Mercury Transit 2024: గ్రహాల రాకుమారుడు బుధుడు సెప్టెంబర్‌లో సూర్యుడి రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. సెప్టెంబర్ 4 న సింహరాశిలో బుధుడు ప్రవేశించనున్నాడు. బుధుడు తెలివితేటలు, సంభాషణ, స్నేహితులు మొదలైన వాటికి కారకంగా భావిస్తారు. బుధుడు సింహ రాశిలోకి ప్రత్యక్ష మార్గంలో ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం కొన్ని రాశులపైన ఎక్కువగా ఉంటుంది. సింహరాశికి అధిపతి సూర్యుడిగా చెబుతారు.
భాద్రపద శుక్లపక్ష ప్రతిపాద తిథి సెప్టెంబర్ 4 బుధవారం రోజు ఉదయం 10:30 తర్వాత సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం సింహం, తులా, ధనస్సు, కుంభరాశులపై పడుతుంది. దీంతో సెప్టెంబర్ 4 నుంచి కొన్ని రాశుల వీరికి శుభ ఘడియలు రాబోతున్నాయి.బుధుడు సంచారం ప్రేమ, వృత్తి, వ్యాపార, ఆర్థిక జీవితానికి మంచి ఫలితాలను ఇచ్చేదిగా పరిగణిస్తారు.
ఈ సమయంలో కొన్ని రాశుల వారు డబ్బు సంపాదించే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగాలు, వ్యాపారంలో కూడా సానుకూల ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.ఈ కాలంలో సానుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. మరి బుధుడి సంచారం వల్ల ఏ రాశుల వారిపై ప్రభావాన్ని చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులు చదువుపట్ల ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. అంతేకాకుండా మంచి ప్రణాళికలతో ముందుకు సాగుతారు. వ్యాపారంలో లాభాలు కూడా పెరుగుతాయి. ధనలాభం ఉంటుంది. అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ప్రతి వ్యూహం విజయానికి మెట్లుగా మారుతుంది.
వ్యాపారంలో నిలిచిపోయిన డబ్బులను కూడా పెరిగి పొందుతారు. పనికి సంబంధించిన ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడిపే అవకాశాలు ఉన్నాయి. ఆఫీసులో పనితీరు బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యల వల్ల కలిగే బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.
సెప్టెంబర్ నెలలో బుధుడు రెండు సార్లు రాశి మార్పు చెందనున్నాడు. సెప్టెంబర్ 4వ తేదీన సింహరాశిలోకి బుధుడు ప్రవేశించనున్నాడు. సెప్టెంబర్ 15 వరకు సూర్యుడు, బుధుడి సంచారం జరగనుంది.
కర్కాటక రాశి వారికి బుధుడి సంచారం మేలు చేస్తుంది. ఈ సమయంలో వీరికి వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. అంతే కాకుండా కుటుంబంలో ఆనందాలు పెరుగుతాయి. గతంలో కంటే ఆధాయం బాగా పెరుగుతుంది.
Also Read: వినాయక చవితి రోజున పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి
సింహ రాశి వారికి బుధుడి సంచారం ప్రయోజనాలను కలిగిస్తుంది. మీరు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. అంతే కాకుండా కెరీర్ పరంగా కూడా బాగుంటుంది. దంపతుల మధ్య సన్నిహిత సంబంధాలు పెరుగుతాయి. సంతోషం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ కాలంలో మేష రాశి వారికి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చాలా కాలంగా ఉన్న ఆందోళనలు తొలగిపోతాయి. కెరీర్ పరంగా ప్రయోజనాలను పొందుతారు. చేసే పనుల్లో సంతృప్తి లభిస్తుంది. వ్యాపారాలు చేసే వారికి లాభ దాయకంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో ఆర్థిక పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఈ సమయంలో మీరు సంతోషంగా గడుపుతారు. అంతే కాకుండా మత పరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)