Big Stories

Machilipatnam Assembly Constituency: పేర్ని కిట్టు Vs కొల్లు రవీంద్ర.. పోరు బందరు.. గెలిచేది ఎవరంటే..?

Perni Kittu Vs Kollu Ravindra Who Will in Machilipatnam Assembly Constituency: ఆ నియోజకవర్గంలో వరుసగా ఏడో సారి ఆ ప్యామిలీ మెంబరే పోటీ చేశారు. వైసీపీ నుంచి ఆ కుటుంబానికి చెందిన మూడో తరం ఈసారి బరిలోకి దిగారు. టీడీపీ నుంచి పాత అభ్యర్ధే నాలుగోసారి పోటీ చేశారు. ఈ సారి కూడా ఆ రెండు కుటుంబాలకు చెందిన అభ్యర్థులే పోటీలో ఉండడంతో ఏ కుటుంబానికి చెందిన వ్యక్తి అసెంబ్లీలో అడుగు పెడతారా అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న కొత్త నాయకుడు అసెంబ్లీలో అధ్యక్ష అంటారా? లేక టీడీపీ పాతకాపుమళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతారా? అన్న ఉత్కంఠ నియోజకవర్గవాసుల్లో నెలకొంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది..? అక్కడ పోటీ చేసిందెవరంటారా..?

- Advertisement -

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం.. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పటి నుంచి జిల్లా హెడ్‌క్వార్ట్ అయిన మచిలీపట్నంలో ఈ సారి ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగాయి. వైసీపీ నుంచి ఈ సారి మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య అలియాస్ పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు పోటీ చేశారు. పేర్నినాని పొలిటికల్ రిటైర్‌మెంట్ తీసుకుని తన తనయుడి విజయం కోసం ప్రచారం చేశారు. పేర్ని నాని సైతం తన తండ్రి పేర్ని క‌ృష్ణమూర్తి వారసత్వాన్ని అందిపుచ్చుకునే రాజకీయాల్లోకి వచ్చారు.

- Advertisement -

టీడీపీ ఆవిర్భావం నుంచి మచిలీపట్నంలో పేర్ని ఫ్యామిలీ ఆ పార్టీకి ప్రత్యర్ధిగా ఉంటూ వచ్చింది. 1983లో మొదటి సారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పేర్ని నాని తండ్రి ఓడిపోయారు. 1989లో మొదటి సారిగెలిచిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 1994లో తండ్రి తిరిగి ఓడిపోవడంతో 1999 నాటికి పేర్ని నాని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మొదటిసారి పోటీ చేసి ఓడిపోయిన పేర్ని నాని 2004లో విజయం దక్కించుకున్నారు.. 2009లో కాంగ్రెస్ నుంచి మరోసారి గెలిచిన ఆయన మారిన రాజకీయ పరిణామాలతో జగన్ బాట్ పట్టారు. 2014లో ఓఢిపోయి.. 2019లో గెలుపొందిన నాని వైసీపీ ప్రభుత్వంలో రెండున్నరేళ్లు మంత్రిగా పనిచేశారు.. ఈ సారి తన తనయుడు పేర్ని కిట్టూని పొలిటికల్ స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు.

Also Read: నెల్లూరు పెద్దారెడ్డి ఎవరంటే..

పేర్ని నాని తండ్రికి రాజకీయ ప్రత్యర్ధిగా నడకుదుటి నరసింహారావు మచిలీపట్నం రాజకీయాల్లో చక్రం తిప్పారు. తర్వాత ఆయన 1999లో పేర్ని నానిని కూడా ఓడించారు. నడకుదిటి రాజకీయ వారసత్వాన్ని మచిలీపట్నంలో ఆయన మేనల్లుడు కొల్లు రవీంద్ర కొనసాగిస్తున్నారు. 2009లో మొదటి సారి టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయని కొల్లు రవీంద్ర.. 2014లో పేర్ని నానిని ఓడించి చంద్రబాబు కేబినెట్‌లో పనిచేశారు. గత ఎన్నికల్లో పేర్ని నాని చేతిలో ఓడిపోయిన ఆయన.. ఈ సారి పేర్ని మూడో తరం వారసుడితో పోటీ పడ్డారు. ప్రచారంలో టీడీపీ మేనిఫెస్టోని హైలెట్ చేస్తూ దూసుకుపోయారు.

ఈ ఫ్యామిలీ వారే ఇప్పుడు బందరు వాసుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వైసీపీ నుంచి పేర్ని కిట్టు మొదటిసారి పోటీ చేస్తున్నారు. ఆయన తండ్రి, తాత మొదటిసారి పోటీ చేసినప్పుడు ఓడిపోయారు. ఆ చరిత్రను పేర్ని కిట్టు మారుస్తారా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు తాత, తండ్రి అయిపోయారు ఇప్పుడు కొడుకొచ్చాడు. ఎప్పుడూ ఆ కుటుంబాన్నే మోయాలా? అన్ని సన్నాయినొక్కులు కూడా పోలింగ్ బూత్‌ల దగ్గర వినిపించాయంట.

Also Read: Srikalahasti Politics: బొజ్జల హవా వైసీపీకి ఎదురు దెబ్బ?

ఇక మంత్రిగా ఉన్నప్పుడు పేర్ని నానిపై పెరిగిన ప్రజా వ్యతిరేకత కిట్టు విజయంపై ప్రభావం చూపించే అవకాశాల్ని కొట్టిపారేయలేం అంటున్నారు విశ్లేషకులు.. ఆ వ్యతిరేకత భయంతోనే పేర్ని నాని ఈసారి పోటీకి దూరమై.. కొడుక్కి అవకాశమిచ్చారన్న టాక్ కూడా వినిపిస్తుంది. అదీకాక వైసీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా దాడులు, అరాచకాలు , అక్రమాలు పెరిగిపోయి. పట్టణంలో ప్రశాంతత కరువైందన్న విమర్శలున్నాయి. పోలీసుల అండతో వైసీపీ శ్రేణులు ఇష్ఠానుసారం చెలాయించుకున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరిలాంటి పరిస్థితుల్లో బందరు ఓటర్లు ఈ సారి పోటీ పడిన వారసుల్లో ఎవర్ని ఆదిరిస్తారో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News