E-Paper
Advertisement

మల్లారెడ్డి కాలేజీల్లో చదువు బంద్.. సినిమాలు షురూ! అసలు ఏం జరుగుతోంది?

మల్లారెడ్డి కాలేజీల్లో చదువు బంద్.. సినిమాలు షురూ! అసలు ఏం జరుగుతోంది?
Advertisement

Malla Reddy University: మల్లారెడ్డి విద్యా సంస్థలు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది నాణ్యమైన చదువా ప్రతిభ ఉన్న విద్యార్థులా కానే కాదు.  ఈ మధ్యకాలంలో మల్లారెడ్డి అంటేనే వివాదాలు పబ్లిసిటీ పిచ్చి హడావుడి ఈవెంట్లు చదువు చెప్పాల్సిన కాలేజీ ప్రాంగణాల్లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మార్చేసేసారు మల్లారెడ్డి. లక్షల రూపాయలు ఫీజులుగా కట్టి పిల్లలు గొప్ప ప్రజలు అవుతారని తల్లిదండ్రులు కాలేజీలో చేరిపిస్తే అక్కడ యాజమాన్యం ఏం చేస్తుంది పాటాలు చెప్పడం మానేసి ఏ సర్టిఫికెట్లు ఉన్న సినిమాలు చూడాలో చెబుతా ఉంది. విద్యా సంస్థల వైస్ చైర్ పర్సన్ ప్రీతి రెడ్డి పిఆర్ స్టంట్ల కోసం విద్యార్థుల భవిష్యత్తునే కాదు వారి ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు అనే డిస్కషన్ ఇప్పుడు ప్రారంభమయింది. అసలు వీళ్ళు విద్యావేత్తలా లేక ఈవెంట్ మేనేజర్లా ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మల్లారెడ్డి యూనివర్సిటీలో ఇటివల కాలంలో ఏం జరుగుతున్నాయో మనం తెలుసుకోవాలి.

ప్రమోషన్ ఈవెంట్లకు కేర్ ఆఫ్ గా మల్లారెడ్డి యూనివర్సిటీ..

Advertisement

మల్లారెడ్డి యూనివర్సిటీలో రీసెంట్ గా బారి ప్రమోషన్ ఈవెంట్లకు కేర్ ఆఫ్ గా మారిపోయింది. ఇవన్నీ సరిగ్గా జరిగితే ఇప్పుడు ఈ డిస్కషన్ అనేదే ఉండకపోయేది కానీ ఈ ఈవెంట్లఅన్నీ ఇప్పుడు కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ గా మారిపోయాయి. 2023 లో జరిగిన యనిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ 2026 ఆగస్టులో జరిగిన టాక్సిక్ మూవీ ఈవెంట్ లేటెస్ట్ గా జరిగిన ఆదర్శ కుటుంబం ట్రైలర్ లాంచ్ ఇవన్నీ కాంట్రవర్సీలు క్రియేట్ చేశయి ఒక్కో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక్కొక్క కాంట్రవర్సిటీని క్రియేట్ చేసింది. కాస్త వెనక్కి టైం ట్రావెల్ చేస్తే నవంబర్ 27 2023 నాటి సీన్స్ ని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. రణబీర్ కపూర్ రష్మిక మందన్న నటినట్లుగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన యనిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మల్లారెడ్డి కాలేజీ వేదికగానే జరిగింది. ఈ ఈవెంట్ కు రాజమౌళి మహేష్ బాబు వంటి దిగ్గజ నట్లు కూడా వచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. మాజీ మంత్రి మల్లారెడ్డి మైక్ పట్టుకోగానే మొదలైంది అసలు రచ్చ. తెలుగు వాళ్ళు ఇండియాను హాలీవుడ్ ను ఏలుతున్నారని రణవీర్ కపూర్ లాంటి వాళ్ళు కొన్నాళ్ళకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవ్వాల్సింది అని అంటూ స్టేజీ మీద ఓ రేంజ్ స్పీచ్ ఇచ్చి దంచేశరు.

యూనివర్సిటీ పై కేసు నమోదు..

Advertisement

ముంబై బెంగళూరు నగరాల గురించి ఆయన చేసిన కామెంట్స్ అప్పట్లో సోషల్ మీడియాలో ఓ పెద్ద దుమారాన్నే రేపాయి ఒక విద్యా సంస్థకు అధిపతిగా ఉంటూ వేల మంది విద్యార్థుల ముందు ఇలాంటి చౌకుబారు ప్రసంగాలు చేయడం అనేది అప్పుడు వచ్చిన ప్రధాన ప్రశ్న నెక్స్ట్ 2026 ఆగస్టు 22న టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సేమ్ మల్లారెడ్డి కాలేజీే వేదిక దానికి కూడా హీరో యష్ చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఈ ఈవెంట్ కూడా హడావుడి భారడు ప్లానింగ్ మాత్రం సున్నా అన్నట్టు సరిపోయింది. ఈ ఈవెంట్ కి పోలీసులు 7000 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చి పాసులు ఇస్తే పబ్లిసిటీ ఆస్తితో దాదాపు 20,000 మందిని లోపలికి తూసేశారు ఈ మాజీ మంత్రి గారు. రాత్రి 10 గంటల కల్లా ఈ ఈవెంట్ ముగించాలని నిబంధన పోలీసులు పెడితే అర్ధరాత్రి వరకు సాగదీశారు. దీని ఫలితం ఏందో తెలుసా తోపులాట. తోపులాట జరిగి సౌడ్ స్పీకర్ స్టాండ్ పక్కకు జరిగి జనాల మీద పడటం కొంతమంది గాయపడటం జరిగిపోయాయి. ఈ ప్రమాదంలో వనపర్తికి చెందిన భాను ప్రకాష్ అనే స్టూడెంట్ కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. మరో ముగ్గురు స్టూడెంట్స్ కి కూడా గాయాయి. ఈ ఘోర నిర్లక్ష్యం పై పేట్ బర్షీరాబాద్ పోలీసులు యూనివర్సిటీ యజమానం పై ఈవెంట్ నిర్వహణలపై కేసులు కూడా నమోదు చేశారు.

కాలేజీకి రావాలంటూ మోదీకి పిలుపు..

విద్యార్థి కాలు విరగడంపై ప్రత్యేకంగా మరో ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది. ఇక మరో పంచాయితీ ఆదర్శ కుటుంబం లేటెస్ట్ హాలుడే గోల ఇంతకుముందు రెండు సంఘటనలు ఎలా జరిగాయో చూసాం కదా వాటి వల్ల ఆర్గనైజేషన్ కి చెడ్డ పేరు వచ్చింది కూడా మరి ఇప్పటికైనా కథ పాఠాల నుంచి ఏమైనా నేర్చుకున్నారంటే అది లేదు ఆదర్శ కుటుంబం ట్రైలర్ లాంచ్ వేడుకలో విద్యా సంస్థల వైస్ చైర్ పర్సన్ మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి ఇంకో అడుగు ముందుకు వేసేశారు. ప్రీతి రెడ్డి ఈ మధ్య నాన్ సెలబ్రిటీ స్థాయి నుంచి సెలబ్రిటీ స్థాయికి దిగిపోయారు ఈమె మల్లారెడ్డి కోడలగా కంటే ప్రీతి రెడ్డి అంటేనే ఇప్పుడు ఎక్కువ క్రేజ్ ఉంది ఆమెకి ప్రీతి రెడ్డి హాష్టాగ్ తోటి వచ్చి ఏ సోషల్ మీడియా క్లిప్పింగ్ అయినా ఏ సోషల్ మీడియా లింక్ అయినా కూడా లక్షల్లోపు వ్యూస్ వస్తా ఉన్నాయి. ఆమె కూడా అదే స్థాయిలో ఈవెంట్స్ చేస్తా ఉంది. సినిమా ఫంక్షన్లు ఏంటి ఎక్కడ ఈవెంట్స్ లా ఉండే కార్యక్రమాలు ఉంటాయో అక్కడ ఈమె ప్రత్యక్షమవుతారు. రాజకీయ నాయకురాలు కావాలనే తప్పన ప్రీతి రెడ్డిలో అణువణువునా కనిపిస్తుంది. మామ బిఆర్ఎస్ లో ఉన్నారు వాళ్ళ పార్టీ బిఆర్ఎస్ కానీ వెళ్లి బిజెపీ నాయకులను కలుస్తుంది. మోడీని తన కాలేజీకి రావాలని పిలుస్తది. ఇంత వివాదస్పదమైన వ్యవహారాలు ఉన్న ఈ ప్రీతి రెడ్డికి కావాల్సిందల్లా ఏందంటే ఒక్క పోస్టు ఒక్క పదవి ఆ పదవి కోసం ఆమె కాచు కూర్చున్నారు.

మల్లారెడ్డి యూనివర్సిటీలో సినిమా ఫంక్షన్లు..

మల్లారెడ్డి సెలబ్రిటీ పిచ్చి ఒక రేంజ్లో ఉంటే కోడలు ప్రీతిరెడ్డి పిచ్చి ఇంకొక రేంజ్లో ఉందనే చర్చ కూడా నడుస్తా ఉంది. ఈ చర్చ అంతా నడుస్తూనే ఉంది. ఆమె ఆమె చేసే కార్యక్రమాలను చూస్తున్న వాళ్ళు తిడుతున్నారు తిడుతూనే చూస్తూన్నారు. ఇదొక వ్యవహారం ఇక్కడ నడుస్తా ఉంది. అయితే వరుసగా సినిమా ఫంక్షన్లు తీసుకెళ్లి ఈ మల్లారెడ్డి యూనివర్సిటీలో పెట్టడమే ఇప్పుడు పెద్ద చర్చగా మారిపోయింది. మల్లారెడ్డి ఒక బాధ్యత గల మంత్రిగా పని చేశారు ఎంపీ గా పని చేశారు ప్రస్తుతం ఎమ్మెల్యే గా ఉన్నారు అలాంటి వ్యక్తి ఇలాంటి చిల్లర వేషాలకు చిల్లర కార్యక్రమాలకు తన విద్యా సంస్థలు వేదిక చేయడం వల్ల పోయేది విద్యార్థుల భవిష్యత్తే కాదు ఆ విద్యా సంస్థ పేరు పరువు కూడా గంగల కలిసిపోతాయి. ఒక ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కల పిల్లలని తయారు చేసిన విద్యా సంస్థలు ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా నష్టపోవడం తప్ప వేరే ప్రయోజనం ఏది ఉండదనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. ఇక ప్రీతి రెడ్డి కావాలంటే ఏ పదవైనా చేసుకోవచ్చు ఆమె బోల్డ్ అంత డబ్బు ఉంది పాలమ్మినా పెరుగు అమ్మినా పూల అమ్మినా అంటూ సంపాదించిన కోట్లాది డబ్బు ఉంది విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో వసూలు చేసిన కోట్లాది రూపాయల డబ్బులు ఉంది. ఆ డబ్బులు ఉండగా ఇలా కొత్తగా వచ్చి సినిమా వాళ్ళనితో అక్కడ ఫంక్షన్ చేయించుకొని ఆ ఫంక్షన్ లో తానికేదో క్రేజ్ రావాలని చెప్పుకునే విధంగా చేయడం అయితే కరెక్ట్ కాదు.

Also Read: దుబాయ్‌లో ఐఫోన్ చౌక అని కొంటున్నారా? ఈ తప్పు చేస్తే మీ డబ్బులు గోవిందా!

సినిమా రిలీజ్‌కు కాలేజీలకు సెలవా?

ఆదర్శ కుటుంబం అనే సినిమాకి ప్రమోషన్ చేసేది ఏంటి..? అక్కడ ఉన్న పిల్లల్ని ఆరోజు సినిమా చూడమని సెలవిచ్చేది ఏంటి..? ఈ ఈవెంట్ కు వెంకటేష్ శ్రీనిధి శెట్టి దర్శకుడు త్రివిక్రం హాజరయ్యారు. వేదికపై మాట్లాడిన ప్రీతి రెడ్డి ఆ సినిమా విడుదలయ్యే రోజున తన విద్యా సంస్థలన్నిటికీ ప్రత్యేకంగా సెలవిస్తున్నట్టు గొప్ప అనౌన్స్మెంట్ చేశారు అక్కడ సినిమా కోసం కాలేజీలకు సెలవడని సోషల్ మీడియాలో దుమ్మెత్తి పూస్తున్నారు. వీళ్ళు కాలేజీలు నడుపుతున్నారా లేక సినిమాలకు ప్రమోషన్లు చేస్తున్నారా అనే దానిపై పెద్ద చర్చ నడుస్తుంది ఇప్పుడు. ఇక్కడే కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. పర్మిషన్ లేకపోయినా వేల మందిని కాలేజీ క్యాలిపస్ లోకి రప్పించి ప్రమాదాలకు కారణం అవుతుంటే విద్యాశాఖ ఏం చేస్తుంది పోలీసులు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు కష్టపడి లక్షల రూపాయల ఫీజులు పోగేసి పిల్లల చదువు కోసం కడతా ఉంటే వాళ్ళని గొప్పవాళ్ళు చేయాల్సిన కాలేజీలో ఇలాంటి సినిమా ఈవెంట్లు పెట్టి ఏల వేస్తూ తోపులాట్లు జరుగుతూ కాళ్ళు చేతులు విరగగొట్టుకోవడానికి ఈ కాలేజీ క్యాంపస్లు ఉంది విద్యార్థులకు చదువు చెప్పడానికి పరిమితం కావాల్సిన క్యాంపస్లను బిజినెస్ కమర్షియల్ హబ్బులుగా మార్చేస్తుంటే అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు నిజానికి కమర్షియల్ ఈవెంట్స్ పబ్లిసిటీ వ్యామహం కోసం విద్యార్థుల భవిష్యత్తును వారి మనస్తత్వాలను పాటు చేసే హక్కు ఏ విద్యా సంస్థకు లేదు చట్టాలను రూపొందించాల్సిన వారు చదువు చెప్పాల్సిన వారు కూడా వ్యాపారవేత్తలుగా ఈవెంట్ మేనేజర్ గా మారిపోతే నష్టపోయేది పిల్లలే.

Tags

Related News

సన్నరకాల ధాన్యానికి వారు చెప్పిందే మద్దతు ధర..! బ్లాక్‌ మార్కెట్‌లో ధర పెంచారు.. రైతుల వడ్ల ధరను దించారు..! రోడ్డెక్కిన వరి రైతు!

బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాపై సంధించిన అస్త్రం ‘హేట్‌ స్పీచ్‌ బిల్లు’..!? నాన్‌బెయిలబుల్ నేరం.. పదేండ్ల జైలు..! అందుకే కేటీఆర్‌ దీన్ని వ్యతిరేకిస్తున్నారా?

ఇరిగేషన్‌ ప్రాజెక్టుల అంశంలో కేసీఆర్ మౌనం వీడడం లేదెందుకు? ఓ ప్రకటన కూడా విడుదల చేయలేకపోతున్నారా?

మొన్నటిదాకా మేం ప్రయత్నం చేసినం.. సాధ్యమే కాలేదన్న హరీశ్‌! అక్కడ నీళ్లే లేవు.. అందుకే మేడిగడ్డకు మార్చామని వాదన!

2016 ఒప్పందంలో బిగ్ మిస్టెక్.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ అసలు రూట్ మ్యాప్ ఇదే?

తెలంగాణలో బీజేపీ బిగ్ ప్లాన్.. కాంగ్రెస్‌ను నిలదీసేందుకు వేసిన ప్లాన్ ఇదే?

ఫలించిన రేవంత్‌ దౌత్యం! తుమ్మిడిహెట్టి రీ డిజైన్‌తో జఠిల సమస్యను పరిష్కరించే దిశగా..! కేసీఆర్ చేతులెత్తేసిన చోటే..తాను సాధించే దిశగా అడుగులు..!

Big Stories

Advertisement
×