E-Paper
Advertisement

పెంచి ఇవ్వకున్నా.. పింఛన్లు పెంచారు! కొత్తగా 4,50 లక్షల మందికి పింఛన్లు..! రూ. 110కోట్ల అదనపు భారం!

పెంచి ఇవ్వకున్నా.. పింఛన్లు పెంచారు! కొత్తగా 4,50 లక్షల మందికి పింఛన్లు..! రూ. 110కోట్ల అదనపు భారం!
Advertisement

కరువు వేళ కరెక్టు సమయానికి చేయూతగా నిలిచింది సర్కార్‌. చేయూత కొత్త పింఛన్ల ద్వారా ఏళ్లుగా ఎదురు చూస్తున్న కొత్త లబ్దిదారులకు ఇప్పటికి మోక్షం లభించింది. ఎన్నికల హామీలో భాగంగా రెట్టింపు చేసి ఇస్తామన్న పింఛన్‌ ఇవ్వలేకపోయినా.. ఉన్న ‘ఆసరా’నే యథావిధిగా అమలు చేస్తున్నా.. కొత్త వారి సంఖ్యను మాత్రం గణనీయంగా పెంచడం ఎంతో ఊరటనిస్తోంది.

4.50 లక్షల మంది కొత్త వారికి చేయూత పింఛన్లను అమలు చేస్తూ సర్కార్‌ దీపావళి కానుక ప్రకటించింది. కొడంగల్‌ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ తీపి కబురు చెప్పారు. ఈనెల నుంచి కొత్త వారికి కూడా పింఛన్‌ సౌకర్యం లభించనుంది. ఈ నెల 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేటలో జరిగే సీఎం భారీ బహిరంగ సభలో ఈ కొత్త లబ్దిదారుల ఖాతాల్లో చేయూత పింఛన్‌ పైసలు జమ కానున్నాయి.

Advertisement

కొత్తగా ఇస్తున్న చేయూత పింఛన్లలో 3 లక్షల మంది దాకా వితంతువులు, ఒంటరి మహిళలే ఉండటం గమనార్హం. దీనిపై సర్కార్‌ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ. 2,500 ఇస్తామనే హామీనిచ్చింది కాంగ్రెస్‌. దాన్ని అమలు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. అందుకే ఈ చేయూత పథకంలోనే వితంతువులకు, ఒంటరి మహిళలకు అత్యంత ప్రయార్టీ ఇచ్చారు. అందుకే కొత్త వాటిలో వీరి సంఖ్యే సింహభాగంగా ఉంది.

ఇక మిగిలిన దాంట్లో లక్ష పింఛన్లు దివ్యాంగులకు కేటాయించారు. చాలా రోజులుగా దివ్యాంగులు ఈ చేయూత పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా లక్ష మందికి సర్కార్‌ అవకాశం ఇవ్వడంతో వారికి ఇది ఊతకర్రగా నిలుస్తోందంటున్నారు. ఇక మిగిలిన 50వేల పింఛన్లలో చేనేత కార్మికులు, గీత కార్మికులకు ప్రయార్టీ ఇచ్చారు. దీనిపైనా మంచి స్పందనా వస్తోంది. బీసీలకు ఈ చేయూత పథకం ద్వారా పెద్ద ఎత్తున ఊతం దొరికిందనే భావన కలుగుతోంది.

Advertisement

గతంలో కేసీఆర్‌ సర్కార్‌ ఆసరా పేరుతో పింఛన్లను అందించింది. అవే పించన్లను కాంగ్రెస్‌ సర్కార్‌ చేయూత పేరుతో ఇస్తున్నది. అయితే ఎన్నికల సమయంలో ఈ పింఛన్ల పెంపుపై ఇరు పార్టీలు పోటాపోటీ ప్రచారం చేసుకున్నాయి. అప్పటికే పెరిగిపోయిన భారీ సంక్షేమ పథకాల జాబితా కారణంగా బడ్జెట్ పై భారం పడింది. దీంతో కాంగ్రెస్‌తో ఈ విషయంలో పోటీ పడలేకపోయింది ఆనాడు కేసీఆర్‌ సర్కార్‌.

కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో తాము అధికారంలోకి రాగానే పింఛన్‌లను డబుల్‌ చేస్తామన్నారు. అంటే, కేసీఆర్‌ సర్కార్‌ ఇచ్చే రూ. 2వేల పింఛన్‌ను తాము వస్తే రూ. 4వేలు చేస్తామన్నారు. కేసీఆర్‌ సర్కార్‌  తాము కూడా పింఛన్లను పెంచుతామని చెబుతూనే.. ఏడాది వారీగా రూ. 500 చొప్పున పెంచుతూ పోతామని చెప్పింది. అంటే ఐదేళ్ల కాలంలో రూ. 4వేలుగా పింఛన్లను పెంచుతామని చెప్పింది. కానీ కాంగ్రెస్‌ వైపే ఓటర్లు మొగ్గు చూపారు.

ఒకేసారి పింఛన్లు డబుల్‌ అయ్యే అవకాశానికి ఓటర్లు బాగా ఆకర్షితులయ్యారనే చెప్పాలి. కానీ, కాంగ్రెస్‌ సర్కార్‌ అధికారంలోకి రాగానే సీఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత.. రాష్ట్ర బడ్జెట్, అప్పుల భారంపై ప్రజలకు విడమర్చి చెప్పే ప్రయత్నం చేశారు. ఇంతటి ఘోరమైన ఆర్థిక దుస్థితి ఉందని ముందు తెలియదని, అందుకే అనుకున్న విధంగా ఇచ్చిన హామీలను ఇప్పుడప్పడే అమలు చేయలేమనే విధంగానే ఆది నుంచి ఆయన కామెంట్స్‌ ఉంటున్నాయి.

తాజాగా మూడేండ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో కొత్తగా 4.50 లక్షల కొత్త పింఛన్లు ఇచ్చినా.. ఆ పాత ఆసరా రేటు పింఛన్లే ఇస్తోంది కాంగ్రెస్‌ సర్కార్‌. ఎన్నికల చివరి ఏడాదిమైనా పెంచి ఇస్తారా? అనే చర్చ కూడా ప్రస్తుతం జరుగుతోంది. అయితే కరువు వేళ.. పింఛన్ల అమౌంట్‌ పెంచకున్నా.. కొత్త పింఛన్లను మంజూరీ చేయడం అదే పదివేలు అనుకుంటున్నారు జనం. ఎందుకంటే ఆర్థిక భారాన్ని సాకుగా చూపి ఈ పింఛన్లను కూడా వాయిదా వేస్తూ పోతే.. చేసేదేం లేదు కదా!

అందుకే ఈ కొత్త పింఛన్ల మంజూరు ఆ కుటుంబాలకు ఆర్థిక దన్నును ఇవ్వనుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి వరకు 40.44 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. తాజాగా పెరిగిన కొత్త పింఛన్లతో కలుపుకుంటే అది 45 లక్షలకు చేరింది. వీటి కోసం నెలకు రూ. 1050 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లిస్తోంది. కొత్తగా పెరిగిన పింఛన్ల ద్వారా సర్కార్‌ ఖజానాపై అదనంగా రూ. 110 కోట్ల వరకు భారం పడింది.

కాంగ్రెస్‌ ఎన్నికల హామీలో భాగంగా సాధారణ పింఛన్లకు రూ. 4వేలు, దివ్యాంగులకు రూ. 6వేలు పెంచి ఇస్తే.. నెలకు దాదాపుగా రూ. 1960 కోట్ల మేర బడ్జెట్‌పై భారం పడనుంది.

Tags

Related News

ఏపీ స్థానిక పోరులో కూటమి హవా.. కానీ ఆ ఓక్క జిల్లాలో టీడీపీకి సీన్ రివర్స్?

కాంగ్రెస్ సర్కార్‌ పై బీఆర్‌ఎస్ భారీ స్కెచ్.. ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

రాహుల్‌ గాంధీ.. రైజింగ్‌ స్టార్‌గా ఎదుగుతున్నారా?

స్థానిక నేతలకు బీఆర్ఎస్ ప్రత్యేక బాధ్యతలు.. మారనన్న పొలిటికల్ సీన్?

ఢిల్లీని మింగేస్తున్న అదృశ్య మృత్యువు.. గాలి పీల్చినా విషమే.. అసలు ఏమైంది?

పల్లె పల్లెకూ హైస్పీడ్ ఇంటర్నెట్.. రూ. 3,189 కోట్లతో తెలంగాణలో ‘డిజిటల్ విప్లవం’!

జీహెచ్‌ఎంసీ అడ్వర్టైజ్‌మెంట్‌లో కోట్ల కుంభకోణం.. పట్టించుకోని అధికారులు!

Big Stories

Advertisement
×