E-Paper
Advertisement

ఆ నలుగురు… ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు..! ప్రభుత్వ పతనంపై రాహుల్‌ శపథం..! ఆ నలుగురు టార్గెట్‌గా ఢిల్లీ ఆందోళన..

ఆ నలుగురు… ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు..! ప్రభుత్వ పతనంపై రాహుల్‌ శపథం..! ఆ నలుగురు టార్గెట్‌గా ఢిల్లీ ఆందోళన..
Advertisement

ఇండీ కూటమి ఢిల్లీ ఆందోళనలు దేశాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి. నీట్‌ పరీక్ష పత్రం లీక్‌పై జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోచ్‌ పార్టీ చేపట్టిన ఆందోళనను మించి యావత్‌ దేశం ఇప్పుడు ఢిల్లీ వైపు చూస్తున్నది. ప్రియాంక గాంధీ కూడా రాహుల్‌ గాంధీకి తోడుగా నిలవడంతో ఉద్యమం మరింత ఉధృత రూపం దాల్చుతున్నది.

పోలీసులు బలవంతంగా అడ్డుకోవడం, అరెస్టు చేసే క్రమంలో తోపులాటలు.. తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. అయినా ఏమాత్రం తగ్గడం లేదు కాంగ్రెస్‌ నేతలు, ఇండీ కూటమి నాయకులు.

Advertisement

ప్రియాంక గాంధీ కింద పడుకుని మరీ పోరాడుతున్న దృశ్యాలను టీవీల్లో జనం చూస్తూ నివ్వెరపోయారు. కేంద్రం వైఖరిపై జనం దుమ్మెత్తిపోస్తున్నారు. కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాపై పట్టు పెరుగుతూ వస్తోంది. కేంద్రం పంతానికి పోతూ ఉంది. కయ్యానికి కాలు దువ్విన చందంగానే కేంద్రం తీరు ఉండటంతో ఆందోళన మరింత ఉధృతం దిశగా సాగుతోంది.

కేంద్ర ఎన్నికల కార్యాలయానికి, చీఫ్‌ కమిషనర్‌కు భద్రత పెంచడం పరోక్షంగా ప్రతిపక్షాల ఆందోళనలపై కారం చల్లినట్టే చేస్తుందనే కేంద్ర సంకేతాలతో అగ్నికి ఆజ్యం పోసినట్టే అవుతోంది. అయితే .. మూడు రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు, ఉద్రిక్తతల నడుమ రాహుల్ తన గళాన్ని మరింత పదునుగా వినిపిస్తున్నారు.

Advertisement

ఆయన తాజాగా తీసుకున్న నినాదం, చేసిన శపథం వైరల్‌గా మారుతోంది. దేశ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు ఆ నలుగురు కుట్ర పన్నుతున్నారని ప్రధానంగా నలుగురినే టార్గెట్ చేస్తూ రాహుల్‌ కొత్త నినాదం అందుకున్న వైనం చర్చకు వస్తోంది. మోడీ, అమిత్‌ షాను మొన్నటి వరకు టార్గెట్ చేస్తూ వస్తున్నారు రాహుల్‌ గాంధీ.  ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మహేశ్‌ భాగవత్‌ను కూడా వదలడం లేదు.  ఇప్పుడు తాజాగా సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ కూడా తోడయ్యారు.

ఇద్దరు పోయి.. ముగ్గురు. ఆ ముగ్గురికి సమానంగా మరొకరు. ఆయనే కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌. అందుకే వీరి నలుగురిని ఒక్క గాటనే కట్టారు రాహుల్‌. ఈ నలుగురు కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్న రాహుల్‌.. ఢిల్లీ ఆందోళనల వేదికగా.. దేశ ప్రజలనుద్దేశించి ఆయన చేసిన కామెంట్స్‌ తీవ్ర చర్చను లేవనెత్తుతున్నాయి.

‘మీరే చూస్తారు. వీరికి శిక్ష తప్పదు. నాది హామీ… తప్పక వీరికి శిక్షలు పడతాయి..!’ అంటూ పరోక్షంగా ప్రభుత్వ పతనంపై ఢిల్లీ వేదికగా శపథం చేశారు రాహుల్. కేంద్ర ఎన్నికల వ్యవస్థనే భ్రష్టు పట్టించి, జనం  ఓటు హక్కును కాలరాసి..ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నారనే విషయాన్ని దేశ ప్రజలకు తెలియజేయడంలో ఇండీ కూటమి సక్సెస్‌ అవుతోంది. దీనికి తగిన మూల్యం చెల్లించేలా చేసేందుకే ఈ ఆందోళనను ఉధృతం చేయడంతో సక్సెస్ కూడా అవుతోంది.

మొన్నటి వరకు ముగ్గురే టార్గెట్. ఇప్పుడు ఈ ముగ్గురు సరసన.. జ్ఞానేశ్‌ను కూడా చేర్చారంటే.. ఎస్‌ఐఆర్‌లో అతని జోక్యం, లోపాయికారి తప్పిదాలు ఎంతటి ప్రమాదకరమైనవో తెలియజేయడం రాహుల్‌ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే ఆ నలుగురు అంటూ ఆయన కొత్త నినాదం అందుకున్నారు. మొదట తక్షణ కర్తవ్యంగా జ్ఞానేశ్‌ కుమార్‌ను రాజీనామా చేయించడం ద్వారా ఎన్డీయే సర్కార్‌ కోరలు పీకినట్టేనని భావిస్తోంది ఇండీ కూటమి.

సర్కార్‌కు ఇంకా మూడేండ్లు కూడా నిండకముందే ఇంతటి వ్యతిరేకత రావడం,ఈ స్థాయి ఆందోళనలతో హస్తినా అట్టుడికిపోవడం.. ప్రభుత్వ పతనానికి దారి తీయడం ఖాయమనే సంకేతాలను జనానికి చేరవేయడం కూడా కూటమి వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది.

Tags

Related News

జీహెచ్ఎంసీలో జీఐఎస్ సర్వేకు బ్రేక్.. ఆ రూ. 22 కోట్లు ఏమైనట్టు?

దేశవ్యాప్తంగా బీజేపీ ‘సేవా దూత్’ ప్రచారం.. చేయబోయే కార్యక్రమాలివే?

కాంగ్రెస్‌ పెంచిన పింఛన్లపై విమర్శలు! పాతవి తొలగించి కొత్తవి ఇచ్చారని ప్రచారం..! కేసీఆర్‌ వస్తే 4వేలు ఇచ్చేవారని కామెంట్స్‌..!

పెనం మీద నుంచి పొయ్యిలోకి నిజామాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌! నేతల తీరుతో అధిష్టానానికి తలవంపులు..! మాజీ మంత్రి కామెంట్స్‌తో తీవ్ర చర్చ

జెన్‌జీని తక్కువ అంచనా వేశా! జంతర్‌ మంతర్‌ తరువాత వారి శక్తిని కళ్లారా చూసినా..! నేతలెవరూ వారితో పెట్టుకోవద్దని తెలుసుకున్నా!

నా పాలనకు వందకు 60 మార్కులు.. రెండేళ్లలో మరిన్ని మార్కులు సాధిస్తానని నమ్మకం ఉంది..! సంక్షేమ పథకాలపై చర్చోపచర్చలు!

మాటకు మాట.. సీఎం సభ తరువాత ఆ ఇద్దరూ స్పందిస్తున్న వైనం..! కలిసి తిప్పికొట్టే వ్యూహంతో ముందుకు..!

బీఆరెస్‌కు గతమే.. భవిష్యత్‌ లేదు..! కేసీఆర్‌కు ప్రాణం పోస్తే బానిసత్వాన్ని కొని తెచ్చుకున్నట్టే..! రేవంత్‌ వాదనలతో కొత్త చర్చ..!

Big Stories

Advertisement
×