E-Paper
Advertisement

Niharika Konidela: నిహారిక నిర్మాణంలో పవన్ కళ్యాణ్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన మెగా డాటర్!

Niharika Konidela: నిహారిక నిర్మాణంలో పవన్ కళ్యాణ్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన మెగా డాటర్!
Advertisement

Niharika Konidela: నిహారిక కొనిదెల ప్రస్తుతం టాలీవుడ్‌లో నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నంలో ఉంది. ఆమె నిర్మించిన కమిటీ కుర్రోలు సినిమా మంచి విజయం సాధించి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన అందుకుంది. ఈ విజయంతో నిహారిక మరింత జాగ్రత్తగా కథలను ఎంపిక చేసుకుంటూ కొత్త ప్రాజెక్టులపై పని చేస్తోంది.

ఇప్పుడు ఆమె నిర్మాతగా చేస్తున్న మరో సినిమా రకాసా. ఈ చిత్రంలో సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిహారిక పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ.. మీడియాతో మాట్లాడుతున్నారు.

Advertisement

ఇలాంటి ఒక ఇంటర్వ్యూలో ఆమె భవిష్యత్తు ప్రణాళికల గురించి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ముఖ్యంగా యాంకర్, ఆమె బాబాయ్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూశారా అని అడిగారు. అలాగే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్‌తో సినిమా నిర్మించే అవకాశం వస్తే తీసుకుంటారా అని కూడా ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ తో నిహారిక సినిమా..!

దీనికి నిహారిక సమాధానం ఇస్తూ.. ఇప్పుడే తాను ఆ స్థాయికి చేరలేదని చెప్పింది. ప్రస్తుతం చిన్న సినిమాలు చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నానని వివరించింది. పెద్ద ప్రాజెక్టులు తీసుకునే ముందు మరింత అనుభవం సంపాదించాలనుకుంటున్నానని తెలిపింది.

Advertisement

అయితే, తన కోరికను కూడా ఆమె బయటపెట్టింది. భవిష్యత్తులో అవకాశం వస్తే తప్పకుండా పవన్ కళ్యాణ్‌తో సినిమా నిర్మించాలని తనకు ఎంతో ఇష్టం అని చెప్పింది. అలాగే తన అన్న వరుణ్ తేజ్‌తో కూడా కలిసి పని చేయాలని ఉందని పేర్కొంది.

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి మాట్లాడిన నిహారిక, తాను ఇప్పటికే ఈ సినిమా చూసానని చెప్పింది. సినిమా చాలా బాగుందని ప్రశంసించింది. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే మంచి ఎనర్జీ ఈ చిత్రంలో ఉందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మరోపక్క మెగా అభిమానులు నిహారిక ఎప్పుడెప్పుడు బాబాయి పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తుందా.. ఎలాంటి సినిమా తీస్తుందో అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

మొత్తం పైన నిహారిక కొనిదెల నిర్మాతగా నెమ్మదిగా ఎదుగుతూ, భవిష్యత్తులో పెద్ద ప్రాజెక్టులకు సిద్ధమవుతున్నట్టు ఈ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఆసక్తికరంగా మారాయి.

ALSO READ: Harish Shankar: సినిమాలో నేను ఇచ్చిన మెసేజ్ కన్నా నాకు వచ్చిన మెసేజ్లు ఎక్కువ.. తన సినిమాపై తనే జోకు వేసుకున్న హరిష్ శంకర్..!

Related News

నోరు జారితే అంతే.. నెక్స్ట్ స్కిట్‌లో నో ఛాన్స్! జబర్దస్త్ సీక్రెట్ లీక్ చేసిన నటి సత్యశ్రీ

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

Big Stories

Advertisement
×