BigTV English

Telangana BJP New President: బీజేపీ కొత్త బాస్ ముహూర్తం ఎప్పుడు?

Telangana BJP New President: బీజేపీ కొత్త బాస్ ముహూర్తం ఎప్పుడు?

Telangana BJP New President: తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్ నియామకంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది . కాబోయే కొత్త అధ్యక్షుడి చుట్టే పార్టీలో చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో నెలల తరబడి ఈ సస్పెన్స్ కొనసాగడానికి కారణమేంటి? అధ్యక్షుడి అంశంలో అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతుందా..? ఊహకందని నేతల పేర్లు తెర మీదకు ఎందుకు వస్తున్నాయి..? ఆశావహుల్లో గుబులు, క్యాడర్లో గందరగోళం ఎందుకు కొనసాగుతోంది..? అసలు బీజేపీ ఢిల్లీ పెద్దలు ఎందుకని అంత కన్ఫ్యూజన్‌తో కనిపిస్తున్నారు?


తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిపై తేల్చుకోలేకపోతున్న అధిష్టానం

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి అంశంపై అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతుందనే టాక్ నడుస్తోంది. ఈ నేఫథ్యంలో రాష్ట్ర కమల దళంలో అంతా అయోమయం నెలకొంది. అధ్యక్షుడి పీఠం ఎవరికి అప్పజెప్పాలో హైకమాండ్ తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో రోజు ఒక్కో నేత పేరు తెరమీదకు వస్తుండటంతో రాష్ట్ర అధ్యక్షుడి నియామకం గందరగోళంగా మారిందట. సామాజికవర్గాల సమీకరణాల ప్రకారం ప్రెసిడెంట్ నియామకం ఉంటుందని తొలుత చర్చ జరిగినప్పటికి … తాజాగా రోజుకో నేత, అందులోనూ ఊహకందని నేతల పేర్లు తెర మీదకు వస్తుండటంతో కేడర్ లో గందరగోళం నెలకుంటోంది.


ఉగాది రోజునే అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని ప్రచారం

కొత్త అధ్యక్షుడి ప్రకటన ఎప్పుడెప్పుడా? అని పార్టీ శ్రేణులు వేయి కళ్లతో ఎదురుచూస్తుండగా.. ఆశావహుల్లో మాత్రం గుబులు మొదలైందట.. రోజుకో నేత పేరు ఫోకస్ అవుతుండటంతో స్టేట్ చీఫ్ ఎంపిక జాబితాలో తమ పేరు ఉంటుందో లేదోననే ఆందోళనతో ఆశావహులు సతమతమవుతున్నారంట. అదలా ఉండగా ఉగాది రోజునే అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని పార్టీలో చర్చ జరిగినప్పటికీ. తాజా పరిస్థితుల నేపథ్యంలో స్టేట్ చీఫ్ నియామకం మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నెలాఖరుకైనా అధ్యక్షుడి ఎన్నికపై క్లారిటీ వస్తుందా లేదా అనే అనుమానాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి.

Also Read: చైనాతో యూనస్ దోస్తీ.. ఇండియాపై కుట్రకు ప్లాన్

ఇప్పటికీ నామినేషన్లు స్వీకరించని శోభా కరంద్లాజే

ఉగాది దాటి మళ్ళీ వారం అవుతున్నప్పటికి ఇప్పటి వరకు తెలంగాణ బీజేపీ ఎలక్షన్ ఆఫీసర్‌గా ఉన్న శోభా కరంద్లాజే నామినేషన్లను స్వీకరించలేదు. దాంతో అధ్యక్షుడి ఎంపిక ఆలస్యం అవుతుందనే టాక్ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. మరోవైపు ఏప్రిల్ 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవం ఉంది. కనీసం ఆ రోజుకైనా నామినేషన్లు తీసుకుని స్టేట్ చీఫ్ ఎవరనేది అనౌన్స్ చేస్తారా? లేదా? అని ఆశావవహులు టెన్షన్ పడుతున్నారు.

శోభా కరంద్లాజే రాకకోసం పార్టీ శ్రేణులు ఎదురు చూపు

ఆ క్రమంలో తెలంగాణ బీజేపీ ఎలక్షన్ ఆఫీసర్‌గా ఉన్న శోభా కరంద్లాజే రాకకోసం పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. ఆమె వచ్చిందంటే స్టేట్ చీఫ్ నియామకం ప్రక్రియ మొదలవనుందని, ఆమె వచ్చీ రాగానే నామినేషన్ స్వీకరణ, ఆపై పోటీలో ఉన్నవారితో వన్ టు వన్ మీటింగులు, బుజ్జగింపులు పూర్తిచేసి ప్రెసిడెంట్ ను ప్రక్తించే అవకాశాలున్నాయనేది పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియ అంతా కేవలం ఒక్కరోజులోనే పూర్తయ్యే చాన్స్ కనిపిస్తోంది. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో ఎంతో మంది ఆశావహులు ఉండటంతో ఆమె ఎవరి నుంచి నామినేషన్ స్వీకరిస్తారన్నది సస్పెన్స్‌గా మారింది. దాదాపు ఏడాదికాలంగా స్టేట్ చీఫ్ అంశంపై నెలకొన్న సందిగ్ధతపై అధిష్టానం ఎప్పుడు క్లారిటీ ఇస్తుంది, ఎవరిని ఎంపిక చేస్తుంది అనేది చూడాలి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×