ట్..!
19 మంది బెట్టింగ్ యాప్స్ ఓనర్లపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం
బెట్టింగ్ యాప్స్ యజమానులనే కీలక నిందితులుగా చేర్చనున్న పోలీసులు
ఈ కేసులో సెలబ్రిటీలను సాక్ష్యులుగా చేర్చే యోచనలో పోలీసులు
ఇప్పటికే 25 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు… pic.twitter.com/QtWE61ZPnR
— BIG TV Breaking News (@bigtvtelugu) March 24, 2025