E-Paper
Advertisement

Telangana BJP: తెలంగాణ బీజేపీలో కుమ్ములాటలు

Telangana BJP: తెలంగాణ బీజేపీలో కుమ్ములాటలు

Telangana BJP:  తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నిర్వహించిన మహాధర్నా మరో పంచాయితీని తెచ్చిపెట్టిందా? ప్రజా పోరాటాల కన్నా, ఇన్ సైడ్ పోరాటాలకే నేతలు ప్రాధాన్యతనిస్తున్నారా? పార్టీలో రామ చందర్ రావుతో ఎలాంటి విభేదాలు లేవంటూనే వేదికపై మాటల మంటలను నేతలు ఎందుకు రాజేశారు? ఫార్మాట్ మార్చాలంటారు కొందరు.. అంతా బాగుందంటూనే అసలు మొఖమే ఎందుకు చూపించడం లేదు.. ? అసలు బీజేపీ నేతలకు ఏమైంది?

తగ్గేదేలే అంటున్న కమలనాథులు

తెలంగాణ బీజేపీలో కుమ్ములాటలు, అసమ్మతికి ఎండ్‌ కార్డ్ పడటం లేదు. స్థానిక సీనియర్ నేతలు సర్ధి చెప్పినా.. జాతీయ నేతలు నేరుగా వచ్చి స్పెషల్‌ క్లాస్‌లు తీసుకున్నా.. అస్సలు తగ్గేదేలే అంటున్నారు కమలనాథులు. దీంతో పార్టీ వివాదాలకు కేరాఫ్‌గా మారుతోంది. ఇన్నాళ్లు అంతర్గతంగా ఎప్పుడూ.. బహిర్గతంగా అప్పుడప్పుడు వివాదాలు కొనసాగేవి కమలనాథుల మధ్య. కానీ ఇప్పుడు ఇందిరాపార్క్‌ వేదికగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ధర్నాలోనే ఫేస్ టు ఫేస్ కౌంటర్లు వేసుకున్నారు కాషాయ పార్టీ నేతలు.

మహాధర్నా.. కీలక నేతలు గైర్హాజరు

మున్సిపాలిటీల విలీనం, భూముల బదాలాయింపు హిల్ట్ పాలసీకి వ్యతిరేఖంగా మహధర్నా అన్నారు.. కానీ ధర్నా సమయానికి రూటు మారింది. రూటు మారిన సరే, మహాధర్నాకు కీలక నేతలు ఎందుకు గైర్హాజరు అయినట్టు అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. పార్టీ చేపట్టిన మహాధర్నా పోగ్రాం కంటే ఆ నేతలకు అంతకన్న పెద్ద ముఖ్యమైన విషయాలు ఏంటనేది అర్థం కాని విషయం. అసలు బీఎల్ సంతోష్ ట్రీట్‌మెంట్ నేతలకు సరిపోలేదా? నేతల మద్య విభేదాలంటూ తప్పుడు రాతలు రాయొద్దంటూ రామచందర్ రావు కామేంట్లు దేనికి సంకేతాలు? అందరు రావాలనే మహధర్నా కార్యక్రమాన్ని ఆదివారం ఏర్పాటు చేసినా కూడా కీలక ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు దూరంగా ఉన్నట్టు? లోకల్లోనే ఉండి ఈటల రాజేందర్ ధర్నా మొహం కూడా ఎందుకు చూడలేదు? కార్యక్రమం ఉందని తెలిసి కూడా ధర్మపురి ఢిల్లీలోనే ఎందుకు మకాం వేశారు? ఇక్కడ ధర్నా ప్రారంభం అవుతున్న సమయానికే ఢిల్లీలో ఆయన మీడియా సమావేశం ఎందుకు పెట్టారు? ఇలా అన్ని ప్రశ్నలే. అంతేకాదు బండి సంజయ్, రఘునందన్ రావు, గూడెం నగేష్‌ మొహాలు ఎందుకు కనిపించలేదు అనేది ఇప్పుడు బేతాళ ప్రశ్నలుగా మారాయి.

రామచందర్ రావు అద్యక్షత్వంలో మహాధర్నా

రామచందర్ రావు అద్యక్షుడయ్యాక మొదటి అతిపెద్ద కార్యక్రమం ఈ మహాధర్నా. అంతేకాదు రాష్ట్ర నూతన అధ్యక్ష వర్గం ఎన్నికతో పాటు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఎల్ సంతోష్ రాష్ట్రానికి తొలిసారి రావడం, నేతలకు దిశానిర్దేశం చేసిన తర్వాత జరిగిన తొలి మహాధర్నా ఇది. జీహెచ్ఎంసీ పరిధిలో వున్న 8 జిల్లాల నుంచి జన సమీకరణ చేయాలనుకున్న బీజేపీ, ఆశించిన స్థాయిలో ప్రజలు రాకపోవడం, ప్రజలే కాదు, సొంత పార్టీ కీలక నేతలే డుమ్మా కొట్టడం ఇప్పుడు ఆ పార్టీలో చర్చానీయాంశంగా మారింది. ఇంతపెద్ద ధర్నాకు పార్టీ పిలుపునిస్తే, జన సమీకరణలో విఫలం, కీలక నేతలు డుమ్మకొట్టడం, బీఎల్ సంతోష్ వచ్చి నేతలకు పెన్ను పేపర్ ఇచ్చి స్పష్టంగా రూట్ మ్యాప్ ఇచ్చినా, మా రూట్ మ్యాప్ మాకుంది, బీఎల్ సంతోష్ ఎవరు..? రామచందర్ రావు ఎవరు.. ? అన్న మూడ్ లోనే నేతలంతా ఉన్నట్టుగా ఈ మహాధర్నా కనిపించింది. ఇదంతా అటుంచితే.. తమ మీద వార్తలు రాయించడం కాదు.. లోకల్‌లో ఉండి బండి సంజయ్ ఈ ధర్నాకు ఎందుకు దూరంగా ఉన్నారో వార్తలు రాయించే దమ్ము ఉందా అంటూ అర్వింద్, ఈటల, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు వర్గాలు ప్రశ్నిస్తున్నాయట.

ధర్నా వేదికగా రామచందర్ రావు టార్గెట్

ధర్నా వేదికగా పైడి రాకేష్ రెడ్డి పార్టీ చీఫ్‌ రామచందర్ రావును టార్గెట్‌ ఎందుకు చేశారనేది మరో కొత్త టాపిక్‌గా మారింది. ఫార్మాట్ చేంజ్ చేసుకోవాలని వార్నింగ్ ఇచ్చారా..? సూచన చేశారా..? 50,50 వన్డే మ్యాచ్ పనికి రాదని, ఆది ఔట్ డేటెడ్ గేమ్ అని, రామ చందర్ రావు 20, 20 ఫార్మాట్ లోకి రావాలని, లేకపోతే అధికారం కలగానే మిగిలిపోతుందన్నారు ఆయన. ఈ వ్యాఖ్యలు పైడినే మాట్లాడారా? లేక అర్వింద్ నూరి పోసి పైడి రాకేష్ రెడ్డిని పంపించారా అన్న టాక్ ఆ పార్టీలో నడుస్తోంది. పాత నేతలను దృష్టిలో పెట్టుకొని పైడి రాకేష్ రెడ్డితో అర్వింద్ ఇలాంటి వాఖ్యలు చేయించారనే టాక్ సైతం నడుస్తోంది. ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే పాత నేతలని.. ట్వింటి ట్వింటీ నేతలు అంటే కొత్త నేతలను.. పాత వారిని కాస్త పక్కన పెట్టి.. కొత్త నేతలతో ముందుకు వెళితే పార్టీ గెలుస్తుందనే సంకేతాన్ని ఇవ్వాలని చూశారనే టాక్ నడుస్తోంది. అసలు సంస్థాగతంగా మాట్లాడాల్సిన అంశాలు.. ఇలా బహిరంగంగా.. అందరూ ఉన్న వేదికపై మాట్లాడటం.. అది కూడా నేరుగా అధ్యక్షుడిని టార్గెట్ చేయడం చూస్తుంటే అంతర్గత పోరు పీక్స్‌కు చేరినట్టు క్లియర్‌కట్‌గా తెలుస్తోంది. అంతేకాదు అర్వింద్, ఈటల రాజేందర్, కొండా, రఘునందన్, ఏలేటి, వెంకటరమణ రెడ్డి, పైడి రాకేష్, పాయల్‌ శంకర్‌ల వ్యవహారం ఇప్పుడు చాలా మంది నేతలకు నచ్చడం లేదనే టాక్ వినిపిస్తోంది.

రాష్ట్ర బీజేపీ నేతల్లో గందరగోళం

అంతేకాదు హిల్ట్‌ భూముల పంచాయితీ రాష్ట్ర బీజేపీ తలపెట్టిన మహాధర్నా రూపు రేఖలే మార్చేశాయట. ముందుగా మున్సిపాలిటీల విలీనo, హిల్ట్‌ పాలసీపై మాత్రమే మహాధర్నా ఉంటుందని రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. కానీ తీర ఆ పార్టీలో మెజారిటీ నేతలు ఈ మహాధర్నాను వ్యతిరేకించడంతో యూ టర్న్ తీసుకొని అప్పటికప్పుడే ప్రభుత్వ ఆరు గ్యారెంటీలపై ప్రజావంచన పేరుతో ధర్నాను సాగించారు. నగరం నడిబొడ్డున ఉన్న పారిశ్రామిక వాడలను నగర అవతలకు తరలిస్తే తప్పేంటని కొంతమంది ఎంపీలు, ఎమ్యెల్ల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారట. కమలం పార్టీలో హిల్ట్‌ పాలసీని వ్యతిరేకిస్తున్నవారు కొందరైతే, సమర్థించేవారు మరికొందరు ఉండటంతో రాష్ట్ర నాయకత్వం తలలు పట్టుకుంటుందట. హిల్ట్‌లో మతలబ్ అర్థం కాకా ఉన్నపలంగా అధికార పార్టీ రెండేళ్ల ప్రజా పాలన విజయోత్సవాలను నిర్వహిస్తున్న సందర్భంలో దానికి దీటుగా ప్రజావంచన పేరుతో మహాధర్నా, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అంటూ ఇందిరాపార్క్ వేదికగా ప్రకటన చేయడం వెనక బీజేపీ ఉద్దేశం ఎంటో అర్థం కాక పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారట.

కీలక నేతలు విమర్శలు

మున్సిపాలిటీల విలీనం అన్నారు, HILT పాలసీపై అవినీతి అన్నారు, 8 జిల్లాల జనసమీకరణ అన్నారు, వాటి మీదే మహాధర్నా అన్నారు.. చివరకు ఆరు గ్యారెంటీలపై ధర్నా చేయడం మున్సిపాలిటీల విలీనం, HILT పాలసీలపై బీజేపీ వెనకడుగు వేసిందా అనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అంతేకాదు పారిశ్రామిక వాడల్లో పెద్ద మొత్తంలో బీజేపీలో కొంత మంది ఎంపీలకు, ఎమ్మెల్సీలకు భూలున్నాయయనే టాక్ పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది. అందులో భాగంగానే హిల్ట్‌పై కొంతమంది కీలక నేతలు మౌనం వహిస్తున్నారట. మరికొంత మంది నేతలు వ్యతిరేకిస్తున్నారట. ఇంకొంత మంది సమర్థిస్తున్నారట. హిల్ట్‌పై ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కిషన్ రెడ్డి, డీకే అరుణలు మాత్రమే విమర్శలు చేస్తున్నారు. మిగతా మెజారిటీ నేతలు స్పందించడం లేదనే టాక్ ఉంది.

మొత్తo మీద హిల్ట్‌ పాలసీ రాష్ట్ర బీజేపీలో మరొ కొత్త పంచాయతీని తెచ్చిపెట్టిందన్న చర్చ జరుగుతుంది. ప్రభుత్వo తీసుకొన్చిన పాలసీ ఎఫెక్ట్ రాష్ట్ర బీజేపీలో రిఫ్లెక్ట్ అవుతున్న పరిస్థితుల నుంచి ఆ పార్టీ నేతలు ఏ విధంగా బయటపడతారో చూడాలి.

Story By Anup, Big Tv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×