E-Paper
Advertisement

పసిడి ప్రేమికులకు పండగే.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే!

పసిడి ప్రేమికులకు పండగే.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే!
Advertisement

Gold Silver Rates: వావ్.. నిన్నమొన్నటి వరకు ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పసిడి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాల వల్ల దేశీయంగా బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతేకాకుండా అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు స్వల్పంగా నెమ్మదించడంతో, సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు కాకుండా ఇన్వెస్టర్లు ఇతర మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో పసిడి ధరలు మరింత తగ్గుతున్నాయి. నేటి పసిడి ధరలు చూసుకుంటే..

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,660 ఉండగా.. నేడు మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,49,840 వద్ద పలుకుతుంది. అలాగే సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,100 కాగా.. నేడు మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,350 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.820 తగ్గింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,49,840 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,350 వద్ద కొనసాగుతుంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,49,840 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,350 వద్ద ఉంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,49,840 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,350 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,49,990 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,37,500 వద్ద ఉంది.

నేటి సిల్వర్ ధరలు..
బంగారంతో పాటే వెండి కూడా తన జోరును తగ్గించుకుంది. నిన్నమొన్నటి వరకు శాంతంగా ఉన్న సిల్వర్ ధరలు నేడు భారీగా తగ్గాయి. అయితే సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,60,000 వద్ద ఉండగా.. నేడు మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,55,000 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు కేజీ సిల్వర్ పై రూ. 5.000 తగ్గింది.. అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో నేడు కేజీ సిల్వర్ పై రూ. 2,50,000 వద్ద పలుకుతోంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ ధరల తగ్గింపు కొనుగోలుదారులకు గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల ఈ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉన్నందున, కొనుగోలు చేయాలనుకునే వారు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. ఈ ధరల తగ్గింపు కేవలం తాత్కాలికమేనా లేక మరిన్ని రోజులు కొనసాగుతుందా అన్నది వేచి చూడాలి.

Also Read: ఆఫ్రికన్ నమూనాతో.. దేశంలో ఎల్‌పీజీ సమస్యకు చెక్.. ఇది ఎలా పనిచేస్తుందంటే?

Related News

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

Big Stories

Advertisement
×