Ramayana Movie: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల ఇళ్లపై, ఆఫీసులపై ఐటి దాడులు జరగడం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె భర్త జాకీ భగ్నానీ తో పాటు మరికొన్ని నిర్మాణ సంస్థల ఆఫీసులపై ఐటీ సోదాలు జరిగినట్లు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. తాను ఎవరి ఆస్తులకు బినామీగా లేను అని, తనకు 20 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచే పన్ను కడుతున్నాను అని, తనపై ఐటి రైట్స్ అంటూ వచ్చినవన్నీ కేవలం ఆరోపణలు , పుకార్లు మాత్రమే అంటూ ఖండించింది.
అయితే ఇప్పుడు మరోసారి ఐటీ రైడ్స్ బాలీవుడ్ లో కలకలం సృష్టిస్తున్నాయి . సుమారు 4 వేల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణ మూవీ నిర్మాత నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటి దాడులు జరుగుతున్నాయి అంటూ వస్తున్న ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా రూపొందుతున్న మైథాలాజికల్ ఎపిక్ ఫిలిం రామాయణ. ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యశ్, మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ , శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కీలకపాత్రను పోషిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ బ్యానర్ పై సుమారుగా 4000 కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని నమ్మిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రైమ్ ఫోకస్ సంస్థ అధినేత నమిత్ మల్హోత్రా కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ముంబైలోని నమిత్ మల్హోత్రా నివాసంతో పాటు సంస్థ కార్యాలయాల్లో కూడా ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారట. ఇందులో భాగంగానే నమిత్ మల్హోత్రా కి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్లు, ఫైనాన్షియల్ అడ్వైజర్ల ఆఫీసులను కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఇకపోతే ఈ సమాచారం బయటకు రావడంతో నమిత్ మల్హోత్రాకు చెందిన విజువల్ ఎఫెక్ట్స్ అండ్ మీడియా కంపెనీ ప్రైమ్ ఫోకస్ షేర్ విలువపై అధిక ఒత్తిడి పెరిగిపోయిందని తెలుస్తోంది. మార్కెట్ ప్రారంభంలోనే ఈ సంస్థ షేరు ధర సుమారుగా 8% వరకు క్షీణించిందట. ముఖ్యంగా ఈ క్షీణత నిర్మాతలను మరింత కలవరపెడుతున్నట్లు సమాచారం.
ALSO READ: బిగ్ బాస్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీజన్ 10!
మరొకవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జెడ్ స్పీడ్ లో జరుగుతున్న ఈ భారీ విజువల్ వండర్ రామాయణ పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా దీపావళి సందర్భంగా 2026 నవంబర్ 6వ తేదీన ఘనంగా విడుదల కానుంది. రెండవ భాగాన్ని వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా విడుదల చేయబోతున్నారు. ఏది ఏమైనా 4వేల కోట్ల బడ్జెట్తో రెండు భాగాలుగా రాబోతున్న ఈ రామాయణ మూవీ నిర్మాత ఆఫీసులపై ఇప్పుడు ఇలా ఐటీ దాడులు నిర్వహించడం కలకలం రేపుతోంది.