E-Paper
Advertisement

కెనడా రచయిత్రి ఆన్ కార్సన్‌కు సాహిత్యంలో నోబెల్ పురస్కారం

కెనడా రచయిత్రి ఆన్ కార్సన్‌కు సాహిత్యంలో నోబెల్ పురస్కారం
Advertisement

Anne Carson Nobel Prize: కెనడాకు చెందిన ప్రముఖ కవయిత్రి, వ్యాసకర్త ఆన్ కార్సన్‌‌‌కు 2026 సంవత్సరానికి నోబెల్ బహుమతి లభించింది. వినూతన, సాహసోపేతమైన సాహిత్య రచనలకు గాను ఆమెకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ఈ విషయాన్ని స్వీడిష్ అకాడమి గురువారం అధికారికంగా ప్రకటించింది. 76 ఏళ్ల కార్సన్.. సాంప్రదాయ సాహిత్యంలో ఆధునిక సాహిత్యానికి కొత్తదనం అద్దడమే కాదు.. అన్ని తరాలను మెప్పిస్తూ.. ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నారు.

కార్సన్ 1950లో కెనడాలోని టొరంటోలో జన్మించారు. 2022 నుంచి ఐస్‌ల్యాండ్‌లో నివసిస్తున్నారు. ఆమె రచనల్లో ప్రాచీన గ్రీకు, రోమన్ సాహిత్య ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రాచీన గ్రీకు సాహిత్యాన్ని అనువదించడంలోనూ కార్సన్‌ నేర్పరి. కార్సన్ ఆమెకంటూ ప్రత్యేక రచనా శైలిని అలవరచుకున్నారు. కవిత్వం, నవల, పరిశోధనాత్మక రచనల సరిహద్దులను చెరిపేస్తూ ఆమె చేసిన సృజనాత్మక రచనలకు గాను ఈ గౌరవం దక్కింది. నోబెల్ సాహిత్య బహుమతితో కార్సెన్‌‌‌కు 1.2 మిలియన్ డాలర్లు (భారత ప్రస్తుత కరెన్సీ ప్రకారం రూ.11.6 కోట్లు) లభిస్తాయి. ఆమె ముఖ్యమైన రచనలలో ది గ్లాస్ ఎస్సే, ఆటోబయోగ్రఫీ ఆఫ్ రెడ్: ఎ నోవెల్ ఇన్ వర్స్, నాక్స్, ఫ్లోట్ మరియు ది బ్యూటీ ఆఫ్ ది హస్బెండ్: ఎ ఫిక్షనల్ ఎస్సే ఇన్ 29 టాంగోస్ ప్రముఖమైనవి.

Advertisement

Also Read: ఒబామాకే ఇచ్చారు.. నాకెందుకివ్వరు.. నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు!

2019లో నార్మా జీన్ బేకర్ ఆఫ్ ట్రాయ్ నాటక ద్వారా విభిన్న కాలాలకు చెందిన ప్రముఖ అందగత్తెలైన హెలెన్ ఆఫ్ ట్రాయ్, మెర్లిన్ మన్రోల జీవితాల మధ్య ఉన్న పోలికలను ఆమె చూపించారు. గ్రీకు రచయిత యురిపిడీస్ రాసిన ప్రాచీన కథను ఆధారంగా చేసుకుని 2021లో ది ట్రోజన్ విమెన్ – ఎ కామిక్ అనే ఒక కామిక్ పుస్తకాన్ని రాశారు. గ్రీకు రచయిత సొఫోక్లీస్ రాసిన ‘ఎలెక్ట్రా’ నాటకాన్ని ఆమె ఇంగ్లీషులోకి అనువదించారు. ఈ అనువాదం ఆధారంగా లండన్‌లో నిర్వహించిన నాటకంలో ప్రముఖ హాలీవుడ్ నటి బ్రీ లార్సన్ ప్రధాన పాత్ర పోషించారు.

Tags

Related News

చమురు బాంబు పేల్చిన ట్రంప్.. పతనమైన స్టాక్‌మార్కెట్లు, ఇంతకీ ట్రంప్ ఏమన్నారు?

అమెరికా చదువులు ఖరీదు బాబోయ్.. విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ ఝలక్, ఇకపై రూ. 67 లక్షలు

చేప వలలతో పాకీ సైన్యం సరికొత్త ప్రయోగం.. నవ్వుతున్న జనం

కెప్టెన్ స్మిత్ పుర్రెకు శస్త్రచికిత్స.. విజయవంతంగా నిర్వహించిన సౌదీ వైద్యులు!

ఆ 5000 మంది ఏమైపోయారు? ఇక వెతకలేక చేతులెత్తేసిన నేపాల్!

ఫ్లైదుబాయ్ కో-పైలట్.. విచారణలో కీలక విషయాలు, షాకైన అధికారులు

కూలిన సైనిక విమానం.. 32 మంది మృతి, నైజీరియాలో ఘటన

Big Stories

Advertisement
×