BigTV English
Advertisement

40 Crores Gold Seized in Telugu States: ఏపీ, తెలంగాణలో భారీగా పట్టుబడిన.. ఒకే రోజు 40 కోట్ల బంగారం సీజ్

40 Crores Gold Seized in Telugu States: ఏపీ, తెలంగాణలో భారీగా పట్టుబడిన..  ఒకే రోజు 40 కోట్ల బంగారం సీజ్

40 Crore Gold Seized in Telugu States During the Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి ఓ రేంజ్‌కు చేరుకుంది. ఎన్నికల పోలింగ్‌కు కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. నేతల మాటల యుద్ధం కాసేపు పక్కనబెడితే.. పోలీసుల విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సోదాలు తీవ్రతరం చేశారు పోలీసులు. ఓటర్లకు తాయిలాలకు సమయంలో దగ్గరపడడంతో చెక్ పోస్టుల వద్ద భారీగా బలగాలను మొహరించారు. దీనికితోటు సమాచారం ఇచ్చేందుకు సీ విజల్ యాప్ ఉంది. మరోవైపు ఫ్లయింగ్ స్వ్కాడ్ దూకుడు పెంచాయి.


ఏపీ, తెలంగాణలో ఒక్క శుక్రవారం (మే 3) రోజు 40 కోట్ల బంగారాన్ని సీజ్ చేయడం కలకలం రేపుతోంది. బంగారం ఎక్కడ నుంచి వస్తోంది? ఎక్కడ వెళ్తోందన్న విషయాలను అధికారులు గోప్యంగా ఉంచుకున్నారు. తొలుత తెలంగాణ విషయానికొద్దాం. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు, ఆర్జీఐ పోలీసులు భారీగా బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రెండు వాహనాల్లో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న 34.78 కిలోల బంగారు నగలు, 43.60 కిలోల వెండిని పట్టుకున్నారు. హైదరాబాద్ కు చెందిన వ్యాపారులు రాజస్థాన్, ముంబై నుంచి భారీగా బంగారం వెండి ఆభరణాలను కార్గో విమాన సర్వీసుల్లో తరలిస్తున్నట్లు ఫ్లయింగ్ స్వ్కాడ్‌కు సమాచారం వచ్చింది. దీంతో వాహనాలపై నిఘా పెట్టారు. రెండు వాహనాల్లో తరలిస్తున్న ఆభరణాల బాక్సులు దొరికాయి. వీటి విలువ అక్షరాలా 25 కోట్ల ఉంటుందని అంచనా వేశారు.

Also Read: Kadapa Postal Voting : పార్టీ కండువాతో పోలింగ్ బూత్ లోకి వైసీపీ నేత.. టీడీపీ సీరియస్


తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద ఎస్ఎస్‌టీ అధికారుల టీమ్ సోదాలు చేపట్టింది. విశాఖ నుంచి కాకినాడకు వస్తున్న సీక్వెల్ లాజస్టిక్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు చెందిన వాహనంలో బంగారం, వెండి వస్తువులను పట్టుకున్నారు. ఆయా వస్తువుల విలువ మార్కెట్లో 17 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు చెబుతున్నమాట. సరైన పత్రాలు చూపకపోవడం, తరలించే వ్యక్తుల పేర్లు లేకపోవడంతో వాహనాన్ని సీజ్ చేసి పిఠాపురం ఎమ్మార్వో ఆఫీసుకు తరలించారు. పట్టుబడిన వస్తువులను సీజ్ చేసి కాకినాడ ఎన్నికల అధికారి కార్యాలయానికి తరలించారు.

ALSO READ: జగన్ ఇంటికి వాస్తు దోషం? ఐదేళ్లలో కనిపించలేదా?

రెండువారాల కిందట కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ఆధారంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నుంచి ఏప్రిల్ 16 వరకు దేశవ్యాప్తంగా దాదాపు 562 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలను సీజ్ చేశారు. ఇక ఏపీలో భారీగా బంగారం, వెండి 50 కోట్ల రూపాయల పైమాటేనని చెబుతున్నారు. రాబోయే వారంలో పసిడి, వెండి ఇంకెంత పట్టుబడుతుందో చూడాలి. మొత్తానికి ఎన్నికల నగదు కంటే నగలు ఎక్కువగా పట్టుబడడం గమనార్హం.

Related News

Top 20 News @ 6 PM: అందెశ్రీ ఇక లేరు.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు.. నేటి టాప్ 20 న్యూస్ ఇవే!

Lokesh Tweet: ఇది హిందువుల విశ్వాసాలపై జరిగిన దాడి.. లోకేష్ ఘాటు వ్యాఖ్యలు

TTD Staff Suspended: తిరుమలలో మరో అపచారం.. నాన్ వెజ్ తింటూ దొరికిన టీటీడీ సిబ్బంది.. ఇద్దరిపై వేటు

Roja: ఇక చెన్నైలోనే రోజా? ఎన్న తలైవా.. ఆ పార్టీలో పదవి ఇరుక్కా?

KA Paul: వార్తల్లోకి కే‌ఏ పాల్.. సుప్రీంకోర్టు గరంగరం, ఏం జరిగింది?

Jagan Tweet: సీపీ బ్రౌన్ జయంతికి జగన్ నివాళి.. కామెంట్లు మామూలుగా లేవు

TDP Politics: కొందరు నేతలపై మంత్రి లోకేష్ సీరియస్.. ఏం జరిగింది? మళ్లీ వచ్చేసరికి

Jagan Chandra Babu: ఎన్నికల వేళ జగన్ బయటకు తీసిన అస్త్రం.. చంద్రబాబు ఇప్పుడే ప్రయోగించారు

Big Stories

×