E-Paper
Advertisement

సర్‌పై ఢిల్లీ దద్దరిల్లుతున్న వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిపక్షాల్లో నిస్తేజం..! బీఆరెస్‌ సైలెంట్‌ మోడ్‌.. వైసీపీ గప్‌చుప్‌..!

సర్‌పై ఢిల్లీ దద్దరిల్లుతున్న వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిపక్షాల్లో నిస్తేజం..! బీఆరెస్‌ సైలెంట్‌ మోడ్‌.. వైసీపీ గప్‌చుప్‌..!
Advertisement

దేశం మొత్తం ఢిల్లీ వైపు చూస్తోంది. రెండు మూడు రోజులుగా ఢిల్లీ వీధులు దద్దరిల్లుతున్నాయి. ఇండీ కూటమి చేస్తున్న కవాతుతో కేంద్రం పీఠం కదిలిపోతున్నది.

కేంద్ర ఎన్నికల వ్యవస్థపై పూర్తిగా దేశ జనం నమ్మకం కోల్పోయిన తరుణంలో జరుగుతున్న ఆందోళనతో హస్తినా అట్టుడికిపోతున్నది. దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనకు దిగుతున్నాయి. ఇండీ కూటమిలోని పార్టీలన్నీ రాష్ట్రాల వారీగా ఆందోళనలు చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తో ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాయి.

Advertisement

అంతటా ఇదే ఆందోళన వాతావరణం కనబడుతుంటే.. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాల తీరు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. తెలంగాణ విషయానికొస్తే.. అప్పుడప్పుడూ అలా స్పందించి వదిలేస్తున్నట్టుగానే బీఆర్‌ఎస్‌ పార్టీ వ్యవహారం ఉంది. సర్‌ ప్రక్రియపై పార్టీ పరంగా సమావేశాలు జరిపి, కార్యకర్తలను అప్రమత్తం చేసి జనాన్ని చైతన్యం చేశామని మొదట్లో చెప్పుకున్నారు.

అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఎస్‌ఐఆర్‌లో ఎంతటి అవకతవకలు జరుగుతున్నాయో.. సాక్షాత్తు ప్రధాన ఎన్నికల వ్యవస్థ నుంచి బాహాటంగా వ్యతిరేక గళాలు వినిపిస్తున్న వేళ… బీఆరెస్‌ మాత్రం సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.

Advertisement

ఎప్పటికైనా బీఆరెస్‌, బీజేపీ ఒక్కటే.. ఈ రెండు పొత్తులు పెట్టుకుంటాయి.. అని జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తున్నట్టుగానే కేటీఆర్‌ దీనిపై పల్లెత్తు మాట కూడా మాట్లాడటం లేదు. అప్పుడు నీట్‌ పరీక్ష పేపర్ లీక్‌ పై మాత్రం జెన్‌జీకి సపోర్టుగా నిలుస్తాను.. ఢిల్లీ మాత్రం రాలేను.. అంటూ ధర్నా చౌక్‌లో దీక్షకు కూర్చున్న కేటీఆర్‌.. ఇంతటి కీలకమైన సర్‌ విషయంలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఎందుకు ఉంటున్నాడు? అనేది చర్చకు తెరలేపుతున్న అంశంగా మారింది.

తనకు వైరల్‌ ఫీవర్‌గా ఉందని, విశ్రాంతి తీసుకుంటున్నందున కొన్ని రోజుల పాటు బయటకు రాలేనని ట్వీట్‌ చేశాడు ఇవాళ. జ్వరం వచ్చినా.. ఇంట్లోనే సేద తీరుతున్నా.. కేంద్రం వైఖరి, సర్‌ విధానంపై.. ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలపై అదే ట్వీట్‌లో తన అభిప్రాయాన్ని, ఖండనను, డిమాండ్‌ను వినిపించొచ్చు కదా?  అలా చేయలేదు.

అంటే ఏమనుకోవాలి. పైగా మొన్న సీఎం రేవంత్‌ను విమర్శించే ఉద్దేశ్యంలో భాగంగా  ‘రాహుల్‌.. ఓట్‌ చోరీ అంటూ ఢిల్లీలో గాయి గత్తర లేపుతున్నాడు… మరి ఇక్కడ మీ సీఎం మాపై అక్రమ కేసులు పెడుతున్నాడు.. జర ఇటూ చూడు..’  అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు. అంటే.. ఈ ఓట్‌చోరీ అంశం.. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇష్యూగానే బీఆర్‌ఎస్‌ చూస్తున్నదా..? మోడీకి తమ సపోర్టును ఇలా తమ పార్టీ స్టాండ్ అని చెప్పకనే చెబుతున్నారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇక ఏపీ రాజకీయాలను తీసుకుంటే.. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న కూటమి సర్కార్‌.. మోడీని మోసేస్తున్నది. ఆయన ఇరవై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానాన్ని నెత్తికెత్తుకుని కొనియాడాడు బాబు తాజాగా.  మరి అక్కడ ప్రతిపక్షమైనా సర్.. ఆందోళనలపై స్పందిస్తున్నదా? అంటే అదీ లేదు. జగన్‌ ఈ విషయంలో మొదటి నుంచి సైలెంట్‌గానే ఉంటూ వస్తున్నారు. జెన్‌జీ ఉద్యమాన్ని ఆదిలో కీర్తించాడు. తాము కూడా కాక్రోచులమై అధికార పార్టీపై విరుచుకు పడతామని కూడా కామెంట్ చేశాడు.

సర్.. ప్రక్రియ ప్రారంభమైనప్పుడు తమ పార్టీ ఓటర్ల ఓట్లే ప్రధానంగా కొల్లగొడతారని, జాగ్రత్తగా ఉండాలని పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. ఆ తరువాత సేమ్‌.. బీఆర్‌ఎస్‌ మాదిరిగానే జగన్‌ కూడా గప్‌ చుప్‌ అయిపోయాడు. సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయాడు.  తాజాగా ఢిల్లీ పరిణామాల నేపథ్యంలో కూడా ఆ పార్టీ చడీ లేదు.. చప్పుడూ లేదు. ఈ మధ్య జగన్‌ను సీపీఐ నేతలు కలిశారు. కలిసి పోరాడుదామన్నారు. తాను అధికారికంగా ఎన్డీయేలో లేకున్నా.. ఉన్నట్టే. ఇండీ కూటమిలో చేరే పరిస్థితులు లేవు. తన రాజకీయ నేపథ్యం అలాంటిది మరి… అని ఏపీ జనం అనుకుంటున్నారు.

Tags

Related News

ఇదేం విచిత్రం వరికే అగ్రతాంబూలమా.. ఆ పంటలపై వ్యవసాయ పరిశోధకులు శీతకన్ను..?

కేటీఆర్ ఆస్తుల చిట్టాలో రేవంత్ హిట్టు .. కేసీఆర్ అక్రమాస్తుల అంశంలో దొరకని పట్టు!

సీఈసీ వైఖరిపై దుమారం..! సర్‌ విధానంతో కేంద్రం బద్నాం..! ఓ వైపు ఢిల్లీ దద్దరిల్లుతుంటే కీర్తిబావుటాలేలా..?

గులాబీ ముల్లు.. కొణతం దిలీప్‌..! ఆయన చేతిలో బడానేత కీలుబొమ్మ.. దుందుడుకు మనస్తత్వానికి, పక్కదారి పట్టించే సలహాలు..!

యువనేత మరో కోణం.. నకిలీ బతుకుల ఫేక్ అకౌంట్లకు కేరాఫ్ అడ్రస్.. సోషల్ మీడియా చీకటి రాజ్యానికి తనో రారాజు…!

2022 ఆగస్టులో కొత్త పింఛన్లు పెంచిన కేసీఆర్.. సుధీర్ఘ కాలం తరువాత ఈ దసరాకు రేవంత్‌ సర్కార్‌..! 2.50లక్షల కొత్త ఫించన్లు..

తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల రచ్చ.. 15 నుండి 18 మందికి మళ్లీ ఛాన్స్?

Big Stories

Advertisement
×