BigTV English

Trump Form Oreder: ట్రంప్ మరో సంచలనం.. 30 రోజులే గడువు!

Trump Form Oreder: ట్రంప్ మరో సంచలనం.. 30 రోజులే గడువు!

Trump Form Oreder: మేక్ అమెరికా హెల్తీ ఎగైన్ ఇదీ ట్రంప్ సర్కార్ చేస్తోన్న మరో సరికొత్త నినాదం. అందులో భాగంగా అమెరికా ఔషధ ధరలపై ట్రంప్ ఆదేశం జారీ అయ్యింది. ఇందులో అంతగా ఏముంది? అదసలు పని చేస్తుందా? ఆ వివరాలేంటి?


ఔషధ ధరలను తగ్గించేలా..

సంచలనాల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కొత్త వివాదానికి తెరలేపారు. ఔషధ ధరలను తగ్గించడమే ధ్యేయంగా ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. అయితే దీని వివరాలేంటి? వచ్చే రోజుల్లో ఈ ట్రంప్ ఆర్డర్ ప్రభావమేంటన్నది ఒక క్లారిటీ లేదంటున్నారు ఔషధ రంగ నిపుణులు. ఇతర దేశాల్లోని రోగులు మన ఔషధ ధరలకంటే తక్కువ చెల్లిస్తారని అంటారు. ఈ విషయం ప్రస్తావించిన ట్రంప్.. అమెరికాలోనూ డ్రగ్ కంపెనీలు తమ ధరలను తగ్గించేలా తాను ఆదేశిస్తానని చెప్పారాయన. తాను తీసుకున్న ఈ చర్యను అమెరికాలోనే అత్యంత పర్యవసాన కార్యనిర్వాహక ఆదేశాల్లో ఒకటిగా అభివర్ణించారు ట్రంప్. దీని ప్రభావంతో యూఎస్ ఫార్మా ధరలు 30 శాతం నుంచి 80 శాతం వరకూ వాటంతటవే తగ్గుతాయని ప్రకటించారు.


ఇదేమంత ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉండదు స్టాక్ మార్కెట్ నిపుణులు

అయితే ఫార్మా ఇండస్ట్రీ ఎక్స్ పర్ట్స్ మాత్రం ఎన్నో అనుమానాలను లేవనెత్తుతున్నారు. సరిగ్గా అదే సమయంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు.. ఇదేమంత ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉండదని అంటున్నారు. యూఎస్ లో సంక్లిష్టమైన ఆరోగ్య రక్షణ వ్యవస్థ ఉంది. పలు ప్రైవేటు బీమా కంపెనీల ద్వారా వృద్ధులు, పేదల కోసం ప్రభుత్వమే బీమా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. దీన్నే వీరు మెడికేర్ లేదా మెడికైడ్ అంటారు. ఇతర దేశాల్లో ఔషధాల ధరలు ఎక్కువగా ఉన్నాయంటే కొనుగోలు చేయడానికే నిరాకరిస్తారు. అదే ఇక్కడలా కాదు. ఎంత ధరలు ఎక్కువుంటే తమ ఆరోగ్యం అంత పదిలమని భావించవారున్నారు.

ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్‌తో పోలిక చేసిన US

2021లో యూఎస్ ప్రభుత్వ అకౌంటింగ్ ఆఫీస్.. ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్ తో పోలిక చేసి చూసింది. యూఎస్ ప్రిస్క్రిప్షన్ మందులు సగటున రెండు నుంచి నాలుగు రెట్లు ఖరీదైనవిగా తేలింది. దీంతో యూఎస్ లో రెండు ప్రధాన పార్టీలు ఒకరిపై మరొకరు రాజకీయ ఆరోపణలు చేసుకున్నారు. సోమవారం వెలువడ్డ వైట్ హౌస్ ప్రకటన సందర్భంగా.. ఆరోగ్య కార్యదర్శి రాబర్ట్ కెనడీ జూనియర్ ఈ దిశగా కొన్ని కీలక కామెంట్లు చేశారు. ట్రంప్ తన తొలి పదవీ కాలంలోనే మందుల ధరలు తక్కువ చేయాలని చూశారు. తర్వాతి అధ్యక్షుడైన జోబిడెన్ సైతం ఈ సమస్య పరిష్కరించే యత్నం చేశారు. ముఖ్యంగా ఇన్సులిన్ వంటి ప్రాణాలు రక్షించే ఔషధాల ధరలు, ఇతర ఔషధ ధరలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వాటి తగ్గుదలను ఎంత ప్రయత్నించినా సాధ్యం చేయలేక పోతోంది అమెరికన్ గవర్నమెంట్. అది ట్రంప్ దైనా జోబైడెన్ దైనా ఇదే తీరుగా నడుస్తోంది.

కాంగ్రెస్ సభ్యులకు ఫార్మా లాబీ పెద్ద ఎత్తున విరాళాలు

దీనంతటికీ ఒక కారణం లేక పోలేదు.. ఫార్మా లాబీలు.. కాంగ్రెస్ సభ్యులకు పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వడం వల్లే అమెరికా ఔషధ ధరలు ఆకాశంలో ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. ట్రంప్ కూడా ఔషధ లాబీ అతి బలమైన లాబీ అంటూ.. విలేఖరులతో అన్నారు కూడా. కానీ అమెరికా ఇకపై విదేశీ ఆరోగ్య సంరక్షణకు సబ్సిడీ ఇవ్వదనీ.. ఇదే తాము చేస్తున్న కీలకమైన యత్నమనీ అన్నారాయన. ఇది సెల్ఫ్ గోల్ లా ఉందని అంటారు కొందరు. కారణమేంటంటే ట్రంప్ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మందులపై పన్ను విధిస్తానని అన్నారు. ఇతర దేశాలను బెదిరించడానికే ఇలా చేస్తున్నారు. బాగానే ఉంది. కానీ ఇదే మరింత ఖర్చు పెంచే అవకాశముందని కూడా చెప్పాలంటారు ఫార్మా రంగ నిపుణులు.

ఇంతకీ ట్రంప్ ఆర్డర్ లో ఏముంది? ఖర్చులను తగ్గించడానికి గతంలో చేసిన యత్నాలకంటే ట్రంప్ ఆర్డర్ ఎందుకంత విస్తృతమైంది? ఆ వివరాలైతే ఇంకా తెలియ రాలేదు. విదేశాల్లో ఔషధ ధరలపై చేసే ఒప్పందాలు.. స్థానిక ఔషధ ధరలకూ పొంతన కుదరాలంటే ఏం చేయాలో కూడా ఒక క్లారిటీ లేదు. నిబంధనల ద్వారా ఖచ్చితంగా ఏం సాధించాల్సి ఉందో.. అదింకా అస్పష్టంగానే ఉందంటున్నారు అధికారులు. కొన్ని కొన్ని కొనుగోళ్లు విధిలేక చేసేవిగా ఉంటాయి. వీటికి ట్రంప్ ఎలాంటి సమాధానం చెబుతారో తేలాల్సి ఉందంటున్నారు వీరు.

ట్రంప్ ఆర్డర్ సాధ్యాసాధ్యాల మాటేమిటి? నిపుణులు ఏమంటున్నారు? ఫార్మా కంపెనీల వారు ఏం చెబుతున్నారు? సామాజిక వేత్తలు ఇందుకు సూచిస్తున్న పరిష్కార మార్గాలేంటి? అసలు.. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో ఔషధ ధరలు ఎందుకంత ఎక్కువగా ఉంటాయి? ఆ వివరాలేంటి? ఇప్పుడు చూద్దాం..

ఔషధ ప్రయోజన నిర్వాహకులను తొలగించాలి

అంతా అధ్యక్షుడిదే భారం అంటోన్న సామాజికవేత్తలుఒక ట్రంప్ ఆర్డర్ కి పరి పరివిధాల.. పలు రకాలుగా సలహా సూచనలు అందుతున్నాయి. ఔషధ కంపెనీలు వినియోగదారులకు నేరుగా మరిన్ని ఉత్పత్తులు విక్రయించాలని.. బీమా కంపెనీల ప్రభావం తగ్గించాలి, ఔషధ ప్రయోజన నిర్వాహకులను తొలగించాలని.. అంటారు. అంతే కాదు తక్కువ ధరలకు అమ్మే విదేశీ ఔషధాలను సైతం దిగుమతి చేసుకోవాలన్న సలహాలు కూడా అందుతున్నాయ్. ఈ ఆలోచన గతంలో భద్రత, వాణిజ్య నియమాల అడ్డంకులను ఎదుర్కుంది.

ఇది యూఎస్, HR, ఫార్మా మధ్య సయోధ్యకు నాంది-ఒక అధికారి

సోమవారం నాటి ఆర్డర్ యూఎస్, మానవ సేవల విభాగం, పరిశ్రమల మధ్య కుదిరిన సయోధ్యకు ఒక నాంది అని అంటారొక ఆరోగ్య విభాగపు అధికారి. ఈ ఉత్తర్వులో అమెరికాకు అత్యంత అనుకూల దేశం అనే హోదా విషయం కూడా ప్రస్తావించారు. దీనర్ధం ఏంటటంటే.. విదేశీ ఔషధ ధరలతో సమానంగా ఇక్కడి ఔషధాలూ ఉండటం. పెద్ద పెద్ద ఫార్మా సంస్థలు స్వచ్ఛందంగా ఈ సూత్రానికి కట్టుబడి ఉంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు ప్రెసిడెంట్ ట్రంప్. ఇతర దేశాల మాదిరిగానే అమెరికన్ రోగులు సైతం అదే ధరలు చెల్లిస్తున్నారా లేదా? తాము పర్యవేక్షిస్తామన్నారు అధ్యక్షుడు ట్రంప్.

ధరలు తగ్గించని వారిపై చర్యలెలా ఉంటాయో రాని స్పష్టత

ఇదిలా ఉంటే మందుల ధరలు తగ్గించడానికి ఇష్టత చూపించని వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది. బోస్టన్ విశ్వ విద్యాలయంలో పని చేసే ఒక ప్రొఫెసర్ మాటలను బట్టీ చెబితే.. అమెరికాలో ఔషధ ధరలు అస్పష్టంగా ఉన్నాయి. ఫార్మా కంపెనీలు తాము తక్కువ ధరలకే మందులు అమ్ముతున్నామని ప్రచారం చేసుకుని లబ్ధి పొందే అవకాశాలు కూడా లేక పోలేదని ఆయన అన్నారు. వారు ధరలు తగ్గిస్తారా? లేక ధరలు తగ్గిస్తున్నామని మాత్రమే చెప్పి తప్పించుకుంటారా? అన్నది తేలాల్సి ఉందన్నారీ ప్రొఫెసర్. ఎందుకంటే వాక్చాతుర్యం వాస్తవికతలు వేరు వేరుగా ఉంటాయన్నది ఈ విద్యాధికుడి వాదన

ప్రివ్యూ ఫైజర్, ఎలి లిల్లీ, GSK షేర్లపై ప్రభావం

ట్రంప్ ప్రకటన ప్రభావం.. ప్రివ్యూ ఫైజర్, ఎలి లిల్లీ, GSK వంటి ఫార్మా షేర్ ధరలను తాకింది. కానీ అవి కొన్ని కొన్ని పాలనా పరమైన కారణాలతో వెంటనే కోలుకున్నాయి. పెట్టుబడిదారులపై ఈ చర్యలు పెద్ద ప్రభావాన్ని చూపవన్న మాట కూడా వినిపిస్తోంది. ట్రంప్ ఆర్డర్ ఈ విషయంలో ఇంకా ఎలాంటి ప్రభావాలను కలిగి ఉంటుందోనని చూస్తే.. అమెరికాలో తమ లాభాలను పెంచుకోడానికి ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తులను మరింత చౌకగా అమ్ముతోన్న ఇతర దేశాల నుంచి బయటకు రావచ్చు. దక్షిణ కాలిఫోర్నియా విశ్వ విద్యాలయంలోని కొందరు రీసెర్చర్స్ ఈ రకమై కామెంట్ చేయడం కనిపించింది. దీని అర్ధమేంటంటే ఎక్కువ ధర గల ఔషధం ఎక్కువ జీవనాన్నిస్తుంది. అదే తక్కువ ధర గల మెడిసిన్ తక్కువ జీవనాన్ని మాత్రమే ఇచ్చే అవకాశముంది కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవల్సి ఉంటుందని అంటారు వీరు.

మేక్ అమెరికా హెల్తీ అగైన్ అనే నినాదాన్ని ఫుల్ ఫిల్ చేస్తుందా?

తక్కువ ధరల మందులు మేక్ అమెరికా హెల్తీ అగైన్ అనే నినాదాన్ని ఫుల్ ఫిల్ చేస్తుందా? అన్నది కూడా తేలాల్సి ఉందంటారు కొందరు నిపుణులు. అమెరికన్ల ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి ఆహారం, వ్యాయామం కీలకమంటారు వీరు. ఇక మానసిక ఆరోగ్యం సంగతి వేరు. దీని చికిత్సకూ టీకాలు, మందులకు అంత పెద్ద సంబంధం లేదు. అయితే మందుల ధరల్లో ఏదైనా తగ్గింపు మాత్రం అమెరికన్ల ఆదరణ పొందే అవకాశమైతే ఉందంటారు వీరు. ఎందుకంటే కొన్ని కొన్ని పోల్స్ చెప్పడాన్ని బట్టీ చూస్తే.. అమెరికా ఆరోగ్య వ్యవస్థ లోని అధిక ఖర్చులు ఆందోళనకరంగా చెబుతున్నాయి.

ఒకవేళ ధరలు తగ్గిస్తే అదో సానుకూల ముందడుగే

కనెక్టికట్ విశ్వ విద్యాలయ ప్రొఫెసర్ల మాటలను అనుసరించి చెబితే.. ట్రంప్ ఔషధ ధరలపై చర్యలు కొందరు అమెరికన్లకు తక్కువ స్థాయి చర్యగా అనిపిస్తాయి. కానీ సరైన పారదర్శకత కనబరిచి.. ఖచ్చితమైన చర్యలను చేబట్టి.. మందుల ధరలు తక్కువ చేయలిగితే మాత్రం ఇదొక సానుకూలమైన ముందడుగు అవుతుందని అన్నారు. అయితే ఈ ఆర్డర్ ఇటు కోర్టులు అటు కాంగ్రెస్ నుంచి కూడా సవాళ్లను ఎదుర్కునే అవకాశముందని భావిస్తున్నారు. ఓవరాల్ గా ఫార్మా ఇండస్ట్రీ ఏమంటుందోనని చూస్తే.. ఈ ఆర్డర్ ని అవి వ్యతిరేకిస్తున్నట్టే కనిపిస్తోంది. అధిక ఖర్చులను తగ్గించడానికి పెద్దగా కృషి చేయకుండా.. వీరు సరఫరా, పరిశోధనల నిధులు తగ్గించే ప్రమాదమున్నట్టు తెలుస్తోంది.

చిన్న మధ్య బయో కంపెనీకిది చేటు జాన్ ఎఫ్ క్రోలీ

ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ అండ్ మాన్యుఫాక్చరర్స్ ఆఫ్‌ అమెరికా అధ్యక్షుడు స్టీఫెన్ జే మాట్లాడుతూ.. సోషలిస్ట్ దేశాల నుంచి తక్కువ ధరల కాన్సెప్ట్ దిగుమతి చేసుకోవడం అనేది అమెరికన్ రోగులకు అత్యంత కీడు చేసే అంశంగా పేర్కొన్నారు. ఇక బయో టెక్నాలజీ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు జాన్ ఎఫ్‌ క్రౌలీ మాట్లాడుతూ.. ఇది మన దేశంలోని చిన్న మధ్యతరహా బయోటెక్ కంపెనీలను నాశనం చేసే లోపభూయిష్ట ప్రతిపాదనగా అభివర్ణించారు. వాణిజ్య యుద్ధాల్లో పడి రోగులను వారి కుటుంబాలను బలి పెట్టడం సరికాదంటారాయన.

Also read: జిల్లా అధ్యక్ష పదవి కోసం.. మజ్జి VS కోలగట్ల సిగపట్లు

పరిశోధనలకు ఇతర మార్గాలు అన్వేషించాలి ప్రోఫెసర్లు

బోస్టన్ విశ్వవిద్యాలయ స్కాలర్లు మాత్రం.. ఫార్మా ఇండస్ట్రీ వాదనలపై సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఒక ఔషధం పరిశోధన చేయడానికి ఉపయోగించే డబ్బు.. లాభాలు రాకముందే ఖర్చు చేయాల్సి ఉంటుంది. పరిశోధనలకు గానూ పెద్ద పెద్ద నగదు బహుమతులు ప్రకటించడం ద్వారా మేలు జరుగుతుంది. రీసెర్చ్ నిధులు సమకూర్చడానికి ఇతర మార్గాలను సైతం అన్వేషించాల్సి ఉందని సూచిస్తున్నారు.

అంతా అధ్యక్షుడిదే భారం అంటోన్న సామాజికవేత్తలు

ఔషధ ధరలు తగ్గించడం అన్నదానికి కేవలం ఒక కోణం మాత్రమే ఉండదు. పలు విధాలుగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న అధిక ధరలకు అనేక కోణాలున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని ఆ భారం తాము మోస్తామని అధ్యక్షుడు భావిస్తే.. ధరల తగ్గుదల ఏమంత కష్టతరం కాదన్నది కొందరు సామాజిక వేత్తల నుంచి వినిపిస్తోన్న పరిష్కార మార్గం. మరి ట్రంప్ సర్కార్ ఈ దిశగా ఆలోచిస్తుందా లేదా తేలాల్సి ఉంది.

Related News

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

Big Stories

×