Mahabubabad Crime News: ఓ మహిళతో వివాహేతర బంధాన్ని కొనసాగించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మాస్టర్ ప్లాన్ వేశాడు. చివరకు ఆమె భర్తను అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్ చేశాడు. సంచలనం రేపిన ఈ హత్య ఘటనకు పోలీసులు ఫుల్‌స్టాప్ పెట్టేశారు. అసలేం జరిగింది? ఇంకాస్త డీటేల్స్ లోకి వెళ్తే..
మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గత నెల 31న హత్యకు గురైన హెల్త్ సూపర్‌వైజర్ పార్ధసారథి కేసును ఛేదించారు పోలీసులు. కేవలం వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని అతడి భార్య, ప్రియుడితో కలిసి సొంతం భర్తను హత్య చేయించిందని తేలింది. ఈ విషయాన్ని ఆ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ వెల్లడించారు.
డీటేల్స్‌లోకి వెళ్తే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని జగదీశ్ కాలనీలో ఉంటున్నారు పార్ధసారథి-స్వప్న దంపతులు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. దంతాలపల్లిలో హెల్త్ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు పార్థసారథి. స్వప్న ఇంటికి సమీపంలో టీచర్ విద్యాసాగర్ అద్దెకు ఉండేవారు. ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెల్లిపాకలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.
దాదాపు 9 ఏళ్ల కిందట వీరిద్దరి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత స్నేహానికి దారి తీసింది. పార్ధసారథి-స్వప్న కాపురంలోకి టీచర్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వివాహేతర సంబంధానికి దారితీసింది. అప్పటి నుంచి ఆ దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. స్వప్న విషయం తెలియగానే ఆమె భర్త పార్థసారథి మండిపడ్డారు. దంపతుల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి.
ALSO READ: యూట్యూబ్ చూసి.. రెండు వేళ్లతో ఎలా చంపాడంటే..
పార్ధసారథి వార్నింగ్ ఇచ్చినా స్వప్న లైటుగా తీసుకునేది. ఈ చివరకు పార్థసారథి ఫ్యామిలీ వ్యవహారం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. అయినా స్వప్న-విద్యాసాగర్ మధ్య రిలేషన్ షిప్ కంటిన్యూ అవుతూ వచ్చింది.
ప్లాన్ ఇలా చేశారు?
రోజురోజుకూ భర్త టార్చర్ తట్టుకోలేని స్వప్న, చివరకు భర్తను చంపాలని నిర్ణయానికి వచ్చేసింది. ఈ విషయాన్ని తన ప్రియుడు వెంకట విద్యాసాగర్‌కు చెప్పింది. వెంటనే మాస్టర్ ప్లాన్ వేశాడు ఆమె ప్రియుడు, ప్రభుత్వ టీచర్ వెంకట విద్యాసాగర్. కొత్తగూడెం మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, ఏటపాక మండలానికి చెందిన ఓ వ్యక్తితో మాట్లాడి పార్ధసారథిని హత్య చేయించాలని ప్లాన్ గీశాడు. ముగ్గురు వ్యక్తులకు డీల్ కింద రూ.5 లక్షలకు ఒప్పందం కుదిరింది.
ఉగాది, రంజాన్ సెలవుల నిమిత్తం పార్ధసారథి కొత్తగూడెం వచ్చాడు. మార్చి 31న పార్థసారధి-స్వప్న దంపతులు షాపింగ్ చేశారు. అక్కడి నుంచి బైక్‌పై బయలు దేరారు పార్థసారథి దంపతులు. ఈ విషయాన్ని స్వప్న తన ప్రియుడు వెంకట విద్యాసాగర్‌కు ఫోన్ చేసి చెప్పింది. ఈ దంపతులు వెళ్లే రూట్లలో సుపారీ గ్యాంగ్ కాపుకాసింది. ఆ తర్వాత పార్ధసారథిని వెంబడించింది.
చివరకు మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామ శివారు సమీపంలోకి చేరుకోగానే పార్థసారథిని దారుణంగా హత్య చేశారు. అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. ఘటన తర్వాత స్వప్న తన డ్రామాను మొదలుపెట్టింది. తొలుత పోలీసులు స్వప్న గురించి ఆరా తీశారు.
ఆమెకు వివాహేతర సంబంధం ఉందని గుర్తించారు. ఆపై లోతుగా విచారణ మొదలుపెట్టారు. ఈ కేసులో పార్ధసారథి భార్య స్వప్న, ప్రియుడు వెంకట విద్యాసాగర్‌ను అరెస్ట్ చేశారు. హత్య చేసిన నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అగ్నిసాక్షిగా తాళికట్టించుకున్న భర్త చంపేసింది ఆమె భార్య.