E-Paper
Advertisement

ఎలాన్ మస్క్ సంచలన పోస్ట్.. స్టార్‌లింక్ రాకపై భారత్‌లో మళ్లీ చెలరేగిన వివాదం!

ఎలాన్ మస్క్ సంచలన పోస్ట్.. స్టార్‌లింక్ రాకపై భారత్‌లో మళ్లీ చెలరేగిన వివాదం!
Advertisement

Starlink India: భారత్‌లో స్టార్‌లింక్ ఎంట్రీ పై జాప్యం ఎందుకువుతోంది.? ఈ పాయింట్‌ పై సంచలన కామెంట్స్‌ చేశారు. ఎలాన్‌ మస్క్‌ కొంతమంది తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడానికి స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఐతే మస్క్‌ వ్యాఖ్యలను కేంద్రం తీవ్రంగా ఖండించింది. భారత్‌లో స్టార్‌లింక్ కమర్షియల్ సర్వీసులు ప్రారంభం కాకపోవడంపై ఎలాన్ మస్క్ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది ఒలిగార్కులు తమ గుత్తాధిపత్యాన్ని కొనసాగించేందుకు స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

మస్క్ విసిరిన బాణం..

భారత టెలికాం రంగంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ వంటి దిగ్గజ సంస్థలు కూడా శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలోకి వస్తున్నాయి. ఇక స్టార్‌లింక్‌తో పాటు జియో, వన్‌వెబ్ కూడా భారత మార్కెట్‌లో సేవలు అందించేందుకు ముందుకొస్తున్నాయి. స్టార్‌లింక్‌కు జియో, ఎయిర్‌టెల్‌తో పార్టనర్‌షిప్ కూడా ఉంది. మరి గుత్తాధిపత్యం అంటూ మస్క్ విసిరిన బాణం ఎవరిపైన అనేచర్చ జరుగుతోంది. మస్క్‌ తన పోస్టులో ఎవరి పేర్లను నేరుగా ప్రస్తావించలేదు.

ఒకే రెగ్యులేటరీ దశ..

Advertisement

మస్క్ ఆరోపణలకు కేంద్రం వెంటనే కౌంటర్ ఇచ్చింది. భారత్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్‌కు సంబంధించిన రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ న్యాయంగా, వివక్ష లేకుండా ఉందని టెలికమ్యూనికేషన్స్ శాఖ స్పష్టం చేసింది. స్టార్‌లింక్‌ను ప్రత్యేకంగా టార్గెట్ చేయడం లేదని లైసెన్స్ పొందిన మూడు సంస్థలకూ సెక్యూరిటీ అసెస్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతోందని ప్రభుత్వం తెలిపింది. అన్ని సంస్థలూ ప్రస్తుతం దాదాపు ఒకే రెగ్యులేటరీ దశలో ఉన్నాయని స్పష్టం చేసింది.

Also read: సీఎం రేవంత్ నిర్ణయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల విమర్శలు.. అసలేం జరిగిందంటే?

భారత్‌లో ఇప్పటికే..

Advertisement

స్టార్‌లింక్‌కు భారత్‌లో ఇప్పటికే కీలక అనుమతులు లభించాయి. కానీ కమర్షియల్ సర్వీసులు ప్రారంభించాలంటే ఇంకా సెక్యూరిటీ క్లియరెన్స్, స్పెక్ట్రమ్ అసైన్‌మెంట్ వంటి ప్రక్రియలు పూర్తి కావాల్సి ఉంది. భారత భద్రతా నిబంధనలకు అనుగుణంగా తమ ఆపరేషన్స్‌ను డిజైన్ చేశామని, భారతీయ యూజర్ల డేటాను దేశంలోనే ఉంచేలా ఏర్పాట్లు చేశామన్నారు మస్క్‌.. భారత్‌లో ఇప్పటికే 20 గేట్‌వే సైట్లు, వందలాది యాంటెనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు.

ఎందుకు వచ్చింది?

సెక్యూరిటీ క్లియరెన్స్‌. స్పెక్ట్రమ్‌ అసైన్‌ మెంట్‌ వల్లే లేటఖ్‌ అన్నది టెలికామ్‌ వెర్షన్‌. మరి గుత్తాపతిధ్యం అన్న మాట మస్క్‌ నుంచి ఎందుకు దూసుకు వచ్చింది?తదుపరి పరిపరిణామాలు ఎలా ఉండబోతాయి? రెగ్యులేటరీ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది? స్టార్‌లింక్ ఎప్పుడు భారతీయులకు అందుబాటులోకి వస్తుందనే అంశాలు చర్చగా మారాయిప్పుడు.

Also read: హైదరాబాద్‌వాసులూ జాగ్రత్త.. రోడ్డుపై చెత్త వేస్తే కెమెరా కన్ను మీపైనే!

Tags

Related News

ఆ నలుగురు… ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు..! ప్రభుత్వ పతనంపై రాహుల్‌ శపథం..! ఆ నలుగురు టార్గెట్‌గా ఢిల్లీ ఆందోళన..

తెలంగాణ సచివాలయంలో సెకండ్ ఫ్లోర్ మిస్టరీ.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?

సీఎం రేవంత్ నిర్ణయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల విమర్శలు.. అసలేం జరిగిందంటే?

ఇదేం విచిత్రం వరికే అగ్రతాంబూలమా.. ఆ పంటలపై వ్యవసాయ పరిశోధకులు శీతకన్ను..?

సర్‌పై ఢిల్లీ దద్దరిల్లుతున్న వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిపక్షాల్లో నిస్తేజం..! బీఆరెస్‌ సైలెంట్‌ మోడ్‌.. వైసీపీ గప్‌చుప్‌..!

కేటీఆర్ ఆస్తుల చిట్టాలో రేవంత్ హిట్టు .. కేసీఆర్ అక్రమాస్తుల అంశంలో దొరకని పట్టు!

సీఈసీ వైఖరిపై దుమారం..! సర్‌ విధానంతో కేంద్రం బద్నాం..! ఓ వైపు ఢిల్లీ దద్దరిల్లుతుంటే కీర్తిబావుటాలేలా..?

Big Stories

Advertisement
×