భయపడటం లేదంటూనే బామ్మర్దులిద్దరూ సీఎం రేవంత్‌రెడ్డి ధాటికి జంకుతున్నారు. సిరిసిల్ల గడ్డ మీద సీఎం సభ పెట్టిన తరువాత కేటీఆర్ బాగనే డిస్టర్బ్ అయ్యాడు.
హోటళ్లు సంపాదించుకున్నాడని రేవంత్‌రెడ్డి ఆ వేదికగా ప్రకటించి.. ‘ఇది అబద్దమని తేలితే నా పేరు మార్చుకుంటాన’ని ప్రకటించడం కలకలం రేపింది. దీంతో కేటీఆర్‌కు దీనిపై సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అనివార్య పరిస్థితులను తెచ్చిపెట్టినట్టయ్యింది. ‘అవును.. మూడు హోటళ్లు నావే.. ఒకటిని మూడు చేశా! పది చేయాల్సి ఉండే.. రాజకీయాల్లోకి వచ్చి లాస్ ఐన!’ అంటూ రేవంత్ వ్యూహంలో చిక్కుకుని విలవిలలాడాడు. మరింత కూరుకుపోయాడు.
దీనిపై ప్రజల్లో కూడా కేటీఆర్ అక్రమ సంపాదనపై చర్చకు దారి తీసినట్టయ్యింది. రేవంత్ అన్నట్టుగానే ‘నీ గడ్డమీదకే వస్తున్నా.. నీ సంగతి తేలుస్తా..!’ అని దాన్ని ఇలా రచ్చ రచ్చ చేసి వదిలేశాడు. అంతే కాదు ‘సిద్దిపేటకు కూడా వస్తున్నా.. హరీశ్ కాస్కో..!’ అని కూడా ముందుగా ఓ హింట్ ఇచ్చి వదలేశాడు రేవంత్.
నిన్న సిద్దిపేటలో హరీశ్ ఓ పెద్ద బహిరంగ సభను పెట్టాడు. కొత్త జిల్లాలు ఏర్పాటయి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దశాబ్ది సంబురాలు పేరిట అంతటా వేడుకలు చేసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చాడు. కానీ ఎక్కడా పెద్ద హంగామా లేదు.. కానీ సిద్దిపేటలో భారీ బహిరంగ సభ పెట్టి తన బలప్రదర్శనను సర్కార్‌ను చూపాలనుకున్నాడు హరీశ్. అచ్చంగా అదే చేశాడు.
అంతే కాదు.. ‘రేపు సీఎం వచ్చి నాపై తుక్కు తుక్కు ఆరోపణలు చేస్తాడు.. మీరు నమ్మొద్దు’ అన్నట్టే సాగాయి ఆయన మాటలు. ఇప్పటికే రెండు సార్లు సిద్దిపేటకు వచ్చిన డేట్లతో సహా అక్కడి జనాలకు గుర్తు చేసి .. ‘సీఎం ఇక్కడికి వచ్చి రుణమాఫీ చేస్తానన్నాడు.. చేయలేదు. మరోసారి వచ్చి రైతు బంధు ఇస్తానన్నాడు. ఇయ్యలేదు..’ అని రేవంత్ రెడ్డి పట్ల అక్కడి జనంలో వ్యతిరేకతను నూరిపోసే ప్రయత్నం చేశాడు.
అంతే కాదు.. తన గురించి తనే చాలా చాలా గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశాడాయన. అచ్చంగా అది ఎన్నికల సభలా తయారు చేశాడు హరీశ్. తను ఇక్కడి జనం కోసం నిరంతరం ఎంతగా ఆలోచిస్తాడో.. ఇక్కడి అభివృద్ధి కోసం ఎంతగా కట్టుబడి ఉన్నాడో ఉదాహరణలతో సహా చెప్పి.. వారి మనసులో తన స్థానం పదిలమని, ఎవరొచ్చి ఏం చెప్పినా.. మీరు నావైపే ఉండాలని, నన్నే ఆశీర్వదించాలనే విధంగా హరీశ్ ప్రసంగం కొనసాగింది.
మొత్తంగా ఇది జిల్లాల ఏర్పాటు సంబురంలా కాకుండా హరీశ్ తనకు తాను సిద్దిపేట ప్రజల మనిషినని చెప్పుకునేందుకు, సీఎం వచ్చి తిట్టినా పెద్దగా మీరు పట్టించుకోవద్దనే అభ్యర్థనకు వేదికగా మారినట్టుగానే అనిపించింది.