BigTV English

Addanki YCP Incharge: అద్దంకి వైసీపీ ఇన్చార్జ్ రేసులో.. కరణం బలరాం

Addanki YCP Incharge: అద్దంకి వైసీపీ ఇన్చార్జ్ రేసులో.. కరణం బలరాం

Addanki YCP Incharge: ఆ నియోజకవర్గంలో వరుస ఓటములతో వైసీపీ పరిస్ధితి దారుణంగా మారుతోంది. ఇంచార్జ్‌గా ఉన్న నేతలు పార్టీ వ్రేణులను పట్టించుకుంటున్న పాపాన పోవట్లేదు. చుట్టం చూపుగా వచ్చి పోతున్నారే పార్టీ పటిష్టానికి చర్యలు తీసుకోవట్లేదు. దీంతో అక్కడ ఇంచార్జ్‌ను మార్చాలని క్యాడర్ గొంతు విప్పుతోంది. ఇదే విషయాన్నీ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో అక్కడ కొత్త సమన్వయకర్త వస్తారనే మారుస్తారనే ప్రచారం జోరందుకుంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం? కొత్తగా వైసీపీ బాధ్యతలు చేపట్టబోతున్న నాయకుడెవరు?


ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి వైసీపీలో ఆందోళన మొదలైంది. పార్టీ ఇన్చార్జ్‌గా ఉన్న పాణెం చిన్న హనిమిరెడ్డిని మార్చాలనే డిమాండ్ తెరపైకి వస్తుంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నుండి హనిమిరెడ్డి పార్టీ గురించి పట్టించుకోవట్లేదనే టాక్ వినిపిస్తుంది. నాన్ లోకల్ వ్యక్తి కావడంతో చుట్టం చూపుగా రావడం, లేదా పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనడం తప్ప మిగిలిన సమయంలో హనిమిరెడ్డి కనపడట్లేదని స్థానిక వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హనిమిరెడ్డిని ఇలాగే కంటిన్యూ చేస్తే పార్టీ పరిస్ధితి పూర్తిగా దిగజారిపోతుందని కేడర్ వాపోతుంది.

పార్టీ బలోపేతం గురించే ఆలోచించని హనిమిరెడ్డి అద్దంకి వచ్చిన ప్రతిసారి స్థానిక ఎమ్మెల్యే, మత్రి గొట్టిపాటి రవికుమార్‌కు సవాళ్ల మీద సవాళ్ళు విసిరి కూటమి శ్రేణులను రెచ్చగొట్టి వెళ్లిపోతున్నారంట. ఇదంతా చూస్తున్న సొంతపార్టీ కార్యకర్తలే హనిమిరెడ్డి మాటలు చూస్తే కోటలు దాటతాయని.. చేతల్లో మాత్రం చేవ ఉండదని సెటైర్లు విసురుతున్నారు. చుట్టం చూపుగా వచ్చే హనిమిరెడ్డిను పక్కన పెట్టి నిత్యం లోకల్ గా ఉండే నాయకుడిని ఇంచార్జిగా నియమించాలని స్ధానిక వైసీపీ క్యాడర్ కోరుతోంది.


2019 నుండి అద్దంకి వైసీపీ ఇన్‌చార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే గరటయ్య కుమారుడు బాచిన కృష్ణ చైతన్య ఉండేవారు. అప్పట్లో చైతన్య శాప్ నెట్ చైర్మన్ గా కూడా వ్యవహరించారు. అయితే 2024 ఎన్నికలకు ముందు చైతన్యను కాదని ఫ్యాను పార్టీ అధిష్టానం హనిమిరెడ్డిను తెరమీదకు తెచ్చింది. దీంతో వైసీపీ రెండు వర్గాలుగా చీలి ఒకరుపై మరొకరు మాటల తూటాలు పేల్చుకునేవారు. ఇక చివరకు టిక్కెట్ దక్కదని తెలియడంతో గరటయ్యతో పాటు చైతన్య కూడా సైకిల్ ఎక్కేశారు. అయితే హనిమిరెడ్డిను అద్దంకికు తీసుకురావడంలో జగన్ దగ్గర బంధువు వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉన్నట్టు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

వైవీ సుబ్బారెడ్డి, హనిమిరెడ్డి ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ కావడంతో హనిమిరెడ్డికు టిక్కెట్ ఇప్పించడంలో, అధినేత జగన్ దగ్గర వైవీ కథ నడిపించారన్న టాక్ కూడా అప్పట్లో బాగా నడిచింది. ఇక హనిమిరెడ్డి కూడా డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఎక్కడ తగ్గలేదు. ఎన్నికల సమయంలో జగన్ బహిరంగ సభతో పాటు పార్టీ నేతల కోసం భారీ స్ధాయిలో డబ్బు ఖర్చు చేశారంటారు. వైసీపీలో బాచిన కృష్ణ చైతన్య వర్గీయులను కూడా తనవైపు తిప్పుకోవడానికి హనిమిరెడ్డి బానే ఖర్చుపెట్టారంట. క్యాష్ పాలిటిక్స్‌తో పార్టీలో వర్గపోరు లేకుండా చేసి క్యాడరును ఏకతాటి పైకి తెచ్చారు. అయితే అంత చేసినా ఎన్నికల్లో గొట్టిపాటి రవి చేతిలో 24వేల ఓట్ల తేడాతో హనమిరెడ్డి ఓటమి పాలయ్యారు.

Also Read: మాజీ మంత్రి భర్త సిత్రాలు.. మన్యం వైసీపీలో టెన్షన్ టెన్షన్..

ఫ్యాను పార్టీ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు మూడు సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారి మాత్రమే అద్దంకిలో ఫ్యాను జెండా ఎగిరింది. 2014 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుండి ప్రస్తుత విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ పోటీ చేసి విజయం సాధించారు. అయితే అప్పుడు రాష్టంలో టీడీపీ అధికారంలో ఉండటంతో ఆయన కూడా టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. అ తర్వాత 2019లో మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య వైసీపీ నుండి పోటీ చేయగా టీడీపీ నుండి గొట్టిపాటి పోటీ చేసి మరోసారి విజయబావుటా ఎగరేశారు.

ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ నుండి పాణెం చిన్న హనిమిరెడ్డి పోటీ చేయగా టీడీపీ నుండి గొట్టిపాటే పోటీ చేసి విజయం సాధించారు. అంతకు ముందు 2009లోనూ కాంగ్రెస్ నుండి పోటీ చేసిన గొట్టిపాటి రవి అప్పుడు కూడా గెలుపు దక్కించుకున్నారు. గత నాలుగు ఎన్నికల్లో వరుసగా గెలుస్తున్న గొట్టిపాటి రవికుమార్ నియోజికవర్గంలో ఎదురులేని నేతగా ఎదిగారు. అద్దంకిలో తనదైన బ్రాండ్ వేసుకున్న ఆయనకు చంద్రబాబు మంత్రివర్గంలో ప్రాధ్యానత కలిగిన విద్యుత్ శాఖ దక్కింది.

ఎన్నికల తర్వాత పరిణామాలతో అద్దంకి వైసీపీలో హనిమిరెడ్డిపై వ్యతిరేకత పెరిగిపోవడంతో కొత్త ఇన్చార్జ్ వస్తారన్న ప్రచారం మొదలైంది. మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం, లేదా ఆయన కుమారుడు ప్రస్తుత చీరాల వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్‌ను కానీ అద్దంకి వైసీపీ ఇంచార్జ్‌గా నియమిస్తారనే టాక్ వినిపిస్తుంది. కరణం కుటుంబం అద్దంకికి చెందినదే కావడం, స్ధానికంగా గట్టిపట్టున్న నాయకులు కావడం పార్టీకు కలిసొస్తుందని వైసీపీ అధిష్టానం భావిస్తుందట. సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటిను తట్టుకుని నిలబడాలంటే అది కరణం కుటుంబం వల్లే అవుతుందని స్ధానిక వైసీపీ క్యాడర్ కూడా అభిప్రాయపడుతోది.

అసలే కరణం, గొట్టిపాటి ఉప్పు నిప్పుల్లా ఉంటారు. గతంలో ఇద్దరు టీడీపీలో ఉన్నప్పుడే నిరంతరం మాటల యుద్దం జరిగేది. అలాంటిది ఇప్పుడు వారిద్దరు అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలుగా ఒకేచోట ఉంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే పార్టీలో యాక్టివ్‌గా లేని ఇన్చార్జ్‌లను వైసీపీ అధ్యక్షుడు జగన్ మార్చేస్తున్నారు. ఆక్రమంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జ్‌గా ఉన్న యడం బాలాజీను తొలగించి గాదె మధుసూదన్ రెడ్డిని నియమించారు. ఈ నేపధ్యంలో హనిమిరెడ్డిని పక్కన పెట్టి కరణం కుటుంబానికి పార్టీ భాధ్యతలు కట్టబెడతారన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది.

Related News

AP Politics: సామినేని అంతర్మథనం..

Satyavedu Politics: మారిన ఆదిమూలం స్వరం.. భయమా? మార్పా?

MLA Report: సీటు ఉన్నట్లా? ఊడినట్లా? టీడీపీ నేతల్లో గుబులు..

Vote Chori: రాహూల్ Vs ఈసీ.. అసల సమస్య ఇదే.! ఎవరి వాదన కరెక్ట్.? ఈ 65 లక్షల ఓట్లు మళ్లీ అప్‌‌లోడ్..!

BJP Leaders Fights: డీకే అరుణ Vs శాంతి కుమార్.. పాలమూరు బీజేపీలో పంచాయితీ

TG Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం.. కేసీఆర్ మైండ్ గేమ్

Big Stories

×