Intinti Ramayanam Today Episode January 7th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఇక పార్వతి తన కోడలికి నగలిచ్చి, తిరిగి వచ్చేటప్పుడు దయాకర్ ఆ నగను కావాలని డిమాండ్ చేస్తాడు. కానీ పార్వతి అది మా వంశపారంగా వస్తుంది నెక్లెస్ ఇది మా ఇంటి కోడలకే ఇవ్వాలి నీకు వేరేది కావాలంటే ఇస్తానని అంటుంది. దానికి దయాకర్ అక్షయకు నిజం చెప్తే సరిపోతుంది కదా నేను మిమ్మల్ని అడుక్కోవడమేంటి అన్నట్టుగా మాట్లాడుతాడు. అక్షయకు నేను మేనమామ ని ఈ నిజాన్ని బయట చెప్పకుండా ఉండడానికి మీ ఆయన నాకు ఎంత అడిగితే అంత డబ్బులు ఇస్తున్నాడు ఇక నువ్వు ఇస్తావా లేదా నిజం చెప్పమంటావా అని బెదిరిస్తాడు.. దాంతో భయపడి నగలు ఇచ్చేస్తుంది. ఇక పల్లవి ఆ నెక్లేస్ ను దయాకర్ దగ్గర నుంచి తీసుకుంటుంది. పార్వతి మనసులో గొడవలు సృష్టించాలని అనుకుంటుంది. ఇంట్లో అవనికి అక్షయ్ ఇచ్చినట్లు గిఫ్ట్ ఇస్తుంది. అది చూసిన పార్వతి, భానుమతి షాక్ అవుతారు.. అక్కకడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని ఆ నెక్లెస్ ని వేసుకొని మురిసిపోతూ ఉంటుంది. అది చూసిన భానుమతి పార్వతికి చెప్పాలని పార్వతిని తీసుకొని వస్తుంది. అత్తయ్య ఈ నెక్లెస్ ఎలా ఉందని అడుగుతుంది. ఈ నెక్లెస్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎవరిచ్చారు అని పార్వతి అడుగుతుంది. అయినా నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు అత్తయ్య ఎలా ఉందో చెప్పండి అని అడుగుతుంది అవని. పార్వతీ మనసులో అక్షయ పై అనుమానం మొదలవుతుంది. శ్రీయను అత్తింటికి పంపాలని వాళ్ళ నాన్న అనుకుంటాడు. ఇక భానుమతి పార్వతి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఆ నేక్లెస్ అవని దగ్గరికి ఎలా వెళ్లిందని ఆలోచిస్తూ ఉంటుంది పార్వతి. కానీ ఆ నెక్లెస్ గురించి భానుమతి అడిగితే నేనేం చెప్పలేను అత్తయ్య నేను ఇప్పుడు ఆలోచించే స్థితిలో లేను అనేసి అంటుంది.
పార్వతి ఏం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతుంది. అది చూసిన పల్లవి భానుమతి దగ్గరికి వస్తుంది చూసావా అంటే నీకు దక్కాల్సిన నగని అవని దగ్గరికి ఎలా వెళ్ళిందని అడిగితే పార్వతి చెప్పలేక పోతుంది ఇలా వదలాలనుకుంటున్నావు ఈ విషయాన్ని అనేసి అడుగుతుంది. దానికి పల్లవి షాకింగ్ ఆన్సర్ ఇస్తుంది. మనకు నెక్లెస్ కాదమ్మా ఇంపార్టెంట్ అవని ఇంట్లోంచి బయటికి వెళ్ళడమే నాకు కావాల్సింది అనేసి అంటుంది అక్కడితో భానుమతి కూడా సైలెంట్ అయిపోతుంది. పార్వతి మాత్రం అవని దగ్గరికి ఆ నెక్లెస్ ఎలా వచ్చిందని ఆలోచిస్తూనే ఉంటుంది. ఇక అక్షయ రాత్రి ఇంటికి వస్తాడు. బాగా అలసిపోయిన అమ్మ కాఫీ ఇవ్వు అని కాఫీ అడుగుతాడు. అక్షయ్కు ఆ నగల గురించి దయాకర్ చెప్పిన నిజం గురించి తెలియదనుకుంటాను అందుకే నన్ను ఏమీ అడగలేదని పార్వతి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ విషయం ఎలాగైనా అక్షయ్ ని అడిగి తెలుసుకోవాలని అనుకుంటుంది.
అక్షయ్ ని ఒక మాట అడగాలని అడుగుతుంది. ఏంటో చెప్పమ్మా అనేసి అక్షయ్ అనగానే అది నెక్లెస్ అని అనగానే పల్లవి అక్షయ్ ని అడిగితే అసలు నిజం బయటపడుతుంది అని వెంటనే డ్రామా మొదలు పెడుతుంది. కాలు బెణికి కింద పడిపోయినట్లు యాక్ట్ చేస్తుంది. ఇక పార్వతి పల్లవిని బెడ్ రూమ్ కి తీసుకెళ్తుంది. అక్షయ్ రూమ్ కి వెళ్ళగానే అవని ప్రేమతో పలకరిస్తుంది.. నగల గురించి చెప్పబోతుంది కానీ అక్షయ్ వినడు. స్నానం చేసి వస్తాడు అంతలోకే ఆ నగను చూపించి అడుగుదామని అవని అనుకుంటుంది. కానీ అక్షయ్ ని రాజేంద్ర ప్రసాద్ ప్రాజెక్టు గురించి మాట్లాడాలని తీసుకెళ్ళిపోతాడు. ఇక ఉదయం లేవగానే పార్వతి అక్షయ గురించి అడుగుతుంది. అంతలోకే అక్కడికి శ్రీకర్ వాళ్ళ మామ వస్తాడు. రాజేంద్రప్రసాద్ కోపంగా ఆయన తో మాట్లాడతాడు. శ్రీకర్ ఆస్తి ఇవ్వండి అనేసి గట్టిగా అడుగుతాడు. రాజేంద్ర ప్రసాద్ కోపంతో అతనిపై చిందులేస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో శ్రీకర్ ఇంటికి వస్తే అక్షయ వాళ్ళు బయటికి పంపిస్తారు.. పార్వతి అది చూస్తుంది మరి రేపు ఏం జరుగుతుందో చూడాలి..