E-Paper
Advertisement

సన్నరకాల ధాన్యానికి వారు చెప్పిందే మద్దతు ధర..! బ్లాక్‌ మార్కెట్‌లో ధర పెంచారు.. రైతుల వడ్ల ధరను దించారు..! రోడ్డెక్కిన వరి రైతు!

సన్నరకాల ధాన్యానికి వారు చెప్పిందే మద్దతు ధర..! బ్లాక్‌ మార్కెట్‌లో ధర పెంచారు.. రైతుల వడ్ల ధరను దించారు..! రోడ్డెక్కిన వరి రైతు!
Advertisement

కరువు వేళ దళారీలు చెప్పిందే రైతుకు మద్దతు ధరైంది. సర్కార్‌ చేష్టలుడిగి చూస్తున్నది. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర క్వింటాలుకు రూ. 2400, కానీ ఎల్‌నినో ఎఫెక్ట్‌తో కోతలు కోయగానే అలా గద్దల్లా వాలారు కళ్లాల వద్ద. క్వింటాలుకు రూ. 3500 నుంచి రూ. 4వేల వరకు ఇచ్చి తీసుకున్నారు. ప్రభుత్వానికి కొనుగోలు భారం తగ్గిందని సంతోషించినా.. ఆ సన్నరకాలు బయటకు పోవడంతో భవిష్యత్తులో రేషన్ షాపుల ద్వారా అందించే సన్నబియ్యం పథకంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

అయితే ఇవాళ సూర్యపేటలో రైతులు రోడ్డెక్కారు. దసరా పండుగ వరకు క్వింటాలుకు రూ. 4వేల వరకు ఇచ్చి కొనుగోలు చేసిన దళారీలు.. ఇప్పుడు ఈ ధరను ఆమాంతం తగ్గించేశారు. సర్కార్‌ ఇచ్చిన మద్దతు ధరకే కొంటామని సిండికేట్‌గా మారి కొత్త మెలిక పెట్టారు. అప్పటికే బహిరంగ మార్కెట్‌లో సన్నబియ్యాన్ని బ్లాక్‌ చేసి పెట్టారు. దీంతో సన్నబియ్యం ధర ఆమాంతం పెరిగిపోయింది. కిలో వంద దాటింది.

Advertisement

అంటే ఇక్కడ మూడు నాలుగు వేలకు క్వింటాలు వడ్లను కొని ..వాటిని మర ఆడించి క్వింటాలుకు రూ. 10వేల దాకా సంపాదిస్తున్నారు. మొన్నటి దాకా ముందస్తుగా వేసిన వరి సాగే కోతలకు వచ్చింది. ఇప్పుడు మిగిలిన వరి కూడా కోతలకు వచ్చింది. వడ్లు మార్కెట్‌కు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీంతో ఇప్పటిదాకా సంపాదించినా ఇంకా దుర్బిద్ది పుట్టింది మిల్లర్లు, దళారుల్లో. అందుకే సిండికేట్‌గా ఏర్పడి సర్కార్‌ పాటలాగా.. దళారీ పాటను అందుకున్నారు. వీరే ఓ మద్దతు ధరను నిర్ణయించారు.

ప్రభుత్వం మొన్నటి దాకా ఎంతిచ్చిందో అంతిస్తామని రేట్‌ఫిక్స్‌ చేశారు. దీంతో రైతులు రోడ్డెక్కారు. నిజామాబాద్‌లో కూడా ఇదే సీన్‌ రిపీట్ అయ్యింది ఇటీవల. ఆ లాభాలు మాకు రావాలి తప్ప.. పక్క రాష్ట్రంల నుంచి వచ్చి మీరెలా కొంటారని.. ఆ దళారులను తరిమికొట్టి.. లోకల్ దళారులు రైతులను దోచుకునే యత్నం చేశారు. కానీ అప్పటికే బయట కరువు.. కరువు.. వరి లేదు.. వడ్లు దొరకవు.. అంటూ బాగానే ఊదరగొట్టారు. సర్కార్‌కు కూడా వంత పాడటంతో దళారుల పంట పండింది.

Advertisement

రైతుకు కొంత లాభం జరిగినా.. దాన్నీ కొల్లగొట్టేందుకు లోకల్, నాన్‌ లోకల్ దళారులు కొడ్లాడుకున్నారు. సూర్యపేటలో మాత్రం మనం మనం కొట్టుకుంటే లాభం లేదు.. రైతు కడుపు కొడితేనే మనకు లాభమని ఒక్కటయ్యారు. సిండికేట్‌ అవతారం ఎత్తారు. కానీ రైతులు మాత్రం మీరు నిర్ణయించిన మద్దతు ధర కాదు.. మా మద్దతు ధర రూ. 4వేలు.. దాన్ని కట్టివ్వాలి.. అని రోడ్డెక్కి ఆందోళన చేశారు.

బహుశా.. ఇలాంటి పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ రాలేదు. సర్కార్‌ కొనుగోలు కేంద్రాలపై, మద్దతు ధర అమౌంట్‌ ఇంకా రాలేదని, పంట నష్టం పరిహారం, యూరియా.. ఇలా పంటలు, సాగుకు సంబంధించిన ఇష్యూలపై రైతులు రోడ్డెక్కిన చరిత్ర చూశాం… కానీ ఇవాళ ఎల్‌నినో కరువు పుణ్యమా అని రైతులు తమకు కావాల్సిన మద్దతు ధర ఇస్తారా ఇవ్వరా? అని దళారుల మీద దండయాత్ర చేసేలా ధర్నా చేసిన ఉందంతం మాత్రం ఇదే తొలిసారి అని చెప్పాలి.

Tags

Related News

మల్లారెడ్డి కాలేజీల్లో చదువు బంద్.. సినిమాలు షురూ! అసలు ఏం జరుగుతోంది?

బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాపై సంధించిన అస్త్రం ‘హేట్‌ స్పీచ్‌ బిల్లు’..!? నాన్‌బెయిలబుల్ నేరం.. పదేండ్ల జైలు..! అందుకే కేటీఆర్‌ దీన్ని వ్యతిరేకిస్తున్నారా?

ఇరిగేషన్‌ ప్రాజెక్టుల అంశంలో కేసీఆర్ మౌనం వీడడం లేదెందుకు? ఓ ప్రకటన కూడా విడుదల చేయలేకపోతున్నారా?

మొన్నటిదాకా మేం ప్రయత్నం చేసినం.. సాధ్యమే కాలేదన్న హరీశ్‌! అక్కడ నీళ్లే లేవు.. అందుకే మేడిగడ్డకు మార్చామని వాదన!

2016 ఒప్పందంలో బిగ్ మిస్టెక్.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ అసలు రూట్ మ్యాప్ ఇదే?

తెలంగాణలో బీజేపీ బిగ్ ప్లాన్.. కాంగ్రెస్‌ను నిలదీసేందుకు వేసిన ప్లాన్ ఇదే?

ఫలించిన రేవంత్‌ దౌత్యం! తుమ్మిడిహెట్టి రీ డిజైన్‌తో జఠిల సమస్యను పరిష్కరించే దిశగా..! కేసీఆర్ చేతులెత్తేసిన చోటే..తాను సాధించే దిశగా అడుగులు..!

Big Stories

Advertisement
×