E-Paper
Advertisement

Trump Iran war: ట్రంప్ మైండ్ గేమ్.. ఇరాన్ విషయంలో సడన్ నిర్ణయం వెనుక అసలు గుట్టు ఇదే!

Trump Iran war: ట్రంప్ మైండ్ గేమ్.. ఇరాన్ విషయంలో సడన్ నిర్ణయం వెనుక అసలు గుట్టు ఇదే!
Advertisement

Trump Iran war: అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గురించి తెలిసిందేగా! ఏదీ ఓ పట్టాన ఒప్పుకోడు. ముఖ్యంగా.. యుద్ధంలో అమెరికా ఓడిందంటే అస్సలు ఒప్పుకోడు. అందుకే.. అందరికంటే ముందే తామే గెలిచేశామని స్టేట్‌మెంట్లు పాస్ చేస్తుంటారు. ఇప్పుడు.. ఇరాన్ విషయంలోనూ ప్రెసిడెంట్ ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహాలు ఎవ్వరికీ అర్థం కావట్లేదు. నిన్నటిదాకా భీకరంగా యుద్ధం చేసిన అమెరికా.. సడన్‌గా కొత్త టర్న్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. బ్లైండ్‌గా ఎక్కడపడితే అక్కడ దాడి చేయడం కంటే.. మైండ్ గేమ్‌తో ఇరాన్‌ని కొట్టాలని చూస్తున్నాడు ట్రంప్. ఇరాన్‌పై సైనిక చర్యలను క్రమంగా తగ్గిస్తామంటూ ట్రంప్ చేసిన ప్రకటన.. అంతర్జాతీయంగా పెద్ద చర్చకే దారితీసింది. అయితే, కాల్పుల విరమణకు మాత్రం తాను సిద్ధంగా లేనని చెబుతున్నారు.

ఇరాన్ యుద్ధంలో ట్రంప్ యూటర్న్

ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై భారీ వైమానిక దాడులు మొదలుపెట్టినప్పుడు.. ట్రంప్ టార్గెట్ క్లియర్‌గానే ఉంది. ఇరాన్ అణు సామర్థ్యాన్ని, సైనిక శక్తిని నాశనం చేయడం, అక్కడ కొత్త ప్రభుత్వం కొలువుదీరేలా ప్రేరేపించడం అమెరికా పెట్టుకున్న లక్ష్యాలు. కానీ, 3 వారాల యుద్ధం తర్వాత యుద్ధభూమిలో సీన్ మరోలా ఉంది. వార్ ఎపిసోడ్ అంతా అమెరికా డామినేషన్ కంటిన్యూ అవుతుందనుకుంటే.. ఇరాన్ కూడా ఇచ్చిపడేస్తోంది. దాంతో.. యుద్ధం విషయంలో అమెరికా లెక్కే కాదు, ట్రంప్ మాట కూడా మారింది. తాము అనుకున్న లక్ష్యాలను దాదాపుగా చేరుకున్నామని, అందుకే సైనిక చర్యలను తగ్గించే ఆలోచన చేస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. ఇది, ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీసే మైండ్ గేమ్ అని కొందరంటుంటే, ట్రంప్ ఇరాన్‌ని ఏమీ చేయలేక, గన్ డౌన్ చేస్తున్నారనేది ఇంకొందరి వాదన. ఇరాన్‌ని గట్టిగా దెబ్బతీశాం, వారి రక్షణ సామర్థ్యాలను, మౌలిక వసతులను నాశనం చేశాం, ఇక యుద్ధం అవసరం లేదనే సంకేతాన్ని ప్రపంచానికి పంపిస్తున్నారు.

ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

యుద్ధ జ్వాలలతో పశ్చిమాసియాలో రగిలిపోతోంది. దీనిపై.. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో ట్రంప్ చేసిన ప్రకటన కీలకంగా మారింది. ఇరాన్‌పై సాధించిన సైనిక విజయాలను వివరిస్తూ.. ట్రూత్‌ సోషల్‌‌లో ట్రంప్‌ ఓ పోస్ట్ పెట్టారు. ఇరాన్‌పై తమ లక్ష్యాలను చేరుకునేందుకు చాలా దగ్గరగా ఉన్నామన్నారు. అమెరికా సైనిక చర్యను ముగించే విషయంపై ఆలోచిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు, ఇరాన్ మిసైల్ కెపాసిటీని, ఎయిర్ ఫోర్స్, నేవీ వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఆ దేశం మరోసారి అణ్వాయుధాలని తయారుచేయకుండా అమెరికా చూసుకుంటుందన్నారు. అలాంటి పరిస్థితి మళ్లీ వస్తే.. తగినవిధంగా స్పందిస్తామని హెచ్చరించారు.

గల్ఫ్ దేశాలకు ట్రంప్ సందేశం

ఇక, పశ్చిమాసియాలో తన మిత్ర దేశాలైన ఇజ్రాయెల్‌, సౌదీ అరేబియా, ఖతార్‌, యూఏఈ, బహ్రెయిన్‌, కువైట్‌కు అత్యున్నత స్థాయిలో రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. హర్మూజ్ జలసంధి గురించి కూడా ట్రంప్ కీలక ప్రకటన చేశారు. దీనిపై ఆధారపడిన దేశాలు, నౌకల సురక్షిత ప్రయాణానికి బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికా రక్షణ కల్పించదని స్పష్టం చేశారు. ఒకవేళ తమ సాయం కోరితే.. సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇరాన్ ముప్పు తొలగిన తర్వాత ఆ అవసరం ఉండదన్నారు.

ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేత

Advertisement

యుద్ధం కొనసాగుతున్న వేళ.. ఇంధన సరఫరాపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయ్. ఈ క్రమంలో ట్రంప్ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ దేశ చమురు అమ్మకాలకు 30 రోజుల మినహాయింపునిచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు సప్లైని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ తాత్కాలిక చర్యతో 14 కోట్ల బ్యారెళ్ల ఇరాన్‌ చమురు ప్రపంచ మార్కెట్లలోకి వస్తుంది. ఇప్పటికే సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్‌ చమురు విక్రయించడానికి మాత్రమే ఈ అనుమతులు వర్తిస్తాయని స్పష్టం చేశారు. అయితే, అమెరికా మినహాయింపులపై ఇరాన్‌ స్పందించింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేసేందుకు తమ దగ్గర అదనపు ముడి చమురు లేదందిత. చమురు సప్లైపై.. ఆందోళనలు తగ్గించేందుకే యూఎస్‌ ఇలాంటి ప్రకటన చేసిందని తెలిపింది. ఇవన్నీ చూస్తుంటే, ట్రంప్ నెమ్మదిగా యుద్ధం నుంచి సైడ్ అయిపోవాలనే ఆలోచనతో ఉన్నట్లు కనిపిస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్.

గల్ఫ్‌పై దాడులు… అమెరికాపై ఒత్తిడి పెరిగిందా?

యుద్ధం విషయంలో.. ట్రంప్ ఆలచోన మారడానికి మెయిన్ రీజన్.. ఇరాన్ ఇచ్చిన షాకులే. అమెరికా-ఇజ్రాయెల్ కేవలం ఇరాన్‌పై మాత్రమే దాడి చేశాయ్. కానీ, ఇరాన్ అలా కాదు, గల్ఫ్‌లో ఉన్న అమెరికా మిత్ర దేశాలు, మిలిటరీ స్థావరాలు, చమురు కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలను టార్గెట్ చేసింది. ఇది గల్ఫ్ దేశాల్లో భయాందోళనలు పెంచింది. అమెరికా స్థావరాలు ఉండటం వల్లే తమపై దాడులు జరుగుతుండటంతో.. గల్ఫ్ దేశాలు ట్రంప్‌పై ఒత్తిడి పెంచాయనే ప్రచారం జరుగుతోంది. ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసేయడంతో.. ముడి చమురు సప్లై చైన్ దెబ్బతింది. ఇది, భారత్ లాంటి అనేక దేశాలపై ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితికి అమెరికానే కారణమనే చర్చ జరుగుతోంది. యుద్ధం ఇలాగే కొనసాగిస్తే.. అమెరికాపై ప్రపంచ దేశాల్లో వ్యతిరేకత పెరుగుతుంది. అగ్రరాజ్యం ప్రతిష్ఠ కూడా దెబ్బతింటుంది. ఇప్పటికే, అమెరికా స్వార్థం వల్లే ప్రపంచం ఈ స్థితికి వచ్చిందని చైనా, యూరప్ దేశాలు విమర్శించడం మొదలుపెట్టాయి. దీని నుంచి బయటపడేందుకే.. ట్రంప్ నెమ్మదిగా శాంతి మంత్రం జపిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయ్.

విజయం ప్రకటించిన ట్రంప్

ట్రంప్ ఇప్పటికే యుద్ధంలో తాము విజయం సాధించామని చెబుతున్నారు. సైనికపరంగా ఇరాన్‌లో కీలక ప్రదేశాలను నాశనం చేసినప్పటికీ, అది సంపూర్ణ విజయం కాదు. ఎందుకంటే, యుద్ధం ఇంకా ముగియలేదు. యుద్ధంలో.. అమెరికాదే పైచేయి అయి ఉండొచ్చు. కానీ, ఇరాన్ మాత్రం ఇంకా పోరాడుతోంది. అమెరికాకు గట్టి సవాల్ విసురుతూనే ఉంది. వాస్తవానికి.. అమెరికా అనుకున్నట్లుగా, ఇరాన్‌లో ప్రభుత్వం మారితే విజయం సాధించినట్లు. లేనిపక్షంలో.. ట్రంప్ చెప్పినదానికల్లా ఇరాన్ తలూపితే.. క్లియర్ విక్టరీ దక్కినట్లు. కానీ, ఇరాన్‌లో అలాంటిదేమీ లేదు. ప్రభుత్వం మారలేదు. ట్రంప్ మాట వినలేదు. అలాగని, యుద్ధం ఆపట్లేదు.. అమెరికాకు సరెండర్ కావట్లేదు. ఇరాన్ ఇంకా గట్టిగా నిలబడి పోరాడుతూనే ఉంది. అలాంటప్పుడు.. అమెరికా విజయం సాధించిందనే ట్రంప్ మాటలు గొప్పలుగానే మిగిలిపోతున్నాయ్ తప్ప.. అది వాస్తవమని ఎవరూ ఒప్పుకోవట్లేదు.

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వ్యాఖ్యలు

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ విడుదల చేసిన ప్రకటన కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని చంపేస్తే.. ఇరాన్‌లో ప్రభుత్వాన్ని కూలదోయొచ్చన్న భ్రమతో.. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి దిగాయన్నారు. రెండు రోజుల్లోనే ఇరాన్ ప్రజలు ప్రభుత్వాన్ని పడగొడతారని లెక్కలేసుకున్నట్లు తెలిపారు. కానీ, జాతి ఐక్యతను తక్కువగా అంచనా వేశారన్నారు. దాంతో.. దిక్కుతోచని స్థితిలో.. అమెరికా, ఇజ్రాయెల్ అసంబద్ధ ప్రకటనలు చేస్తున్నాయన్నారు. యుద్ధం మొదలై 3 వారాలు గడిచినా, ఇరాన్ పూర్తిగా లొంగిపోలేదు. ట్రంప్ చెబుతున్నట్లు.. ఇరాన్ రక్షణ వ్యవస్థలు కొంత వరకు దెబ్బతిన్నా, ఇరాన్ ఇంకా నిశ్శబ్దంగా లేదు.

చమురు ప్రెజర్‌తో అమెరికా వెనుకడుగు?

ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్నది కేవలం బాంబుల యుద్ధం మాత్రమే కాదు. చమురు, ఆర్థిక వ్యవస్థల మధ్య యుద్ధంగా మారింది. దాంతో.. గల్ఫ్ దేశాల నుంచి, ప్రపంచ దేశాల నుంచి అమెరికాపై ప్రెజర్ పెరుగుతోంది. ఇంధన సరఫరా ఆగిపోతే.. ప్రపంచం స్తంభించిపోతుందనే విషయంలో ట్రంప్‌కు తెలుస్తోంది. అందుకే, చాలా తెలివిగా యుద్ధం నుంచి తప్పుకునేందుకు ప్లాన్ చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయ్. వీలైనంత త్వరగా.. యుద్ధాన్ని ముగించే ఆలోచనలో ఉంది అమెరికా. అంతిమంగా తామే విజయం సాధించామని, ఇరాన్‌ని కోలుకోలేని దెబ్బతీశామని.. ట్రంప్ తనకు తానే ప్రకటించుకొని త్వరలోనే.. ఈ భీకర యుద్ధానికి ముగింపు పలుకుతారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్.

Also Read: అప్పుల ఊబి నుంచి గట్టెక్కేలా.. రేవంత్ రెడ్డి సరికొత్త ప్లాన్ ఇదే!

Story by: Anup, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×