E-Paper
Advertisement

బొద్దింకలతో కలిసి మోడీకి బుద్ది చెప్పేందుకు! కాక్రోచ్‌ పార్టీ వేదికగా యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి ప్రకాశ్ రాజ్‌.. అంతిమ లక్ష్యం కేంద్రం మెడలు వంచడం..!

బొద్దింకలతో కలిసి మోడీకి బుద్ది చెప్పేందుకు! కాక్రోచ్‌ పార్టీ వేదికగా యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి ప్రకాశ్ రాజ్‌.. అంతిమ లక్ష్యం కేంద్రం మెడలు వంచడం..!
Advertisement

విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌.. కాక్రోచ్‌ పార్టీ నేతలతో కలిసిపోయాడు. రాజకీయ పార్టీలకు దూరంగా ఉండే ఆయన మనస్తత్వం ఈ బొద్దింకలతో కలిసిపోయినట్టుంది. అందుకే వారు ఏ పిలుపునిచ్చినా అక్కడ టంచన్‌గా హాజరవుతున్నాడు.

దేశంలోని ఏ రాష్ట్ర రాజకీయాల్లోనైనా వేలు పెట్టి వివాదాలు తెచ్చుకునే ఏకైక నేత,నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ఒక్కడే. పలు భాషలపై పట్టు ఉండటంతో పాటు.. రాజకీయాలపై తనకున్న అవగాహన మేరకు అధికార పక్షం నేతలను సూటిగా ప్రశ్నించడం, నిలదీయడం ఆయనకు అలవాటు. జస్ట్‌ ఆస్కింగ్‌ అంటూ ఆష్‌ట్యాగ్‌ను జోడించి ప్రశ్నిస్తూ వార్తల్లో కేంద్రంగా మారడం పరిపాటి. ఒక్క ప్రశ్నకు వేల తిట్లు, విమర్శలు ఎదుర్కోవడం కూడా అతనికి సహజమే.

Advertisement

నటనారంగంలో అతనిది ప్రత్యేక శైలి. అదో లోకం. రాజకీయంగా  మరోలోకం. దీనికి దానికి లింకు పెట్టాలనుకోడు. కానీ పెట్టేస్తారు. తిట్టేస్తారు. గెంటేస్తారు. అవకాశాలు ఇవ్వం పో అని బెదిరిస్తారు. నీది ఏ రాష్ట్రం రా..! అని తిట్టిపోస్తారు. అయినా డోంట్‌ కేర్‌ అంటాడు ప్రకాశ్‌. చిరంజీవిని నటనా పరంగా ప్రేమిస్తాడు. అతని తమ్ముడిని రాజకీయంగా విబేధిస్తాడు. సిద్దాంతపరంగా ఎంతటి వారితోనైనా ఢీ కొట్టేందుకు రెడీ అవుతాడు.

ప్రధానంగా మోడీ అనుకూల బ్యాచంటే ఒళ్లంతా కాక్రోచులు పారినంతగా చికాకు పడతాడు. మోడీ యాంటీ గ్రూపంటే.. రాసుకు పూసుకు తిరగడమే కాదు.. వారిని డిఫెన్స్‌ నుంచి రక్షించేందుకు తనో రక్షణ కవచంలా నిలబడతాడు. తగుదునమ్మా అంటూ వచ్చి వాలుతాడు సోషల్‌ మీడియాలో. మాటల దాడి మొదలుపెడతాడు. విమర్శల అస్త్రాలు సంధిస్తాడు.

Advertisement

మొన్న జంతర్‌ మంతర్ వద్ద ధర్మేంద్ర ప్రధాన్‌ను రాజీనామా చేయించేదాకా వదలని బొద్దింకల బ్యాచుతో కలిసే నడిచాడు. వారితో అతుక్కుపోయాడు. ఇప్పటి దాకా. ఇప్పుడు తాజాగా సీఈసీ వివాదంలో కూడా బొద్దింకలతో కలిసి కదనరంగంలో జంతర్‌మంతర్‌ 2.0 కోసం రెడీ అయిపోయాడు. దీనికి ముహూర్తం కూడా ఫిక్స్‌ చేసుకున్నారు. ఇక రంగంలోకి దిగడమే మిగిలుంది.

ఈ నేపథ్యంలో అంతా అతనిపై చర్చించుకుంటున్నారు. ఈ పార్టీ ద్వారా రాజకీయంగా యాక్టివ్‌ కావడం, ఆ తరువాత పోటీ చేయడం.. గెలవడం.. అలా తన పొలిటికల్‌ ఫ్యూచర్‌ కోసమే ఇదంతా చేస్తున్నాడా? అనే ఊహాగానాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. 2019 లో బెంగుళూరు సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 28,900 ఓట్లు మాత్రమే సాధించి.. సమీప బీజేపీ అభ్యర్థి చేతిలో ఘోర పరాభవాన్ని చవి చూశాడు.

ఆ తరువాత ఆయన రాజకీయాలను వదల్లేదు. అడపాదడపా అన్ని పార్టీల విషయాల్లో జోక్యం చేసుకుంటూ వస్తున్నాడు. ప్రధానంగా బీజేపీ, దాని కూటమి పార్టీలను మాత్రం వదలడు. ఆడేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ప్రకాశ్‌ రాజ్‌ ముందు కాక్రోచుల లక్ష్యమే ఉంది. కేంద్రం మెడలు వంచడం.. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ను రాజీనామా చేసేదాకా వదలకపోవడం. దీని కోసం తన విలువైన సమయాన్ని కూడా వదులుకొని తనదైన రాజకీయం చేయడం ప్రకాశ్‌ రాజ్‌ స్టైల్. ఇప్పుడైతే అతను కాక్రోచ్‌ ప్రకాశ్‌గా పాత్ర పోషిస్తున్నాడు. కాదు జీవించాలనుకుంటున్నాడు.

Tags

Related News

రీల్స్ కోసం రోడ్డుపై బైక్‌తో స్టంట్స్.. కుర్రాళ్లకు దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన పోలీసులు!

AI డీప్‌ఫేక్‌లపై కేంద్రం సంచలన నిర్ణయం.. నెల రోజుల్లో రానున్న కొత్త రూల్స్?

ఒబామాకే ఇచ్చారు.. నాకెందుకివ్వరు.. నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు!

ఉపాధి హామీ పనుల్లో సంచలన రికార్డ్.. గత ఐదేళ్లలో ఇదే టాప్ హజరు శాతం

ఆ నలుగురు… ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు..! ప్రభుత్వ పతనంపై రాహుల్‌ శపథం..! ఆ నలుగురు టార్గెట్‌గా ఢిల్లీ ఆందోళన..

ఎలాన్ మస్క్ సంచలన పోస్ట్.. స్టార్‌లింక్ రాకపై భారత్‌లో మళ్లీ చెలరేగిన వివాదం!

తెలంగాణ సచివాలయంలో సెకండ్ ఫ్లోర్ మిస్టరీ.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?

Big Stories

Advertisement
×