Congress Yadav Committee: ఒకవైపు పార్టీ అధికారం లో ఉంది. మరోవైపు నేతలు పదవులు ఆశిస్తున్నారు. కానీ తీరా లిస్ట్ వచ్చేసరికి నిరుత్సాహానికి గురవుతున్నారు. దింతో ఏకంగా గాంధీభవన్‌లో తమ వర్గానికి పదవులు ఇవ్వాలంటూ నిరసనలకు దిగుతున్నారు. ఆయా సామాజికవర్గాల వారి డిమాండ్లపై క్లారిటీ ఇవ్వాల్సిన పీసీసీ, సీఎం మాత్రం వారిపైసీరియస్ అవుతున్నారంట. ఆ క్రమంలో పార్టీ పెద్దలపై పదవులు ఆశిస్తున్న వారు సైతం నారాజ్ అవుతున్నారంట. అసలింతకీ పదవుల పంచాయతీకి సంబంధించి కాంగ్రెస్‌లో జరుగుతున్న చర్చేంటి?
యాదవ వర్గీయుల అసహనం
కాంగ్రెస్ పదవుల్లో ప్రాధాన్యత లేదని యాదవుల అసహనం
కాంగ్రెస్ పార్టీలో పదవుల పంచాయితీ నడుస్తోంది. ముఖ్యంగా ఒక ప్రధాన సామాజికవర్గం పార్టీపై తీవ్ర అసంతృప్తితో కనిపిస్తోంది. బీసీ సామాజికవర్గానికి చెందిన యాదవులు పదవుల విషయంలో తమకు ప్రాధాన్యత తగ్గడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే పార్టీ పీసీసీ కార్యవర్గం లిస్ట్ వచ్చింది. వైస్ ప్రెసిడెంట్ లు, జనరల్ సెక్రటరీలు మొత్తం కలిపి 96 మంది పేర్లు జాబితాలో ఉంటే యాదవ సామాజికవర్గానికి కేవలం ఒకే ఒక పదవి యాదవ సామజికవర్గానికి దక్కింది.
పార్టీ పెద్దలను కలిసి అసహనం వ్యక్తం చేసిన యాదవ నేతలు
దాంతో ఆ సామజికవర్గం నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్‌ని, ఇతర పెద్దలను కలిసి తమ అసహనం వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి రావడానికి తాము ఎంతో కష్టపడ్డామని , బీసీల్లో యాదవ సామజికవర్గం అత్యంత ప్రాధాన్యమైందని, అలాంటి తమకు అన్యాయం జరిగిందటూ ఆవేదన వెల్లగక్కారు. ఆ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ బీసీల్లో తన వర్గీయులకే ప్రాధాన్యత ఇస్తున్నారని, మేము పార్టీని నమ్ముకొని కష్టపడుతున్నా పదవులు రావడం లేదని కొందరు యాదవ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గాంధీభవన్‌కు గొర్రొలను తీసుకొచ్చిన నిరసన
అలాగే క్యాబినెట్‌లో యాదవ సామజివర్గానికి చోటు కల్పించాలని కోరుతున్నారు నేతలు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణలోనూ ఏ పార్టీ అధికారంలో ఉన్నా యాదవ సామజికవర్గానికి క్యాబినెట్‌లో ప్రాధాన్యత ఉండేదాని ఇప్పుడు మాత్రం వారిని పట్టించుకోవడం లేదని వారు విమర్శిస్తున్నారు. ఇటీవలే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన గాంధీభవన్‌లో పీఏసి, అడ్వైయిజరీ కమిటి సమావేశాలు జరిగాయి. ఆ సమయంలో యాదవ సామజివర్గానికి చెందిన సంఘం నాయకులు గొర్రెలు తీసుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు.
నిరసన తెలిపిన నేతలకు సీఎం రేవంత్ వార్నింగ్
దానిపై సీఏం రేవంత్‌రెడ్డి కాస్త గట్టిగానే మందలించిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ లోని నాయకులే ఇదే చేయించారని.. ఇది సరికాదని ఇంకోసారి గాంధీభవన్ లో నిరసనలు, ధర్నాలు చెయవద్దని చేస్తే చర్యలు ఉంటాయని అందరికి కలిపి వార్నింగ్ కూడా ఇచ్చిన్నట్లు ప్రచారం జరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడ్ని కలిసినప్పుడు యాదవ సామజిజవర్గానికి చెందిన నేతలకు పార్టీ లో తప్పనిసరిగా ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారంట. మరోవైపు మీలో ఐక్యత లేదని అందుకే టికెట్ లు ఇచ్చిన గెలిపించుకోలేదని అన్నట్లు సమాచారం.
పార్టీ పదవుల్లో, నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని వినతులు
ఏది ఏమైనా యాదవ సామజికవర్గానికి చెందిన నేతలు మాత్రం పార్టీ పదవుల్లో, క్యాబినెట్లో తమకు అన్యాయం జరిగిందని ఇప్పటికైనా సముచిత న్యాయం చేయాలని, భర్తీ కావాల్సిన పార్టీ పదవులో, నామినేటెడ్ పోస్టుల్లో తగిన ప్రాధన్యత ఇవ్వాలని కోరుతున్నారు. మరి పీసీసీ, సిఏం తీరుపై అసంతృప్తిగా యాదవ సామజికవర్గానికి చెందిన నేతలకు రానున్న రోజులో తగిన ప్రాధాన్యత లభిస్తుందా? లేదా కాంగ్రెస్‌లో ఏ వర్గానికి ఎన్ని పదవులు కట్టబెట్టినా ఇలాంటి నిరసనలు, ధర్నాలు, అసంతృప్తులు సహజమే అని లైట్ తీసుకుంటారో చూడాలి.
Story By Apparao, Bigtv