E-Paper
Advertisement

పెళ్లి కాగానే.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు.. కొత్త జర్నీ ఇక్కడి నుంచే!

పెళ్లి కాగానే.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు.. కొత్త జర్నీ ఇక్కడి నుంచే!
Advertisement

From Wedding Ceremony to Airport: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని అనుభూతి. పెళ్లి తర్వాత మొదలయ్యే కొత్త జీవితం కూడా ప్రత్యేకంగానే ఉండాలని చాలామంది కోరుకుంటారు. అలాంటి ఓ కొత్త జంటకు తమ వివాహం తర్వాత చేసిన తొలి ప్రయాణం మరింత స్పెషల్ గా నిలిచింది. పెళ్లి వేడుకలు ముగిసిన వెంటనే కొత్త జంట భోగాపురం విమానాశ్రయానికి వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పెళ్లి దుస్తుల్లోనే ఎయిర్‌పోర్ట్‌ కు!

సోషల్ మీడియాలో  సర్క్యులేట్ అవుతున్న ఈ వీడియోలో కొత్తగా పెళ్లైన జంట విమానాశ్రయంలో వస్తున్నట్లు ఉంది. పెళ్లి వేడుకల సందడి పూర్తిగా అయిపోకముందే వాళ్లు విమాన ప్రయాణానికి సిద్ధమైనట్లు  కనిపిస్తోంది. వధువు పెళ్లి అలంకరణలోనే ఉండగా, వరుడు కూడా సంప్రదాయ దుస్తుల్లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సాధారణంగా పెళ్లి తర్వాత కొత్త జంట హనీమూన్‌ కోసం అందమైన ప్రదేశానికి వెళ్తుంటారు. కానీ, ఈ జంట మాత్రం తమ కొత్త ప్రయాణం కోసం భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ కు రావడం ఆసక్తికరంగా మారింది.

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ లో కమర్షియల్ ఆపరేషన్స్  

Advertisement

ఇవాళ్టి నుంచి భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో  కమర్షియల్ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. తొలి రోజే దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించాయి. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఇండిగో విమానం తొలి కమర్షియల్‌ విమానంగా నిలిచింది. సింగపూర్‌ నుంచి వచ్చిన స్కూట్‌ విమానం తొలి అంతర్జాతీయ సర్వీస్‌ గా నమోదైంది.

వైరల్‌గా మారిన వీడియో

ఈ నేపథ్యంలో కొత్త జంట భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ లో కనిపించడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. “కొత్త ఎయిర్‌పోర్ట్.. కొత్త జంట.. న్యూ జర్నీ” అంటూ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.పెళ్లి రోజునే కొత్త జీవితానికి అడుగు పెట్టిన ఈ జంట, అదే ఉత్సాహంతో విమాన ప్రయాణాన్ని ప్రారంభించడం చూసి నెటిజన్లు కూడా ఆసక్తిగా స్పందిస్తున్నారు. వారి ప్రయాణం ఎక్కడికి అనేది వీడియోలో ప్రస్తావించకపోయినా, పెళ్లి తర్వాత వెంటనే ఎయిర్‌పోర్ట్‌ కు రావడం మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.

Advertisement

కొత్త జంటకు సంబంధించిన వీడియోను చూసి పలువురు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. “కొత్త జీవితానికి కొత్త ప్రయాణం”, “పెళ్లి వెంటనే విమాన ప్రయాణం.. మంచి జ్ఞాపకం” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ ప్రారంభమైన సమయంలోనే ఈ జంట అక్కడ కనిపించడం మరింత స్పెషల్ గా ఉందంటున్నారు. కొత్త విమానాశ్రయంలో ప్రయాణించిన తొలి రోజుల జ్ఞాపకాలు వీరి జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతాయని కామెంట్లు చేస్తున్నారు. “కొత్త ఎయిర్‌ పోర్ట్‌ లో కొత్త జంట.. కొత్త జీవితానికి కొత్త జర్నీ” అనే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Read Also: భోగాపురంలో దిగిన ఫస్ట్ ప్యాసింజర్ ఫ్లైట్‌కు ఘన స్వాగతం.. ఈ వీడియో చూశారా?

Tags

Related News

రూ.17 వేల నుంచే వైల్డ్‌ లైఫ్ టూర్.. ఈ 3 ప్లేసులు మిస్ అవ్వొద్దు!

వందే భారత్ స్లీపర్ vs రాజధాని.. ఫుడ్ ఏ రైల్లో బాగుంటుంది?

రైలు పట్టాల కింద రాళ్లు లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఊహించడానికే భయంగా ఉంది బాబోయ్!

సైట్ ఓపెన్ చేస్తే సర్వర్ డౌన్.. క్షణాల్లో మాయమవుతున్న రైల్వే టికెట్లు!

రైలు ప్రయాణికులకు అలర్ట్.. టికెట్‌ ఉన్నా జరిమానా తప్పదు.. ఎందుకంటే?

రైల్వే ట్రాక్‌ లపై డ్రోన్లతో నిఘా.. ప్రయాణాలకు ఇబ్బంది లేకుండానే తనిఖీలు!

వెయిటింగ్ లిస్ట్ ఉన్నా టెన్షన్ వద్దు.. చార్ట్ తర్వాత కూడా రైలు టికెట్ ఇలా బుక్ చేసుకోవచ్చు!

పగిలిన అద్దాలు.. కంపుకొట్టే టాయిలెట్లు.. బాబోయ్.. ఇది వందేభారత్ రైలా?

Big Stories

Advertisement
×