Brahmamudi serial today Episode: రాజ్‌కు కావ్య ట్రైనింగ్ ఇస్తుంటే దూరం నుంచి రుద్రాణి చూస్తుంది. ఇదేదో పోలీస్ ట్రైనింగ్ ఇస్తున్నట్టు ఇస్తుందే.. అంటే ఏదో పెద్ద ప్లాన్ వేసింది అదేదో తెలుసుకోవాలి. అని మనసులో అనుకుంటుంది. ఇంతలో కావ్య రాజ్‌ను గార్డెన్ లోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఆఫీసులో మీరు లంచ్ చేసిన తర్వాత రిలాక్స్ అవుతారు కదా ఎలా రిలాక్స్ అవుతారో చూపించండి అని అడుగుతుంది కావ్య. ఇలాగే రిలాక్స్ అవుతాను అంటూ పడుకుంటాడు రాజ్. కానీ మా బాస్ ఇలా రెస్ట్ తీసుకోరండి అని చెప్తుంది కావ్య.
మరి ఎలా రిలాక్స్ అవుతారు అని రాజ్ అడగ్గానే అది ఇంకో రకంగా అండి అని చెప్తుంది కావ్య. దీంతో మనిషి అన్నవాడు ఎవడైనా ఇలాగే రిలాక్స్ అవుతాడండి అని చెప్తాడు రాజ్. దీంతో కావ్య ఇలా అయ్యేవాళ్లను పనోళ్లు అంటారు. మా బాస్ అలా అవ్వరు అని చెప్పగానే.. రాజ్ కోపంగా ఎవడండి మీ బాస్ అంటూ అడగ్గానే.. కావ్య రామ్ గారు మీరే చెప్పారు కదా మా బాస్‌లా చేస్తానని మళ్లీ ఇలా కొప్పడతారేంటి మీ వల్ల కాదంటే చెప్పండి అని కావ్య అనగానే.. ఓ సరే కళావతి గారు.. చేస్తాను.. చెప్పండి ఎలా రిలాక్స్ అయ్యేవారో అని అడుగుతాడు. దీంతో కావ్య రాజ్ ఎలా రిలాక్స్ అయ్యేవాడో చూపిస్తుంది. కావ్య చూపించినట్టు చేయడానికి రాజ్ నానా తంటాలు పడుతుంటాడు.
అంతా గమనిస్తున్న రుద్రాణి వెంటనే యామినికి ఫోన్ చేసి ఇక్కడ కొంపలు అంటుకుపోతుంటే నువ్వు కూల్‌గా ఉన్నావా..? అంటూ తిడుతుంది. ఏం జరిగిందో విషయం చెప్పకుండా అలా మాట్లాడతారేంటి..? మ్యాటర్ ఏంటో చెప్పండి సొల్యూషన్ ఏంటో నేను చెప్తాను అంటుంది యామిని. దీంతో రుద్రాణి ఆ కావ్య, రాజ్‌కు కంపెనీ ఎండీగా ట్రైనింగ్ ఇస్తుంది అని చెప్పగానే యామిని నవ్వుతుంది. నేను ఇంత సీరియస్ మ్యాటర్ చెప్తుంటే నువ్వు నవ్వుతావేంటి..? రేపు ఆ రాజ్ గానీ గతం గుర్తొచ్చిన రాజ్‌లా వచ్చాడంటే ఇక మన ప్లాన్స్ అన్నీ స్మాష్ అయిపోతాయి.. ఏదో ఒకటి చేసి ఆ రాజ్ ఆఫీసుకు రాకుండా చేయ్ అని చెప్తుంది. దీంతో యామిని మీరేం టెన్షన్ పడకండి ఆ కావ్య తీసుకునే గుంతలో కావ్యనే పడే ప్లాన్ నేను వేస్తాను కదా అంటూ కాల్ కట్ చేస్తుంది.
నగలు తీసుకుని కోపంగా అక్కా అంటూ వస్తుంది అప్పు. అప్పును చూసిన స్వప్న ఏంటి అప్పు నగలకు మెరుగు పెట్టించడం అప్పుడే అయిపోయిందా..? అని అడుగుతుంది. దీంతో అప్పు కోపంగా ఏంటి అయిపోయేది నీకు నన్ను పూల్ చేయాలని అంత సరదాగా ఉంటే ఏ ఏఫ్రిల్ ఫస్ట్‌కో చేసుకో కానీ ఇలా గిల్టీ నగలు ఇచ్చి అందరి ముందు నేను తల దించుకునేలా చేయకు అక్క అంటుంది. దీంతో గిల్టీ నగలా ఏం మాట్లాడుతున్నావు నేను నిన్ను పూల్ చేయాలనుకోవడం ఏంటి..? నీకు గిల్ట్ నగలు ఇవ్వడం ఏంటి..? అని అడుగుతుంది. దీంతో అప్పు లేకపోతే వీటిని ఏమంటారు..? వర్జినల్ నగలు అంటారా..? అని అడుగుతుంది. అవును అప్పు నేను నీకు ఇచ్చింది నా ఏడు వారాల నగలు అప్పు నాకు తాతయ్యగారు ఇచ్చింది ఇవే అప్పు వీటిని గిల్ట్ నగలు అంటావేంటి అంటుంది.
దీంతో నేను అనడం కాదక్కా కంపెనీ వాడు చెక్ చేసి మరీ చెప్పాడు ఇవి రోల్డ్ గోల్డ్ అని అంటూ అప్పు చెప్పగానే స్వప్న కంగారు పడుతుంది. వెంటనే రాహుల్ నగలు మార్చిన విషయం గుర్తు చేసుకుని ఇది ఎవరి పనో నాకు అర్థం అయింది అప్పు.. ఆ రోజు రాహుల్ నా నగలు దొంగతనం చేయాలనుకోలేదు. ఆల్‌రెడీ వర్జినల్ నగలు తీసుకెళ్లి గిల్ట్ నగలు ఇక్కడ పెట్టాడు అని స్వప్న చెప్తుంది. రాహుల్‌ను స్పై చేసి అసలు నిజం కనిపెట్టాలి అని చెప్తుంది స్వప్న. అలాగే అక్కా అంటుంది అప్పు. అనుకున్నట్టు గానే స్వప్న.. రాహుల్‌ను పట్టుకోవడానికి ప్లాన్ చేస్తుంది. ప్లాన్ వర్కవుట్ అవుతుంది. స్వప్న ఉచ్చులో రాహుల్ చిక్కుకుంటాడు.
తర్వాత మరుసటి రోజు రాజ్, కావ్యకు చెప్పకుండా ఆఫీసుకు వెళ్తాడు.. స్టాఫ్‌తో తికమక ప్రవర్తిస్తుంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?