Male Baldness Solution: బట్టతలతో బాధపడే పురుషులకు శాశ్వత పరిష్కారం దొరికేసింది. ఈ మేరకు ఐర్లాండ్ కు చెందిన కాస్మో ఫార్మాస్యూటికల్స్ పరిశోధకులు ప్రకటించారు. యుఎస్, యూరప్ లో 1,465 మంది బాధితుల నిర్వహించిన ట్రయల్స్ లో ఈ విషయం తేలిందన్నారు. బట్టతల చికిత్సలో అద్భుతమైన బ్రేక్ త్రూ సాధించినట్లు వెల్లడించారు.
ఐర్లాండ్‌కు చెందిన కాస్మో ఫార్మాస్యూటికల్స్ శాస్త్రవేత్తలు, రీసెర్చ్ టీమ్ పురుషుల బట్టతల మీద జుట్టు మొలిపించేలా కొత్త ట్రీట్మెంట్ డెవలప్ చేశారు. ఇందుకోసం క్లాస్కోటెరోన్ 5% టాపికల్ సొల్యూషన్ ను రూపొందించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు నిర్వహించిన రెండు పెద్ద క్లినికల్ ట్రయల్స్ తో పాటు ఫేజ్-IIIలోనూ అద్భుతమైన ఫలితాలు వచ్చినట్లు వెల్లడించారు. గత 30 ఏళ్లలో ఎన్నో ట్రీట్మెంట్స్ రాగా, ఇది కొత్త మెకానిజమ్‌తో పని చేసే చికిత్స అన్నారు. DHT (డైహైడ్రోటెస్టోస్టెరోన్) హార్మోన్ ను స్కాల్ప్ లోనే బ్లాక్ చేసి, సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు
⦿ అధ్యయనాలు: 1,465 మంది పురుషులు (18-55 ఏళ్లు) పాల్గొన్న డబుల్-బ్లైండ్, ప్లేసిబో-కంట్రోల్డ్ ట్రయల్స్ (6 నెలలు) సక్సెస్ అయ్యాయి.
⦿ ఎఫెక్టివ్‌నెస్:
Scalp 1: టార్గెట్ ఏరియా హెయిర్ కౌంట్ లో ప్లేసిబోతో పోలిస్తే 539% రెలటివ్ మెరుగుదల.. అంటే, జుట్టు హైర్ కౌంట్ 5.39 రెట్లు ఎక్కువ పెరిగింది.
Scalp 2: 168% రెలటివ్ మెరుగుదల కనిపించింది.
మొత్తం: 60-70% మందిలో మెరుగైన జుట్టు డెన్సిటీ, రీగ్రోత్ కనిపించింది.
⦿ సేఫ్టీ: ప్లేసిబోతో సమానమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. తక్కువ రెడ్ నెస్, ఇట్చింగ్, సెక్సువల్ డిస్‌ఫంక్షన్ లేదు. ఎందుకంటే ఇది టాపికల్, స్కాల్ప్ లోనే పని చేస్తుంది.
⦿ ఎలా పని చేస్తుంది?: డైహైడ్రోటెస్టోస్టెరోన్(DHT)ను హెయిర్ ఫొలికల్స్ లోనే బ్లాక్ చేసి, హెయిర్ ఫాల్ ఆపి, గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది. సిస్టమిక్ అబ్సార్ప్షన్ తక్కువ.
⦿ ఎలా వాడాలి?: రోజుకు రెండుసార్లు స్కాల్ప్ కు అప్లై చేయాలి. (స్ప్రే లేదంటే సొల్యూషన్ ఫార్మ్)
⦿ ఫలితాలు ఎన్ని రోజుల్లో?: ఫలితాలు కనిపించడానికి 3-6 నెలలు పడుతుంది. 12 నెలల సేఫ్టీ స్టడీ పూర్తి అయిన తర్వాత జుట్టు పెరుగుతుంది.
⦿ ట్రీట్మెంట్ కాస్ట్ ఎంత?: అధికారికంగా ఈ చికిత్సకు సంబంధించి ధర ఇంకా ప్రకటించలేదు.
Read Also: పాపం, పాతికేళ్లు నిండినా ‘బోణి’ కొట్టని మగాళ్లు.. కారణాలు ఇవేనట, వామ్మో!
⦿ అప్రూవల్: 2026 12 నెలల సేఫ్టీ ఫాలో అప్ పూర్తి తర్వాత FDA (US), EMA (EU)కు అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటారు. అప్రూవల్ వచ్చిన తర్వాత.. 2027లో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.
⦿ భారత్ లో: CDSCO అప్రూవల్ కోసం 1-2 సంవత్సరాలు పట్టవచ్చు; ఇంపోర్ట్ ఆప్షన్, జెనరిక్ వెర్షన్ రావచ్చు.
మొత్తంగా ప్రస్తుతం ఉన్న చికిత్సల కంటే మెరుగ్గా పని చేస్తుందని సైంటిస్టులు ప్రకటించారు. పూర్తి వివరాలు 2026లో అందుబాటులోకి రానున్నాయి.
Read Also: ఆవిరి పట్టించిన మొలకలు Vs పచ్చి మొలకలు, పోషకాల పరంగా ఏవి బెస్ట్ ?