E-Paper
Advertisement

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం
Advertisement

Boxing Champion: గాయాలు ఎదురైనా పేదరికం వెక్కిరించినా ఆమె అడుగులు ఆగలేదు. రింగ్‌లో పంచ్ విసిరి దేశానికి బంగారు పథకాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు జాతీయ స్థాయి కోచ్‌గా అర్హత సాధించింది. ఇప్పుడు మరో పెద్ద ఆశయం కోసం పరుగులు పెడుతోంది. మట్టిలో పుట్టి మాణిక్యంలా మెరిసిన ఆ యువతి టార్గెట్ ఏంటి? ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు?

16 బంగారు పతకాలు..

పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్రలోని ఒక సాధారణ రైతు ఇంట్లో పుట్టింది కోడి తేజస్విని వెంకట శైలజ. చేతిలో డబ్బులు లేవు. కానీ గుండెల్లో అంతులేని ఆత్మవిశ్వాసం ఉంది. బాక్సింగ్ లో ఏడేళ్ల కఠోర శ్రమ.. నేపాల్ అంతర్జాతీయ వేదికపై దేశ పతాకాన్ని సగర్వంగా ఎగరవేసేలా చేసింది. జాతీయ స్థాయిలో స్వర్ణాలు, రాష్ట్ర స్థాయిలో ఏకంగా 16 బంగారు పతకాలు సాధించింది ఈ గోదావరి అణిముత్యం. అయితే తన ప్రయాణం అక్కడితో ఆగలేదు. పంజాబ్‌ పటియాలా నేతాజీ సుభాష్ క్రీడా సంస్థలో ఏ గ్రేడ్‌తో నేషనల్ కోచ్‌ అర్హత సాధించింది.

Advertisement

Alao Read: Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

ఐఏఎస్ అవ్వాలనే డ్రీమ్..

తాను పడిన కష్టం మరొకరు పడకూడదని 30 మంది చిన్నారులకు ఫ్రీగా బాక్సింగ్ కోచింగ్ ఇస్తోంది. పతకాల కోసం పంచ్‌లు విసిరిన ఆ పిడికిలి ఇప్పుడు సమాజంలో మార్పు కోసం కలం పట్టాలని కలలు కంటోంది. రింగ్‌ను ఏలిన ఈ వీరవనిత, ఐఏఎస్ అధికారి అవ్వాలనే బిగ్ డ్రీమ్ తో రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. ఆడపిల్లకు బాక్సింగ్ ఎందుకని చుట్టుపక్కల వాళ్లు హేలన చేసినా ఆమె తల్లిదండ్రులు అడ్డుచెప్పలేదు. కూతురి ఆశయమే గొప్పదని భావించారు. అందుకే ఇవాళ శైలజ అందరికి ఇన్ స్ప్రెషన్ గా నిలిచారు. శైలజ లాంటి బిడ్డలే మన దేశానికి అసలైన బంగారు పతకాలు. గోదావరి మట్టి మాణిక్యం ఐఏఎస్ ఆశయం నెరవేరాలని ఆశిద్దాం.

Advertisement

Also Read: విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

Tags

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×